Gaganyan Booster : గగన్‌యాన్ బూస్టర్ సక్సెస్ - నెక్ట్స్ ఇక వ్యోమగాములతోనే !
గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో అడుగు ముందుకేసింది. బూస్టర్ ప్రయోగాన్ని సక్సెస్ చేసింది.
గగన్ యాన్ పేరుతో మానవ సహిత అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతోంది ఇస్రో. దీనికి సంబంధించి శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రంలో హ్యూమన్-రేటెడ్ సాలిడ్ రాకెట్ బూస్టర్ ( HS 200) ప్రయోగం నిర్వహించారు. ఈ ప్రయోగం విజయవంతమైనదని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి హెచ్‌ఎస్-200కు సంబంధించి ఎస్-200 రాకెట్ ను జీఎస్ఎల్వీ ఎంకె.-3 ( L.V.M.3) ఉపగ్రహాల ప్రయోగ వాహకనౌక ద్వారా ప్రయోగించారు. ఇది విజయవంతం అయింది. దీంతో గగన్ యాన్‌లో కీలక మైలురాయికి చేరుకున్నామని ఇస్రో తెలియజేసింది.
ఏపీలో భారీగా పెరుగుతోన్న నిస్సార భూమి, ఇస్రో సర్వేలో ఆసక్తికర విషయాలు! తెలంగాణలోనూ ఎంత పెరిగిందంటే
ఎస్.200 మోటారును ఎల్.వి.ఎం.3 వాహకనౌక 4,000 కిలోల ఉపగ్రహాన్ని కక్ష్యలోకి తీసుకు వెళ్లేందుకు సహకరిస్తుంది. గతంలో చంద్రయాన్ మిషన్‌లోనూ ఎల్.వి.ఎం.3 ప్రయోగ వాహనాన్ని వినియోగించారు. హెచ్.ఎస్.200 బూస్టర్ ను 203 టన్నుల ఘన ఇంధనంతో నింపి రెండు నిముషాల 15 సెకన్లపాటు మండించారు. ఈ బూస్టర్ 20 మీటర్ల పొడవు, 3.2 మీటర్ల వ్యాసంతో కూడి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఘన ఇంధన బూస్టర్ అని ఇస్రో ప్రకటించింది. ఈ బూస్టర్ ప్రయోగంతో గగన్ యాన్ ప్రయోగంలో కీలక ఘట్టాన్ని పూర్తి చేశామని తెలిపారు ఇస్రో అధికారులు.
ఇస్రోలో ప్రయోగాలు చేయొచ్చు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు అద్భుత అవకాశం
ఇస్రో అధ్యక్షుడు ఎస్.సోమనాథ్, విక్రం సారాభాయి స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్.ఉన్నికృష్ణన్, ఇతర శాస్త్రవేత్తల సమక్షంలో ఈ ప్రయోగం జరిగింది. గగన్ యాన్ ప్రాజెక్టులో భాగంగా మన దేశానికి చెందిన ఆస్ట్రోనాట్లను ఇస్రో తొలిసారి అంతరిక్షంలోకి పంపబోతోంది. గగన్ యాన్ ప్రాజెక్టు కోసం భారత ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయించింది. గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన భారతీయ వాయుసేనకు చెందిన నలుగురు భారతీయ వ్యోమగాములు రష్యాలో ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో ఒకరు ఒకరు గ్రూప్ కెప్టెన్, మిగిలిన ముగ్గురు వింగ్ కమాండర్లు .
శ్రీహరికోట నుంచి ఈ ఏడాది తొలి ప్రయోగం PSLV C-52
మానవ సహిత వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి విజయవంతంగా పంపగలిగితే భారత్ ప్రపంచంలోని అగ్రదేశాల సరసన చేరుతుంది. స్పేస్ టూరిజంలోకి ఇస్రో దూసుకు రాగలుతుతుందని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు పెద్ద ఎత్తున రూ. లక్షల కోట్లు కుమ్మరించి వీటిపై పరిశోధనలు .. ప్రయోగాలు చేస్తున్నాయి.