అన్వేషించండి

స్పామ్ కాల్స్, నకిలీ ఆఫర్లతో ఇబ్బంది పడుతున్నారా? ఈ రెండు ప్రభుత్వ యాప్‌లు మీ సమస్యను పరిష్కరిస్తాయి!

DND యాప్ ద్వారా, ఏదైనా అనుమానాస్పద నంబర్ నుంచి వచ్చే కాల్స్, SMSపై ఫిర్యాదు చేయవచ్చు. నెట్‌వర్క్ నాణ్యతను మెరుగుపరచడంలో MySpeed ​​యాప్ సహాయపడుతుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • TRAI రెండు కొత్త యాప్‌లను విడుదల చేసింది, స్పామ్ కాల్స్ నిరోధించడంలో సహాయపడుతుంది.
  • DND యాప్ స్పామ్ కాల్స్, మెసేజ్‌లపై ఫిర్యాదులను స్వీకరించి, ట్రాక్ చేస్తుంది.
  • MySpeed యాప్ నెట్‌వర్క్ వేగం, కాల్ నాణ్యతను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది.
  • రెండు యాప్‌లు Android, iOSలలో అందుబాటులో ఉన్నాయి, వినియోగదారుల గోప్యతను కాపాడతాయి.

దేశంలోని లక్షల మంది మొబైల్ వినియోగదారులకు స్పామ్‌ కాల్స్, మోసపూరిత ఆఫర్లు,  రోజంతా ఫోన్లు మోగడంతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యను పరిష్కరిస్తూ, టెలికాం నియంత్రణ సంస్థ TRAI వినియోగదారుల కోసం రెండు కొత్త, అప్‌గ్రేడెడ్ మొబైల్ యాప్‌లను తీసుకొచ్చింది. ఈ యాప్‌లు ఇప్పుడు స్పామ్ కాల్స్, స్పామ్‌ మెసేజ్‌లపై నేరుగా చర్య తీసుకోవడం సాధ్యమవుతుంది. సాధారణ వినియోగదారులు మొబైల్ నెట్‌వర్క్‌ల లైవ్‌ స్టాటస్‌ వ్యక్తిగతంగా అంచనా వేయగలరని ప్రభుత్వం పేర్కొంది.

ప్రభుత్వం ప్రారంభించిన రెండు యాప్‌లు ఇవే!

ప్రభుత్వం ప్రారంభించిన రెండు కొత్త యాప్‌లలో TRAI DND యాప్ ఒకటి, TRAI MySpeed ​​యాప్ ఒకటి. TRAI DND యాప్ ఇప్పుడు టెలిమార్కెటర్లు లేదా అనుమానాస్పద నంబర్‌ల నుంచి వచ్చే కాల్‌లు, SMSలను నియంత్రిస్తుంది. వాటిపై ఫిర్యాదులు స్వీకరిస్తుంది. ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత, వినియోగదారులకు ఫిర్యాదు రిఫరెన్స్ నంబర్‌ వస్తుంది. సంబంధిత టెలికాం కంపెనీ TRAI నిబంధనల ప్రకారం చర్య తీసుకోవలసి ఉంటుంది.

DND యాప్ వినియోగదారుల గోప్యత కాపాడుతుంది

ముఖ్యంగా, ఫిర్యాదు చేసిన తర్వాత, వినియోగదారులు తమ కంప్లైంట్‌ ఏ స్థితిలో ఉందో ట్రాక్ చేయవచ్చు. TRAI ప్రకారం, కొత్త DND యాప్ వినియోగదారు గోప్యతను కాపాడుతుంది. స్పామ్ గుర్తింపును సులభతరం చేయడానికి యాప్ కాల్ లాగ్‌లు, మెసేజ్‌లను యాక్సెస్‌ చేయాలా అని అడుగుతుంది. యాప్‌లో యాక్సెస్‌ ఇవ్వడం ఇష్టం లేకుంటే మీకు వచ్చే స్పామ్ కాల్స్‌పై మాన్యువల్‌గా ఫిర్యాదు చేయవచ్చు. 

మైస్పీడ్ యాప్ నెట్‌వర్క్ నాణ్యత పెంచుతుంది

ప్రస్తుతం స్పామ్ కాల్స్ మాత్రమే ప్రధాన సమస్య కాదు. కానీ ఇంటర్నెట్ సరిగా లేకపోవడం కూడా ఒక ప్రధాన సమస్య మారుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, TRAI కొత్త ఫీచర్లతో MySpeed ​​యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌తో, వినియోగదారులు తమ మొబైల్ ఇంటర్నెట్ డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగాన్ని చూసుకోవచ్చు. నెట్‌వర్క్ ఆలస్యం, కాల్ జాప్యం, డేటా నాణ్యతను మాన్యువల్‌గా పర్యవేక్షించవచ్చు.

TRAI ప్రకారం, MySpeed ​​యాప్ నుంచి పొందిన డేటా నెట్‌వర్క్ నాణ్యతను మెరుగుపరచడంలో నియంత్రణ సంస్థలు, టెలికాం కంపెనీలకు సహాయపడుతుంది. TRAI డేటా ప్రకారం, 2025లో DND యాప్ ద్వారా 1.7 మిలియన్లకు పైగా స్పామ్ ఫిర్యాదులు  అందాయి. ఇది దేశంలో స్పామ్ కాల్స్ ఎంత తీవ్రమైన సమస్యగా మారాయో, వాటి వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతుంది.  

రెండు యాప్‌లు Android, iOS ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి .

కొత్త, అప్‌గ్రేడ్ చేసిన TRAI DND, MySpeed ​​యాప్‌లు Android, iOS ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని స్పామ్ కాల్‌లు, నెట్‌వర్క్ సమస్యలను నివేదించాలని TRAI ప్రజలను కోరింది. దీంతో స్పామ్‌ కాల్‌లు, పేలవమైన నెట్‌వర్క్ కవరేజ్‌పై ఫిర్యాదులు స్వీకరించడమే కాకుండా చర్యలు కూడా తీసుకుంటోంది. ఈ రెండు ప్రభుత్వ యాప్‌లు సాధారణ మొబైల్ వినియోగదారులకు ఆయుధాలుగా మారుతాయి.                      

Frequently Asked Questions

స్పామ్ కాల్స్, మెసేజ్‌లను నియంత్రించడానికి TRAI ఏ యాప్‌లను తీసుకొచ్చింది?

TRAI, స్పామ్ కాల్స్, మోసపూరిత ఆఫర్లను నియంత్రించడానికి TRAI DND మరియు TRAI MySpeed అనే రెండు కొత్త, అప్‌గ్రేడెడ్ మొబైల్ యాప్‌లను తీసుకొచ్చింది.

TRAI DND యాప్ ఎలా పనిచేస్తుంది?

TRAI DND యాప్ టెలిమార్కెటర్లు లేదా అనుమానాస్పద నంబర్‌ల నుంచి వచ్చే కాల్‌లు, SMSలపై ఫిర్యాదులను స్వీకరిస్తుంది. ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత, సంబంధిత టెలికాం కంపెనీ TRAI నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటుంది.

TRAI MySpeed యాప్‌తో వినియోగదారులు ఏమి చేయవచ్చు?

MySpeed యాప్‌తో, వినియోగదారులు తమ మొబైల్ ఇంటర్నెట్ డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగాన్ని చూసుకోవచ్చు. నెట్‌వర్క్ ఆలస్యం, కాల్ జాప్యం, డేటా నాణ్యతను కూడా పర్యవేక్షించవచ్చు.

ఈ రెండు యాప్‌లు ఏ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి?

కొత్త TRAI DND, MySpeed యాప్‌లు Android, iOS ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget