Budget 2024: వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్లు కట్టించి ఇస్తాం - నిరుపేదలకు నిర్మలమ్మ భరోసా
Interim Budget 2024: వచ్చే ఐదేళ్లలో ప్రధాని ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్లు కట్టించి ఇస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Interim Budget 2024 Highlights: వచ్చే ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రధాన మంత్రి ఆవాస్ గ్రామీణ యోజన ( Pradhan Mantri Awas Gramin Yojana) పథకం కింద ఈ ఇళ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
"వచ్చే ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఇళ్లను నిర్మించి ఇస్తుంది. ప్రధాన మంత్రి ఆవాస్ గ్రామీణ యోజన కింద ఈ నిర్మాణం చేపడతాం. ప్రస్తుతం దేశంలో జనాభా పెరుగుతోంది. అర్హుల సంఖ్యా పెరుగుతోంది. ఈ పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఇళ్ల నిర్మించి ఇస్తాం"
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
PM Awas Yojana Gramin
— PIB India (@PIB_India) February 1, 2024
Despite the challenges due to COVID, implementation of PM Awas Yojana Gramin (Rural) continued and we are close to achieving the target of 3 crore houses. 2 crore more houses will be taken up in the next 5 years to meet the requirement arising from… pic.twitter.com/KwPD3bhvSw
కొవిడ్ సంక్షోభ సమయంలో ఇళ్ల నిర్మాణానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని తెలిపారు. అయినా ఆ సవాళ్లను అధిగమించి లక్ష్యం సాధించామని స్పష్టం చేశారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కొనసాగించామని తేల్చి చెప్పారు.
"కరోనా సంక్షోభ సమయంలో ఇళ్ల నిర్మాణంలో చాలా సవాళ్లు ఎదురయ్యాయి. అయినా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మేం కొనసాగించాం. 3 కోట్ల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్యానికి చేరువలో ఉన్నాం. వచ్చే ఐదేళ్లలో మరో 2 కోట్ల ఇళ్లు కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అర్హుల కుటుంబాల సంఖ్య పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం"
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి