అన్వేషించండి

Karnataka: కర్ణాటకలో ఫ్రీ బస్ స్కీమ్ ఎత్తేస్తున్నారా ? -ఇదిగో సిద్దరామయ్య క్లారిటీ

Free bus travel: కర్ణాటకలో ఫ్రీ బస్ స్కీమ్ ఎత్తేస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. దీనికి డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలే కారణం. ఇప్పుడు దీనిపై సీఎం క్లారిటీ ఇచ్చారు.

Karnataka to revoke Shakti free bus travel scheme for women:  మహిళలు డబ్బులు పెట్టి బస్సులో ప్రయాణం చేయడానికి రెడీగా ఉన్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలతో ఆ రాష్ట్రంలో రాజకీయ కలకలం ప్రారంభమయింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కర్ణాటక ప్రభుత్వం కొనసాగిస్తోంది. దీని వల్ల పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతూండటంతో తగ్గించకోవాలన్న ఆలోచన చేస్తోందని అందుకే ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్ ను రద్దు చేయాలని అనుకుంటోందని ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం శివకుమార్ వ్యాఖ్యలు ఉన్నాయని మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్న శక్తి స్కీమ్ ను రద్దు చేసే ప్రతిపాదనేది లేదని స్పష్టం చేశారు.               

లండన్‌ నుంచి భారత్‌కు లక్షా 2 వేల కిలోల బంగారం - ధనత్రయోదశీని ఆర్బీఐ అలా ప్లాన్ చేసింది !

మహిళలు ఏమనుకుంటున్నారో.. ప్రభుత్వానికి ఎం చెబుతున్నారో మాత్రమే శివకుమార్ చెప్పారని .. శక్తి స్కీమ్ రద్దు గురించి కాదని సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఈ విషయం శివకుమార్ ఏం మాట్లాడారో పూర్తిగా తెలియదని తెలుసుకుంటానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో శక్తి స్కీమును రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అలాంటి ప్రతిపాదన కూడా లేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదని అనేక మంది తనకు మెయిల్స్ చేస్తున్నారని ట్వీట్లు చేస్తున్నారని శివకుమార్ బుధవారం మీడియాతో వ్యాఖ్యానించారు. కొంత మంది మహిళలు టిక్కెట్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. దీనిపై తాము కూర్చుని చర్చించాల్సి ఉందన్నారు. ట్రాన్స్ పోర్టు మినిస్టర్ రామలింగారెడ్డితో పాటు చర్చించి.. ఏం చేయాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. 

మన ప్రకృతి వైద్యం పవర్ అలాంటిది - సీక్రెట్‌గా వచ్చి ట్రీట్‌మెంట్ చేయించుకున్న బ్రిటన్ రాజు, రాణి !

డీకే శివకుమార్ మాటలు స్కీమ్ ను ఎత్తేసేందుకు చేస్తున్న ప్రతిపాదనల్లాగే ఉండటంతో మీడియాలో విస్తృ ప్రచారం జరిగింది. ఈ అంశంపై విపక్షాలు విమర్సలు ప్రారంభించాయి. ఈ క్రమంలో వెంటనే  సిద్దరామయ్య కవర్ చేసేందుకు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. స్కీమ్ ను రద్దు చేసేందుకు అవకాశం లేదని ఆయన తేల్చేశారు.  కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్   పార్టీ గెలవడానికి ఈ స్కీమే ప్రధాన కారణం. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం రూ. 7,500 కోట్లకుపైగానే ఖర్చు చేసింది. 311  కోట్ల ఫ్రీ బస్ రైడ్స్ ను మహిళలు వినియోగించుకున్నారు. 2023 జూన్ 11నుంచి కర్ణాటకలో ఫ్రీబస్ స్కీమ్ అమలు అవుతోంది.                         

కర్ణాటక ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఐదు గ్యారంటీలు ఇచ్చింది. వాటిని అమలు చేసేందుకు తంటాలు పడుతోంది. పలుమార్లు పన్నులు పెంచారు. అభివృద్ధికి నిధులు తగ్గిపోయాయి. ఈ పథకాల భారం పెరిగిపోతూండటంతో కర్ణాటక ప్రభుత్వానికి సమస్యగా మారింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan : ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
TTD Chairman: తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
Andhra News: దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
Bagheera Review: బఘీర రివ్యూ: ప్రశాంత్ నీల్ రాసిన బెంగళూరు బ్యాట్‌మ్యాన్ కథ - సినిమా ఎలా ఉంది?
బఘీర రివ్యూ: ప్రశాంత్ నీల్ రాసిన బెంగళూరు బ్యాట్‌మ్యాన్ కథ - సినిమా ఎలా ఉంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఎన్నికల ప్రచారంలో చెత్త ట్రక్ తోలిన ట్రంప్టీటీడీ ఛైర్మన్‌‌గా బీఆర్ నాయుడు, అధికారిక ప్రకటనబిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్SS Rajamouli Lion Update | వైల్డ్ సఫారీ ఫోటోలతో హింట్స్ ఇస్తున్న రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan : ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
TTD Chairman: తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
Andhra News: దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
దీపావళి రోజున ఏపీలో తీవ్ర విషాదాలు - వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది మృతి, ఉల్లిపాయ బాంబు పేలి వ్యక్తి శరీరం ఛిద్రం
Bagheera Review: బఘీర రివ్యూ: ప్రశాంత్ నీల్ రాసిన బెంగళూరు బ్యాట్‌మ్యాన్ కథ - సినిమా ఎలా ఉంది?
బఘీర రివ్యూ: ప్రశాంత్ నీల్ రాసిన బెంగళూరు బ్యాట్‌మ్యాన్ కథ - సినిమా ఎలా ఉంది?
Google News: గూగుల్‌తో మంత్రి నారా లోకేష్ చర్చలు- విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు రిక్వస్ట్
గూగుల్‌తో మంత్రి నారా లోకేష్ చర్చలు- విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు రిక్వస్ట్
Anasuya Bharadwaj: అనసూయ దీపావళి సంబరాలు - వెలుగుల్లో స్టార్ యాక్ట్రెస్
అనసూయ దీపావళి సంబరాలు - వెలుగుల్లో స్టార్ యాక్ట్రెస్
Ekta Diwas 2024: ఉగ్రవాద మాస్టార్లూ లగేజ్ సర్దుకొని బయల్దేరండీ- గుజరాత్‌ నుంచి మోదీ వార్నింగ్
ఉగ్రవాద మాస్టార్లూ లగేజ్ సర్దుకొని బయల్దేరండీ- గుజరాత్‌ నుంచి మోదీ వార్నింగ్
Amaran Movie Review - అమరన్ రివ్యూ: శివకార్తికేయన్ కెరీర్ బెస్ట్ సినిమా అనొచ్చా? - మరి సాయి పల్లవి నటన?
అమరన్ రివ్యూ: శివకార్తికేయన్ కెరీర్ బెస్ట్ సినిమా అనొచ్చా? - మరి సాయి పల్లవి నటన?
Embed widget