Indian Student in Russia: చదువుపేరుతో వెళ్లి రష్యా సైన్యంలో చేరిన భారతీయుడు - ఉక్రెయిన్ సైన్యానికి చిక్కాడు - అసలు ట్విస్ట్ ఇదే!
Russia Indian: రష్యాలో చదువులకు వెళ్లి యుద్ధంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థి వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. రష్యన్ సైన్యంలో చేరి, 3 రోజుల తర్వాత ఉక్రెయిన్ సైన్యానికి లొంగిపోయాడు.

Indian Student Surrendered To Ukrainian Forces: గుజరాత్‌కు చెందిన 22 ఏళ్ల విద్యార్థి మజోటి సహిల్ మొహమ్మద్ హుస్సేన్ ఉక్రెయిన్ సైన్యానికి బందీగా చిక్కాడు. రష్యాలో చదువులకు వెళ్లిన తర్వాత డ్రగ్స్ కేసులో చిక్కుకుని, జైలు శిక్షను తప్పించుకోవాలని రష్యన్ సైన్యంలో చేరాడు. అయితే, మూడు రోజుల పోరాటం తర్వాత ఉక్రెయిన్ సైన్యానికి లొంగిపోయాడు. "రష్యాలో జైలు కంటే ఇక్కడే జైలు వెళ్లడం మంచిది" అని చెప్పుకున్నాడు. ఈ ఘటన వైరల్ అవుతోంది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) రష్యన్ అధికారులతో మాట్లాడి, భారతీయుల రిక్రూట్‌మెంట్‌ను సైన్యంలో ఆపమని కోరింది. గుజరాత్ పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. తమ కుమారుడ్ని విడిపించుకుని తీసుకురావాలని కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Ukraine's military says they have captured an Indian national who was fighting alongside Russian forces.
— Sidhant Sibal (@sidhant) October 7, 2025
Majoti Sahil Mohamed Hussein is a 22-year-old student from Morbi, Gujarat, India & came to Russia to study at a university pic.twitter.com/Kzi5F4EDR4
మోర్బీ, గుజరాత్‌కు చెందిన మజోటి సహిల్ మొహమ్మద్ హుస్సేన్ (22) చిన్నప్పటి నుంచి తెలివైన విద్యార్థిగా పేరు పొందాడు. తల్లి-తండ్రులు విడిపోయిన తర్వాత తల్లి, తాతలతో ఉండేవాడు. కుటుంబ సభ్యులందరూ విద్యావంతులు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. రష్యాలో ఉన్నత విద్యకు వెళ్లిన సహిల్, అక్కడ డ్రగ్స్ సంబంధిత కేసులో పట్టుబడ్డాడు. రష్యన్ అధికారులు అతనికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అయితే అతనికి సైన్యంలో చేరే ఆఫర్ ఇచ్చారు. జైలు వెళ్లడం కంటే సైన్యంలో చేరడం మంచిదని భావించి చేరిపోయాడు. రష్యా 'స్పెషల్ మిలిటరీ ఆపరేషన్' లో పాల్గొనడానికి అంగీకరించాడు. 16 రోజుల శిక్షణ పొందిన తర్వాత, అక్టోబర్ 1న మొదటి కాంబాట్ మిషన్‌కు పంపారు. మూడు రోజుల పోరాటం తర్వాత రష్యన్ కమాండర్‌తో గొడవ పెట్టుకున్నాడు.
Indian national student fighting for Russian forces surrenders to Ukraine.
— The Tatva (@thetatvaindia) October 8, 2025
- Hussein went to Russia to study but was later arrested on drug-related charges and sentenced to seven years in prison
- To avoid serving his sentence, he reportedly joined the Russian military#Russia… pic.twitter.com/88loPx2Pl9
అక్టోబర్ 4న ఉక్రెయిన్ 63వ మెకానైజ్డ్ బ్రిగేడ్ సైనికులకు మజోటి సరెండర్ అయ్యాడు. 2-3 కిలోమీటర్ల దూరంలో ఉక్రెయిన్ ట్రెంచ్ పొజిషన్ చూసి, తుపాకీ వదిలేసి సరెండర్ అయిపోయాడు. ఉక్రెయిన్ సైన్యం టెలిగ్రామ్‌లో వీడియో విడుదల చేసింది, ఇందులో సహిల్ తన కథను వివరించాడు. MEA రష్యన్ సైన్యంలో భారతీయుల రిక్రూట్‌మెంట్‌పై ఆందోళన వ్యక్తం చేస్తోంది. రష్యన్ అధికారులతో మాట్లాడి, ఈ పద్ధతిని ఆపమని కోరారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 100కి పైగా భారతీయులు రిక్రూట్ అవ్వగా, 20 మంది మరణించారని రికార్డులు చెబుతున్నాయి.





















