Indian Student Died: యూకేలో అదృశ్యమైన సిక్కు విద్యార్థి మృతి, చెరువులో డెడ్‌బాడీ
Indian Student Died in UK: యూకేలో అదృశ్యమైన భారత విద్యార్థి చెరువులో శవమై తేలాడు.
Sikh Student Died in UK:
భారతీయ విద్యార్థి మృతి..
యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి జీఎస్ భాటియా మృతి చెందాడు. ఈస్ట్ లండన్‌లోని ఓ సరస్సులో అతడి మృతదేహం కనిపించింది. డిసెంబర్ 14వ తేదీ రాత్రి నుంచి భాటియా కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చివరకు ఓ లేక్‌లో శవమై తేలాడు. దాదాపు వారం రోజులుగా భాటియా జాడ కోసం విచారణ కొనసాగిస్తున్నారు. చాలా చోట్ల CC కెమెరా ఫుటేజ్‌ని పరిశీలించారు. ఫోన్ డేటానీ సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా ఓ సరస్సులో తనిఖీలు చేపట్టారు. అందులోనే భాటియా డెడ్‌బాడీ దొరికింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఇప్పటి వరకూ ఇది అనుమానాస్పద మృతి అనడానిక ఆధారాలు ఏమీ దొరకలేదని వెల్లడించారు. అయినా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అయితే...భాటియాకి సంబంధించిన ఏ సమాచారం తెలిసినా వెంటనే తమకు తెలియజేయాలని కోరారు. ఇప్పటికే భాటియా మృతి పట్ల సోషల్ మీడియాలో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఖలిస్థాన్ వివాదం ఉద్ధృమవుతున్న సమయంలో భారత్‌కి చెందిన ఓ సిక్కు విద్యార్థి ఇలా అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోవడం అలజడి సృష్టిస్తోంది. భాటియా మిస్సింగ్ కేసుని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ నేత మన్‌జిందర్ సింగ్ సిర్సా. భాటియా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"భాటియా మరణ వార్త నన్నెంతో బాధకు గురి చేసింది. డిసెంబర్ 15 నుంచి భాటియా కనిపించడం లేదు. ఈ కష్ట సమయంలో అతని కుటుంబసభ్యులకు అండగా ఉంటాను. ఆ దేవుడు వాళ్లకు ధైర్యం ఇస్తాడని ఆశిస్తున్నాను"
- మన్‌జిందర్ సింగ్, బీజేపీ నేత
గతంలోనూ 23 ఏళ్ల భారతీయ విద్యార్థి మిత్‌కుమార్ పటేల్ అదృశ్యమయ్యాడు. చివరికి థేమ్స్ నదిలో శవమై తేలాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే చదువుకునేందుకు లండన్‌కి వచ్చిన మిత్‌కుమార్ నవంబర్‌లో చనిపోయాడు. అయితే..ఇది అనుమానాస్పద మృతి కాదని పోలీసులు వెల్లడించారు.
Also Read: Lok Sabha Security Breach: లోక్‌సభ దాడి ఘటనలో మరో ట్విస్ట్,పోలీసుల అదుపులో రిటైర్డ్ డీఎస్‌పీ కొడుకు