By: Ram Manohar | Updated at : 29 Jul 2022 11:10 AM (IST)
కలకత్తాలో ఓ ఇండిగో ఫ్లైట్ రన్‌వే పై స్కిడ్ అయ్యి, అదుపు తప్పింది.
ప్రమాదం ఎలా జరిగింది..?
ఈ మధ్య కాలంలో విమానాల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కేవలం రెండు నెలల వ్యవధిలోనే స్పైస్‌జెట్ విమానాలు 8 సార్లు చిన్న చిన్న ప్రమాదాలకు గురయ్యాయి. 8 వారాల వరకూ 50% ఆక్యుపెన్సీతో స్పైస్‌జెట్ విమానాలను నడపాలని ఆదేశాలు వచ్చాయి. ఇండిగో విమానాలకూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కలకత్తాలోని ఇండిగో విమానం టేకాఫ్ అయ్యే క్రమంలో రన్‌వేపై అదుపు తప్పింది. జారి పోయి పక్కకు వెళ్లిపోయింది. జోర్‌హట్-కలకత్తా రూట్‌లో నడుస్తున్న ఈ ఫ్లైట్‌కు తృటిలో ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. టెక్నికల్ ఇష్యూ కారణంగా గంటల పాటు విమానం అలాగే నిలిచిపోయింది. చివరకు ఫ్లైట్‌ను రద్దు చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. ఎందుకిలా జరిగిందని విచారణ కొనసాగిస్తున్నారు. విమానం బయల్దేరే ముందు ఎలాంటి సమస్య లేదని, ఉన్నట్టుండి ఎందుకిలా జరిగిందో అర్థం కావటం లేదని అధికారులు వెల్లడించారు. స్థానిక జర్నలిస్ట్ ఒకరు ఇండిగో విమానం ప్రమాదానికి గురైన ఫోటోను షేర్ చేశారు. అందులో ఫ్లైట్ రన్‌వే నుంచి పూర్తిగా పక్కకు వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. "జోర్‌హట్ విమానాశ్రయంలో గువాహటి కలకత్తా ఫ్లైట్ రన్‌వే నుంచి స్లిప్ అయింది. పక్కనే ఉన్న మట్టి దిబ్బలోకి వెళ్లిపోయింది. మధ్యాహ్నం 2.20 నిముషాలకు బయల్దేరాల్సి ఉన్నా, ఈ ప్రమాదం కారణంగా ఆలస్యమైంది" అని ట్వీట్ చేశారు. ఇందుకు ఇండిగో బదులిచ్చింది. "ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో విచారిస్తున్నాం. మా టీం అదే పనిలో ఉంది. మీరు సేఫ్‌గానే మీ గమ్యస్థానానికి చేరుకున్నారని భావిస్తున్నాం" అని ఇండిగో ట్వీట్ చేసింది. రాత్రి 8 గంటల వరకూ చూసి, అప్పుడు ఫ్లైట్‌ను క్యాన్సిల్ చేసింది ఇండిగో సంస్థ. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 98 మంది ప్రయాణికులున్నట్టు అధికారులు తెలిపారు.
IndiGo's Kolkata-bound flight skidded while taxing for take-off in Jorhat y'day. No passengers suffered injuries in the incident & a team constituted to probe the incident. During the initial inspection of the aircraft no abnormalities were observed, says IndiGo airlines. pic.twitter.com/97tLK2hHfV
— ANI (@ANI) July 29, 2022
Also Read: International Tiger Day 2022: పులులు కూడా ఇంట్రావర్ట్‌లేనట - వాటి గంభీరం, గాండ్రింపు అంతా పైపైకే
Jagadish Reddy: కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఇవే చివరి ఎలక్షన్స్, ఈడీ బోడీలు ఏం చేయలేవు - మంత్రి జగదీశ్ వ్యాఖ్యలు
Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!
Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం
Chandrababu: ప్రపంచంలో మేథావులు, సంఘ సంస్కర్తలు ఎక్కువ మంది భారతీయులే - చంద్రబాబు
Robin Hood: రాబిన్ హుడ్ వస్తాడు, సాయం అందిస్తాడు @మిషన్ 75
Salaar Release Date: ఫ్లాప్ ఇచ్చిన రోజు హిట్ కొట్టడానికి వస్తున్న ప్రభాస్ - ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్
TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం
Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?
Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది: ఏపీ సీఎం జగన్