By: ABP Desam | Updated at : 09 Aug 2023 03:39 PM (IST)
కడప- తిరుపతి గ్రీన్‌ఫీల్డ్ హైవే
Green Greenfield Highway: కడప తిరుపతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కడప- తిరుపతి గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. రాజంపేట వద్ద ఈ హైవేకి సంబంధించిన పనులకు తొలి అడుగు పడింది. కడప నుంచి తిరుపతికి 4 లైన్ల రహదారి 2,200 కోట్లతో నిర్మాణం కానుంది. దీనికి సంబంధించిన క్లీన్ అండ్ గ్రబ్బింగ్ పనులను గ్రీన్ ఫీల్డ్ హైవే లైజనింగ్ ఆఫీసర్ హర్ష అభిరామ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ పనులు పూర్తి అవ్వడానికి రెండు నెలల సమయం పడుతుంది.
ఈ ప్రాజెక్టు పనులు మొత్తంగా రెండు ప్యాకేజీల కింద జరగనున్నాయి. మొదటి ప్యాకేజీ కడప నుంచి చిన్న ఓరంపాడు వరకు 64 కిలో మీటర్లు , రెండవ ప్యాకేజీ కింద రేణిగుంట 59 కిలో మీటర్ల వరకు జరగనుంది. ఈ హైవే నిర్మాణంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కడప నుంచి రేణిగుంట మధ్యలో 52 లైట్ వెహికల్ అండర్ పాస్ బ్రిడ్జిలు, 8 వెహికల్ అండర్ పాస్ లు, 72 మేజర్, మైనర్ బ్రిడ్జిలు, 240 కల్వర్టులు, 3 రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి లను నిర్మించనున్నారు.
ఈ హైవే పూర్తి అయితే కనుక కడప నుంచి తిరుపతి మధ్య దూరం తగ్గనుంది. ఎక్కువ మలుపులు లేకుండా రోడ్డు మార్గం తయారవుతుంది. ప్రస్తుతం ఉన్న మలుపుల రోడ్డు వలన ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోయారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే ప్రజల బాధలు కొంచెం తీరినట్లేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హైవే పూర్తి అయితే అటు బెంగళూరు నుంచి కానీ, ఇటు హైదరాబాద్ నుంచి కానీ తిరుపతి వచ్చే వారికి మార్గం సుగమం అవుతుంది.
50 ఏళ్లలో ఇంత చెత్త ప్రధానిని చూడలేదు, ఓ సర్వేలో దారుణమైన రేటింగ్ - ట్రూడోపై ఓటర్ల అసహనం
Chandrababu News: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ 25న - రేపు వాదనలు వినబోమన్న జడ్జి
ముస్లిం ఎంపీని ఉగ్రవాది అన్న బీజేపీ ఎంపీ, సభలో గందరగోళం - వార్నింగ్ ఇచ్చిన స్పీకర్
Women Reservation Bill: కుల గణనపై చర్చ జరగొద్దనే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు: రాహుల్ గాంధీ
చంద్రబాబును 2 రోజులు సీఐడీ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి
BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు
Saptha Sagaralu Dhaati Review - 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ : కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?
Chandrababu Arrest: చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు
Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన రాజయ్య, కడియం
/body>