ఆర్మీలో చేరే అమ్మాయిలకు శీల పరీక్ష లేనట్టే.. ఆ రూల్‌కు ఇక స్వస్తి!
ఆ దేశంలో అమ్మాయిలు సైన్యంలో చేరాలంటే వర్జినిటీ టెస్ట్ తప్పనిసరి. ఆర్మీ వైద్యులు అమ్మాయిల జననాంగాల్లోకి రెండు వేళ్లను చొప్పించి ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
సాధారణంగా అమ్మాయిలను సైన్యంలోకి తీసుకోరు. ఒక వేళ తీసుకున్నా రణరంగంలో పోరాడే అవకాశం కల్పించరు. అయితే, ఆ దేశంలో మాత్రం అమ్మాయిలను సైన్యంలోకి తీసుకుంటారు. కానీ, కన్నె పిల్లలకు మాత్రమే ప్రవేశం. ఈ సందర్భంగా వారికి వర్జినిటీ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఆర్మీ వైద్యులు.. తమ రెండు వేళ్లను అమ్మాయిల జననాంగాల్లోకి చొప్పించి.. ఆమె వర్జినా? కాదా అని తేలుస్తారు. ఈ విధానం వల్ల ఎంతో మంది అమ్మాయిలు.. ఆర్మీలో చేరాలనే ఆశలను వదిలేసుకున్నారు. కొందరైతే మానవ హక్కుల సంఘాలకు మొరపెట్టుకున్నారు. మొత్తానికి వారి ప్రయత్నం ఫలించింది. ఈ దారుణ పరీక్షకు వీడ్కోలు చెప్పి.. అబ్బాయిల తరహాలోనే అమ్మాయిలకు కూడా ఆర్మీలోకి ప్రవేశం కల్పిస్తామని స్వయంగా సైన్యాధిపతే ప్రకటించారు.
ఇండోనేషియా సైన్యంలో చేరే అమ్మాయిలు అన్ని పరీక్షల్లో అర్హత సాధించినా.. వర్జినిటీ టెస్టులో కూడా పాస్ కావాలి. ఈ విధానాన్ని ‘ది టూ ఫింగర్ టెస్ట్’ అని పిలుస్తారు. ఈ పరీక్షలో భాగంగా వైద్యులు ఆమె రెండు వేళ్లను జననాంగం లోపలికి చొప్పిస్తారు. వారి వేళ్లకు ‘కన్నెపొర’ (hymen) తగలితే.. వర్జిన్ అని తేలుస్తారు. ఆ పరీక్షలో యువతి వర్జిన్ కాదని తేలితే సైన్యంలోకి తీసుకోరు. ఫలితంగా ఎంతోమంది అమ్మాయిలు ఆర్మీలో అవకాశాలను కోల్పోయారు.
కన్నెపొర ఉంటేనే అమ్మాయిలు వర్జిన్ అని ఎలా తేలుస్తారంటూ దీనిపై పెద్ద రచ్చే జరిగింది. అమ్మాయిల శరీరతత్వం మీద కూడా అది ఆధారపడి ఉంటుందని, వారు ఆటలు ఆడేప్పుడు, పరిగెట్టేప్పుడో, పనులు చేస్తున్నప్పుడో ఆ పొరను కోల్పోతారని వైద్య నిపుణులు ఆర్మీ పెద్దలకు తెలియజేశారు. కన్నె పొర ఉంటేనే వర్జిన్ అని తేల్చే విధానం సరైనది కాదని, ముఖ్యంగా రెండు వేళ్లను చొప్పించడం ద్వారా ఆ విషయాన్ని నిర్ధరించలేమన్నారు. ఈ నేపథ్యంలో మానవ హక్కుల సంఘాలు కూడా ఆర్మీపై ఒత్తిడి తీసుకొచ్చాయి.
ఇండోనేషియా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ అందికా పెర్కాశా స్పందిస్తూ.. ‘‘కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఈ పరీక్షలకు ఇక ముగింపు పలుకుతున్నాం. పురుషుల తరహాలోనే మహిళలను ఆర్మీలో నియమిస్తాం. కేవలం ఫిట్‌నెస్, విద్యార్హతలు ఆధారంగానే నియామకాలు ఉంటాయి’’ అని తెలిపారు. దీంతో మానవ హక్కుల సంఘాలు పెర్కాశా నిర్ణయాన్ని స్వాగతించారు. ఇండోనేషియా మహిళలు సైతం ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: వింత దంపతులు.. అడవిలో నగ్నంగా అనాగరిక జీవితం, ఎందుకంటే..
Also Read: బీరు తాగితే.. శృంగారంలో రెచ్చిపోతారట! ఇందులో నిజమెంతా?