Karnataka Elections 2023: టిప్పు సుల్తాన్ జయంతి జరపాలంటే పాకిస్థాన్‌కు వెళ్లిపోండి, కాంగ్రెస్‌పై అసోం సీఎం ఆగ్రహం
Karnataka Elections 2023: టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు జరపాలనుకుంటే కాంగ్రెస్ పాకిస్థాన్ వెళ్లిపోవచ్చని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఫైర్ అయ్యారు.
Karnataka Elections 2023:
కర్ణాటకలో ప్రచారం..
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన డీకే శివకుమార్‌ను టార్గెట్ చేశారు. సిద్దరామయ్యపైనా ఫైర్ అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం PFI (Popular Front of India)కి కేంద్రంగా మారుతుందని ఆరోపించారు. శివకుమార్, సిద్దరామయ్య టిప్పు సుల్తాన్ ఫ్యామిలీకి చెందిన వాళ్లని మండి పడ్డారు. టిప్పు సుల్తాన్ జయంతిని సెలబ్రేట్ చేస్తామని సిద్దరామయ్య హామీ ఇవ్వడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.
"డీకే శివకుమార్ టిప్పు సుల్తాన్ కుటుంబ సభ్యుడిలా మాట్లాడుతున్నారు. గుర్తుంచుకోండి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటక PFI వ్యాలీగా మారిపోతుంది"
- హిమంత బిశ్వశర్మ, అసోం సీఎం
#WATCH | "DK Shivakumar is a family member of Tipu Sultan. If Congress will regain power, Karnataka will become a PFI valley," says Assam CM Himanta Biswa Sarma in Gonikoppa, Karnataka pic.twitter.com/tdJcXvHQrA
— ANI (@ANI) May 6, 2023
టిప్పు సుల్తాన్ చుట్టూ కర్ణాటక రాజకీయాలు తిరుగుతున్నాయి. మార్చి నెలలోనే బీజేపీ సుల్తాన్ పాలనపై తీవ్ర విమర్శలు చేసింది. హిందువులను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని, హిందూ వర్గాన్ని అణిచివేశారని మండి పడింది. ఈశాన్య రాష్ట్రాలనూ ఆక్రమించేందుకు టిప్పు సుల్తాన్ ప్రయత్నించినా...అక్కడి ప్రజలు తిప్పికొట్టారని స్పష్టం చేసింది బీజేపీ. ఇదే విషయాన్ని హిమంత బిశ్వ శర్మ మరోసారి ప్రస్తావించారు.
"అసోంపైనా మొఘల్స్ దాడి చేశారు. కానీ అక్కడి ప్రజలు ఆ దాడులను తిప్పి కొట్టారు. వాళ్ల ప్రాంతాన్ని వాళ్లే రక్షించుకున్నారు. ఇదే విధంగా కర్ణాటకలోని కొడవ వర్గ ప్రజలు టిప్పు సుల్తాన్‌పై యుద్ధం చేశారు. చాలా సార్లు ఓడించారు. ఈ క్రమంలో 80 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వ్యక్తి జయంతిని సెలబ్రేట్ చేస్తామని సిద్దరామయ్య చెబుతున్నారు. అలా చేయాలనుకుంటే పాకిస్థాన్‌కో, బంగ్లాదేశ్‌కో వెళ్లి అక్కడ జరుపుకోండి. భారత్‌లో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు చేసే హక్కు మీకు లేదు"
- హిమంత బిశ్వశర్మ, అసోం సీఎం
ఇదే సమయంలో The Kerala Story గురించి కూడా ప్రస్తావించారు శర్మ. కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు చేశారు. గుజరాత్ అల్లర్లపై BBC డాక్యుమెంటరీకి సపోర్ట్‌గా ఉన్న కాంగ్రెస్..కేరళ స్టోరీని మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. బీజేపీ కావాలనే ఇలాంటి సినిమాలకు సపోర్ట్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా ట్యాక్స్‌ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. స్వయంగా ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఓ వీడియో విడుదల చేసి ఈ విషయం వెల్లడించారు. బీజేపీ సహా మరి కొన్ని హిందూ సంస్థలు కేరళ స్టోరీ సినిమాపై పన్ను వసూలు చేయొద్దని డిమాండ్ చేశాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న చౌహాన్...వెంటనే ఈ ప్రకటన చేశారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా వివాదాస్పదమవుతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగానే తెరకెక్కించామని మూవీ టీం చెబుతున్నా ముస్లిం సంఘాలు మాత్రం మండి పడుతున్నాయి. మధ్యప్రదేశ్ మంత్రి రాహుల్ కొఠారీ ఇదే విషయమై శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పలుసార్లు మాట్లాడారు. పన్ను ఎత్తివేయాలంటూ లేఖలు రాశారు. ఈ మేరకు చౌహాన్ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Same Sex Marriage: స్వలింగ వివాహాలతో అంటురోగాలొస్తాయ్, సొసైటీకి ప్రమాదకరం - RSS అనుబంధ సంస్థ సర్వే