Arpita Mukherjee: అర్పిత ముఖర్జీ నిజాయతీకి నిదర్శనం ఇది , ఐపీఎస్ అధికారి ట్వీట్ వైరల్
Arpita Mukherjee: అర్పిత ముఖర్జీపై ఓ ఐపీఎస్ అధికారి సెటైరికల్‌గా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఎంత భద్రంగా దాచుకున్నారో..
పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఎస్‌సీ స్కామ్‌లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉన్న అర్పిత ముఖర్జీపై ఈడీ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండు ఇళ్లలో సోదాలు నిర్వహించి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎస్ అధికారి అరుణ్ బొత్రా అర్పిత ముఖర్జీపై ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది. జులై 28వ తేదీన ఆయన చేసిన ఈ ట్వీట్‌పైనే చర్చ జరుగుతోంది.
"ఏదేమైనా కావచ్చు. నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం అర్పిత ముఖర్జీ. ఆమె ఉంటున్న హౌజింగ్ సొసైటీకి ఆమె మెయింటెనెన్స్ ఫీ కింద చెల్లించాల్సిన రూ. 11, 809 డ్యూలోనే ఉన్నాయి. ఇందుకు సంబంధించిన నోటీసులను ఇంటి డోర్‌కి అతికించారు. వేరే వాళ్ల డబ్బుల్ని ఇంట్లో భద్రంగా దాచుకున్నారు తప్ప..మెయింటెనెన్స్ ఫీజుని చెల్లించలేదు. ఎంత నిజాయతీగా ఉన్నారో" అని సెటైరికల్‌గా ట్వీట్ చేశారు ఒడిశా సీఐడీ డీజీపీ అరుణ్ బొత్రా. అర్పిత నివసిస్తున్న ఫ్లాట్‌కు సంబంధించి చాలా పేమెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. రూ.21 కోట్లు స్వాధీనం చేసుకున్న ఫ్లాట్‌కు సంబంధించి కామన్ ఏరియా మెయింటెనెన్స్ ఫీజ్ రూ.9,419 మేర డ్యూ ఉంది. మరో ఫ్లాట్‌కు సంబంధించి రూ.17,422 మేర బిల్లు పెండింగ్‌లో ఉంది.
कुछ भी कहो पर अर्पिता जी ने वफादारी की मिसाल कायम की है।
— Arun Bothra 🇮🇳 (@arunbothra) July 28, 2022
खुद के ऊपर सोसाइटी के 11,809 रुपये बाकी थे, दरवाजे पर नोटिस लग गया पर दूसरे के पैसे को पूरा संभाल कर रखा। pic.twitter.com/BzJWCR0bjL
ఆ కార్లు దొరుకుతాయా..?
నిన్న మొన్నటి వరకూ అర్పిత ముఖర్జీ కొంత మందికే తెలుసు. ఇప్పుడు దేశమంతా ఆమె గురించి మాట్లాడుకుంటోంది. ఇందుకు కారణం..
పశ్చిమ బెంగాల్‌ను కుదిపేస్తున్న ఎస్‌ఎస్‌సీ స్కామ్ వ్యవహారం అంతా ఆమె చుట్టూనే తిరుగుతుండటం. ఆమె ఇంట్లో నాలుగు లగ్జరీ కార్లు మిస్ అవ్వటమూ ఈ కేసులో కీలకంగా మారింది. అయితే...అర్పిత ముఖర్జీ డ్రైవర్ ప్రణబ్ భట్టాచార్య ఈ కార్ల మిస్సింగ్‌పై స్పందించారు. అర్పిత ముఖర్జీ పేరుతో రిజిస్టర్ అయి ఉన్న కార్లు దాదాపు మూడు నెలలుగా కనిపించటం లేదని వెల్లడించాడు. ఇదే సమయంలో మరో కీలకవిషయం కూడా చెప్పాడు. ఆమె కార్లలో హోండా సిటీని మాత్రమే నడిపేందుకు తనకు అనుమతి ఇచ్చేదని, మిగతా కార్లు డ్రైవ్ చేసేందుకు మాత్రం పర్మిషన్ ఇచ్చేది కాదని చెప్పాడు. మరో సంచలన నిజాన్నీ బయటపెట్టాడు. మాజీ మంత్రి పార్థ ఛటర్జీ తరచు అర్పిత ముఖర్జీ ఇంటికి వచ్చేవాడని చెప్పాడు. "నేను డ్రైవింగ్ డ్యూటీ నుంచి దిగిపోయే సమయానికి, ఆయన ఇంటికి వచ్చే వారు" అని అన్నాడు. ఈడీ అధికారులు తననూ ప్రశ్నించారని స్పష్టం చేశాడు. "ఇల్లు సోదాలు చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నన్ను లోపల కూర్చోమని చెప్పారు. నా ఫోన్ తీసుకుని, అర్పిత ముఖర్జీకి సంబంధించిన వివరాలు అడిగారు" అని చెప్పాడు.
Also Read: Joe Biden: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు మళ్లీ కరోనా- కోలుకున్న 3 రోజులకే!
Also Read: Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే, కొత్త టెక్నాలజీతో గూగుల్ పరిష్కారం