By: ABP Desam | Updated at : 17 Mar 2022 07:57 PM (IST)
వాటిని తీసుకెళ్తూ అడ్డంగా దొరికిన ఐపీఎస్ ఆఫీసర్ ! అవేంటో తెలుసా ?
ఆయనో ఐపీఎస్ ఆఫీసర్. పేరు అరుణ్ బోత్రా. జైపూర్ ఎయిర్‌పోర్టులో దిగారు. బరువుగా ఉన్న తన బ్యాగును అతి కష్టం మీద ట్రాలీలో పెట్టుకుని నెట్టుకుటూ వెళ్తున్నారు. కొంచెం దూరం నుంచిఎయిర్‌పోర్టు అధికారి ఆగండి అని అరిచాడు. అంతే.. అరుణ్ బోత్రా ఆగిపోయారు. ఆయన దగ్గరకు వచ్చిన ఎయిర్‌పోర్టు అధికారి బ్యాగ్ తెరవమని ఆదేశించారు. కానీ అరుణ్ బోత్రా సందేహించారు. కానీ ఎయిర్ పోర్టు అధికారి మాత్రం తెరవాలని పట్టుబట్టారు. చివరికి తప్పనిసరిగా తెరిచారు. అందులో ఉన్నవి చూసి ఎయిర్‌పోర్టు అధికారికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏమీ చేయలేక వెళ్లిపొమ్మన్నాడు. ఇంతకూ ఆ బ్యాగులో ఏమున్నాయ్?. గ్రీన్ పీస్ అంటే..పచ్చి బఠానీ కాయలు ఉన్నాయి.
Security staff at Jaipur airport asked to open my handbag 😐 pic.twitter.com/kxJUB5S3HZ
— Arun Bothra 🇮🇳 (@arunbothra) March 16, 2022
మంచి క్వాలిటీ బ్యాగ్.. ఎవరైనా అందులో అంతకు మించి ఖరీదైన బట్టలు పెట్టుకుని వెళ్తారు. లేదా.. విలువైన వస్తువులు పెట్టుకుంటారు. కానీ అరుణ్ బోత్రా మాత్రం గ్రీన్ పీస్ పెట్టుకుని వచ్చారు. ఎయిర్‌పోర్టుకు వస్తూంటే కేజీ రూ. నలభై రూపాయలకే అమ్ముతుంటే తెచ్చుకున్నానని ఆయన చెబుతున్నారు. తన బ్యాగులో గ్రీన్ సీస్‌ని ఎయిర్‌పోర్ట్ సిబ్బందిచెక్ చేసిన విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతే క్షణాల్లో ఆ ఫోటోలతో సహా ట్వీట్ వైరల్ అయిపోయింది.
My in-laws from Varanasi bring mangoes from their orchards the same way.
— Tarun Raju (@btarunr) March 16, 2022
And they're made to open, too. 🤣 pic.twitter.com/u62aDBgRIG
అరుణ్ బోత్రా ట్వీట్‌కు వందల మంది ఫన్నీ రిప్లయ్‌లు ఇస్తున్నారు. ఒకరైతే తాము బ్యాగులో మామిడి పండ్లు తెచ్చామని ఇలాగే చెక్ చేశారని ఫోటోలు పెట్టారు.
कह दीजिए मटर के अंदर ड्रग्स है 😃😂 इसी बहाने मटर भी छिल जाएंगी
— Prakhar (@Swayambhuuu) March 16, 2022
అరుణ్ బోత్రా పెట్టిన ట్వీట్ నిజమో కాదో స్పష్టత లేదు..కానీ ఆయనకు ఫాలోయర్లు ఇస్తున్న రెస్పాన్స్ మాత్రం సూపర్ కామెడీగా ఉన్నాయి.
Uttam Kumar Reddy: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు దారుణం, ఆయన వల్ల సర్పంచ్ల ఆత్మహత్యలు: టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
KTR UK Tour: లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
Breaking News Live Updates : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత్
Amara Raja Batteries: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు, అమరరాజా బ్యాటరీస్‌పై స్టే
RCB Vs GT Highlights: ఫాంలోకి వచ్చిన కింగ్ కోహ్లీ - గుజరాత్‌పై బెంగళూరు ఘనవిజయం!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Nikhat Zareen: తెలంగాణ బంగారు కొండ - ప్రపంచ చాంపియన్‌గా నిఖత్ జరీన్!
Moto G71s 5G: రూ.20 వేలలోపే మోటొరోలా కొత్త 5జీ ఫోన్ - సూపర్ ఫీచర్లు కూడా - ఎలా ఉందో చూశారా?