Karnataka Govt Formation: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా శివకుమార్
Karnataka Govt Formation: కర్ణాటక ముఖ్యమంత్రిగా దాదాపు సిద్దరామయ్య పేరు ఖరారైనట్టు సమాచారం.

Background
Karnataka Govt Formation:
కర్ణాటకలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి సీఎం పదవిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. డీకే శివకుమార్ ఈ నెల 15వ తేదీనే ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ...కొన్ని కారణాల వల్ల ఆయన ఆ రోజు వెళ్లలేదు. మరుసటి రోజుఢిల్లీ వెళ్లిన శివకుమార్...ఖర్గేతో స్పెషల్‌గా మీట్ అయ్యారు. దాదాపు అరగంట పాటు ఇద్దరూ చర్చించారు. ఈ సమయంలోనే శివకుమార్...తాను ముఖ్యమంత్రి అవ్వాలని ఆసక్తి చూపుతున్నట్టు చెప్పారు. శివకుమార్ అలా వెళ్లిపోగానే...సిద్దరామయ్య ఖర్గే ఇంటికి వచ్చారు. ఆ తరవాత సిద్దరామయ్య కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తోనూ భేటీ అయ్యారు. అంతకు ముందు రాహుల్ గాంధీ...ఖర్గే నివాసానికి వెళ్లారు. దాదాపు గంటన్నర పాటు చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటు, సీఎం పేరు ఖరారు అంశాలపై డిస్కస్ చేశారు. వీళ్లిద్దరితో పాటు సీఎం రేసులో ఉన్న జీ పరమేశ్వర కూడా స్పందించారు. హైకమాండ్ ఆదేశిస్తే...ఆ కుర్చీలో కూర్చునేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయితే..ఫైనల్‌గా సోనియా గాంధీని కలిశాకే నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. అప్పటి వరకూ ఈ సస్పెన్స్‌కి తెరపడేలా లేదు. ఇదిగో అప్పుడు ఇప్పుడు అంటూ కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పటికీ...ఫైనల్ డిసిషన్ వచ్చేంత వరకూ ఉత్కంఠ తప్పేలా లేదు.
చివరి ఎన్నికలు అని చెప్పిన సిద్ధరామయ్య గతంలోనే సీఎంగా సేవలు అందించారు. అందులోనూ ఆయన జేడీఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేత. మరోవైపు కాంగ్రెస్ పార్టీతోనే మొత్తం పొలిటికల్ కెరీర్ కొనసాగించిన డీకే శివకుమార్ తనకు ఎలాగైన సీఎం పదవి వస్తుందని ధీమాగా ఉన్నారు. ఎన్నికల్లో తన కష్టం గుర్తించి అధిష్టానం తనకు ఛాన్స్ ఇస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తానని సోనియాకు మాటిచ్చాను, చెప్పినట్లుగానే గెలిపించి చూపించానంటున్నారు డీకే. ఇక అధిష్టానం తనకు అనుకూల నిర్ణయం తీసుకుంటుందని కొండంత ఆశగా ఉన్నారు.సీఎం పదవి ఒక్కరికి ఇవ్వాలా, లేక చెరో రెండున్నరేళ్లతో మధ్యే మార్గంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే చెరో రెండున్నరేళ్లు ఇచ్చినా, మొదట తనకే ఇవ్వాలంటూ సిద్ధరామయ్య, శివకుమార్ పార్టీ హైకమాండ్ ను కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా శివకుమార్
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసినట్టు ఏఎన్‌ఐ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏకాభిప్రాయానికి వచ్చారని పేర్కొంది. మే 20న బెంగళూరులో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుందని తెలుస్తోంది.
రాహుల్‌తో భేటీ
సీఎం రేసులో ఉన్న డీకే శివకుమార్, సిద్దరామయ్య రాహుల్ గాంధీని కలిశారు. సీఎం పేరు ఖరారైందన్న వార్తల నేపథ్యంలో ఇలా సమావేశమవడం ఆసక్తికరంగా మారింది.
Karnataka Congress president DK Shivakumar and senior leader Siddaramaiah met Rahul Gandhi in Delhi. pic.twitter.com/LqJ3v5bx5S
— ANI (@ANI) May 17, 2023





















