Kalyan Singh Death: కల్యాణ్ సింగ్ మృతిపై మోదీ సహా ప్రముఖుల దిగ్భ్రాంతి
ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఓ గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. కల్యాణ్ కుమారుడు శ్రీ రాజ్‌వీర్ సింగ్‌తో మాట్లాడి సంతాపం తెలిపారు. కల్యాణ్ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కల్యాణ్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి ఆయన ఎనలేని సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు.
I am saddened beyond words. Kalyan Singh Ji…statesman, veteran administrator, grassroots level leader and great human. He leaves behind an indelible contribution towards the development of Uttar Pradesh. Spoke to his son Shri Rajveer Singh and expressed condolences. Om Shanti. pic.twitter.com/ANOU2AJIpS
— Narendra Modi (@narendramodi) August 21, 2021
మోదీతో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కల్యాణ్ సింగ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందన్నారు.
Pained by the demise of former Chief Minister of UP, Shri Kalyan Singh. He also served as the Governor of Rajasthan & Himachal Pradesh. He was a nationalist and an exemplary leader who was deeply committed to serving people. My thoughts are with his bereaved family and followers. pic.twitter.com/ioUNy83APd
— Vice President of India (@VPSecretariat) August 21, 2021
రాజ్ నాథ్ సింగ్ సంతాపం..
Kalyan Singh was a stalwart of Indian politics, who left an indelible mark on the country & society with his personality & work... In his demise, I have lost my elder brother & companion. The void created by his death is almost impossible to fill: Defence Minister Rajnath Singh pic.twitter.com/OY5hv8ZKZ8
— ANI UP (@ANINewsUP) August 21, 2021
కల్యాణ్ సింగ్ మృతి పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వం, పనితో కల్యాణ్ భారత రాజకీయాలలో చెరగని ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. కల్యాణ్ మృతితో ఏర్పడిన శూన్యతను ఎప్పటికీ పూడ్చలేమని అన్నారు. ఆయన మరణంతో తాను పెద్ద అన్నయ్యను, సహచరుడిని కోల్పోయినట్లు ఉందని విచారం వ్యక్తం చేశారు.
మూడు రోజులు సంతాప దినాలు..
కల్యాణ్ సింగ్ మృతి కారణంగా రాష్ట్రంలో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. గంగా నది తీరం నరోరాలో ఆగస్టు 23 సాయంత్రం అంతిసంస్కరాలు చేయనున్నట్లు యోగి తెలిపారు. ఆగస్టు 23న పబ్లిక్ హాలీడేగా ప్రకటించారు.