(Source: ECI/ABP News/ABP Majha)
ITBPF Recruitment: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్‌లో హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీఎఫ్) హెడ్ కానిస్టేబుల్(డ్రెస్సర్ వెటర్నరీ) గ్రూప్-సి, నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీఎఫ్) హెడ్ కానిస్టేబుల్(డ్రెస్సర్ వెటర్నరీ) గ్రూప్-సి, నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. 12వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు..
* హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ): 40 పోస్టులు
పోస్టుల కేటాయింపు: పురుషులు- 34, మహిళలు-06.
రిజర్వేషన్లు: జనరల్-17, ఈడబ్ల్యూఎస్-03, ఓబీసీ-11, ఎస్సీ-06, ఎస్టీ-03.
అర్హత: 12వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2022 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
జీత భత్యాలు: నెలకు రూ.25,500 - రూ.81,100.
దరఖాస్తు రుసుము: రూ.100.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.10.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.11.2022.
Notification
Online Application
Website
Also Read
ఏపీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 15 నుండి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 4లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి డిసెంబరు 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (ప్రాక్టికల్ టెస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ పోలీసు శాఖలో ఉద్యోగాల జాతర- 6,511 ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 6,511 పోస్టుల భర్తీకి సీఎం జగన్ అంగీకరం తెలిపారు. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఆరువేలకుపైగా ఉద్యోగాల్లో ఆర్‌ఎస్‌ఐ ఉద్యోగాలు 96 ఉంటే... ఎస్‌ఐ సివిల్ ఉద్యోగాలు 315 ఉన్నాయి. ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలు 2520, సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 3580 ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వ విడుదల చేసిన జీవోలో పేర్కొంది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
ఇండియన్ ఆర్మీలో 128 రిలీజియస్ టీచర్ పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ ఆర్మీ ఆర్ఆర్‌టీ 91 & 92 కోర్సుల్లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లుగా రిలీజియస్ టీచర్ల నియామకానికి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు వున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 15 నుండి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 4లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి డిసెంబరు 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (ప్రాక్టికల్ టెస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో కంప్యూటర్ డ్రాట్స్‌మ్యాన్ ఉద్యోగాలు, ఈ అర్హత ఉండాలి!
ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఎనిమిది కంప్యూటర్ డ్రాట్స్‌మ్యాన్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదోతరగతితోపాటు ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 10 నుండి ప్రారంభంకానుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..