News
News
X

Pawan Kalyan: విశాఖలో స్టీల్ ప్లాంట్ వస్తే జగిత్యాల వారికి ఉద్యోగాలు వస్తాయా?: పవన్ లాజిక్ విన్నారా

Janasena Chief Pawan Kalyan: నేరమయ రాజకీయాలకి వైసీపీ ఉదాహరణ అని.. ఈ తరహా రాజకీయాలకి వ్యతిరేకంగా జనసేన పోరాటం చేస్తుందని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

FOLLOW US: 

Janasena Chief Pawan Kalyan:  నోవాటెల్‌ హోటల్‌లో మీడియా సమక్షంలో విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆదివారం నోటీసులు అందజేశారు. నెల రోజుల పాటు విశాఖ పరిధిలో సభలు, సమావేశాలు నిర్వహించడానికి అనుమతిలేదని నోటీసులలో పేర్కొన్నారు. నోటీసులు తీసుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మర్డర్లు మానభంగాలు చేసే వారిని వెనకేసుకొస్తే ఇలాంటి వారే రాజ్యాలు ఏలుతారని అన్నారు. నేరమయ రాజకీయాలకి వైసీపీ ఉదాహరణ అని.. ఈ తరహా రాజకీయాలకి వ్యతిరేకంగా జనసేన పోరాటం చేస్తుందని అన్నారు. యుద్ధం మొదలయ్యింది. యుద్ధాన్ని మీరు ప్రారంభించారు. దాన్ని స్వీకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని వైసీపీకి హెచ్చరికలు పంపించారు.

విశాఖలో స్టీల్ ప్లాంట్ వస్తే జగిత్యాల వారికి ఉద్యోగాలు వస్తాయా?
నెల్లూరులో ఉండగా నాకు గఢాఫీ గురించి చాలా గొప్పగా చెప్పే వారు. ప్రజల్ని బాగా చూసుకుంటాడు అని. అలాంటి వ్యక్తిని నడిరోడ్డు మీద కొట్టి ఎందుకు చంపేశారు? దశాబ్దాల తరబడి ప్రజలను హింసిస్తే తిరగబడతారని పవన్ కళ్యాణ్ అన్నారు. రేపటి రోజున మీరు కూడా అంతే.స్కీములు, రాయతీలు అంటూ బెనిఫిట్స్ ఇస్తున్నామంటారు. అభివృద్ధి చేయరు. దాని గురించి ఎవరూ అడగకూడదు. మాట్లాడితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులో ఉన్నారు కదా వారికి చెప్పవచ్చు కదా అంటారు. గొడవ జరిగిన ప్రతి సారీ వెళ్తామా? నేను ఒక పార్టీ అధ్యక్షుడిని. మాకు లక్షల ఓట్లు ఉన్నాయి. మేము మాట్లాడితే కోట్లాది మందికి చేరుతుంది. మేమే పోరాటం చేస్తాం. ఇది మా యుద్ధం. తెలుగు నేల కోసం చేస్తున్న యుద్దం అని అభివర్ణించరారు జనసేనాని.

ఇష్టారాజ్యంగా చేసే వ్యక్తులు రాజ్యాలు ఏలుతుంటే మాట్లాడేవారు ఎవరూ లేరు. ఉభయ సభల్లో 30 మంది ఎంపీలు ఉన్నారు. వారు ప్రత్యేక హోదా గురించి అడగరు. అప్పుడు కోపాలు రావు. ప్రజలకు కోపం లేకపోతే నేనేం చేస్తాను. స్టీల్ ఫ్యాక్టరీ కోసం 32 మంది అధికారికంగా చనిపోయారు. అనధికారికంగా 180 మంది చనిపోయారు. అందులో అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. జగిత్యాలకు చెందిన వారు చనిపోయారు. వాళ్లంతా రకరకాల జిల్లాల వారు. అప్పుడు లేని ప్రాంతీయ విభేదాలు ఇప్పుడు ఎందుకు తెస్తారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ వస్తే జగిత్యాలలో ఉద్యోగాలు వస్తాయా? ఆనాటి తరం అంతా మనది అనుకుని చేశారు.
మీరు చెప్పిన వీకేంద్రీకరణ ఇదేనా?
ఇప్పుడు ఏం చేసినా గొంతెత్తకూడదు. నోరెత్తకూడదు. నిరసన తెలపకూడదు. ప్రతిసారి భయపెట్టే పరిస్థితులు వచ్చేశాయి. ఒకప్పుడు జర్నలిజంలో ఉన్నవారు ఉమ్మడిగా సమస్య మీద పోరాడే వారు. ఇప్పుడు మనం కూడా ప్రాంతీయత, కులంగా విడిపోతే ప్రజలకు ఏం మంచి జరుగుతుంది. ఒక పరిమిత ఆలోచనా విధానంతో కూడిన ఏ సిద్ధాంతం నిలబడింది లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంతో ప్రారంభమైన టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని ఎందుకు పేరు మార్చుకోవాల్సి వచ్చింది. ఎప్పటికప్పుడు సిద్ధాంతాల విస్తృతి పెరుగుతూ ఉంటుంది. నేను ఒక కులంతో, ప్రాంతంతో ముడిపడి పార్టీ పెట్టలేదు. ఓ మంత్రి గారు మా కులం అ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. ఆ హక్కు ఎవరిచ్చారు. మీరు మెప్పు పొందడం కోసం మమ్మల్ని తిడతారా? అమరావతి భూములు అన్ని ఒకే సామాజికవర్గానివి అన్నారు. ఇప్పుడున్న నాయకుడి సామాజికవర్గానికి 70 శాతం భూములు ఉంటే ఆ రాజధాని ఆ వర్గానిదే అవుతుంది కదా? చుక్కల భూములు కూడా తీసేసుకున్నారు. అణగారిన వర్గాలు ఈ రోజుకీ గుర్తింపుకోసం కొట్టుకుంటూ ఉన్నారు. వికేంద్రీకరణ అంటే ఇదేనా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

News Reels

ప్రజల్లో మార్పు తెస్తామనే జనసేనంటే భయం
జనసేన పార్టీ అంటే ఎందుకు భయపడతారో తెలియదు. రెండు చోట్లా ఓడిన మా గురించి భయపడాల్సిన పనేంటి? వీరికి మేమంటే ఏదో భయం ఉంది. ప్రజలను ఆలోచింప చేస్తారనో.. ప్రజలు మారుతారనో భయం ఉంది. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుకుంటే.. మాస్కులు లేవన్నందుకు డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడిని చేసి చనిపోయేలా చేశారు. పోలీసుల సమక్షంలో కూర్చోబెట్టి గుండు గీయించేశారు. కేవలం ఇది ఒక కులం, వర్గం అని చెప్పాలా? ప్రతి కులానికీ నన్ను తిట్టే చాలా మంది. కాపు కులానికి చెందిన వైసీపీ మంత్రి మా సోదరుడు అంటూ తిట్టడానికి మీరేమైనా నాకు బొడ్డు కోసి పేరు పెట్టారా? వాళ్ల మెచ్చుకోళ్ల కోసం మమ్మల్ని తిట్టే హక్కు ఎవరిచ్చారు" అన్నారు పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు పాల్గొన్నారు.

 Also Read: Pawan Kalyan : జనసేన నేతలను విడుదల చేసే వరకూ విశాఖలోనే ఉంటా- పవన్ కల్యాణ్

Published at : 16 Oct 2022 06:57 PM (IST) Tags: Visakhapatnam Vizag Steel Plant Pawan Kalyan Janasena Vizag Janasena leaders Arrest

సంబంధిత కథనాలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధర- కొనేవాళ్లకు భారీ ఊరట !

స్వల్పంగా పెరిగిన బంగారం ధర- కొనేవాళ్లకు భారీ ఊరట !

Chandrapur Bridge Collapse: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం, కూలిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి, 13 మందికి గాయాలు

Chandrapur Bridge Collapse:  మహారాష్ట్రలో ఘోర ప్రమాదం, కూలిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి, 13 మందికి గాయాలు

CM KCR : రెండు నెలల్లో వస్తా, అందమైన నిజామాబాద్ ను తీర్చిదిద్దాలె - సీఎం కేసీఆర్

CM KCR :  రెండు నెలల్లో వస్తా,  అందమైన నిజామాబాద్ ను తీర్చిదిద్దాలె - సీఎం కేసీఆర్

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

టాప్ స్టోరీస్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Talasani: 125 ఏళ్ల పార్టీ అంతరించిపోయింది, బీజేపీ నీటిమీద గాలి బుడగ లాంటిది: మంత్రి తలసాని

Talasani: 125 ఏళ్ల పార్టీ అంతరించిపోయింది, బీజేపీ నీటిమీద గాలి బుడగ లాంటిది: మంత్రి తలసాని