Kakinada News : ఒకే కుటుంబంలో తొమ్మిది మంది టీచర్స్, తండ్రి స్ఫూర్తితో ఉపాధ్యాయ వృత్తిలోకి
Kakinada News : కాకినాడ జిల్లా ఇంజరం గ్రామంలో నాలుగు తరాలుగా ఓ కుటుంబంలో అందరూ ఉపాధ్యాయులే. ప్రస్తుతం ఈ కుటుంబంలో తొమ్మిద మంది ఉపాధ్యాయులు ఉన్నారు.
Kakinada News : కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో నాలుగు తరాలుగా ఓ కుటుంబంలోని అందరూ ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతున్నారు. ఓలేటి బంగారేశ్వర శర్మ కుమారుడు సూర్యనారాయణ శాస్త్రి గ్రేడ్1 ఉపాధ్యాయుడు కాగా, శాస్త్రి కుమారుడు శ్రీనివాస శర్మ కూడా ఉపాధ్యాయుడే. విద్య ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చగలమనే విశ్వసించి తాత, తండ్రి స్ఫూర్తితో శ్రీనివాస శర్మ తన ఏడుగురు కుమారులను, ఇద్దరు కోడళ్లను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ధి ఔరా అనిపించారు. పెద్ద కుమారుడు తెలుగు ఉపాధ్యాయుడిగా రెండో కుమారుడు సాంస్కృతిక సాహిత్య అధ్యాపకునిగా, మూడో కుమారుడు ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా నాలుగో కుమారుడు ఎస్జీటీగా, ఐదో కుమారుడు వ్యాకరణ అధ్యాపకుడిగా, ఆరో కుమారుడు తెలుగు ఉపాధ్యాయుడిగా, ఏడోకుమారుడు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
తొమ్మిది మంది టీచర్స్
అలాగే మూడో కుమారుడు భార్య రాజేశ్వరి, ఆరో కుమారుడు భార్య వీరేశ్వరి కూడా టీచర్లే. మొత్తం తొమ్మిది మంది ఆ కుటుంబంలో ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు. శ్రీనివాస శర్మ కూతురు సుబ్బలక్ష్మి, కుమారుడు అల్లుడు కూడా ఉపాధ్యాయుల కావడం విశేషం. నాలుగు తరాలుగా ఓలేటి వారి కుటుంబం ఉపాధ్యాయులుగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. తన ఏడుగురు కుమారులు తండ్రి స్ఫూర్తితో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగటం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని శ్రీనివాస శర్మ భార్య వెంకట సీతామహాలక్ష్మి తెలిపారు.
Also Read : Pawan Kalyan : గురువులను వేధించిన వారంతా చరిత్రహీనులుగా మిగిలిపోయారు- పవన్ కల్యాణ్