Ayodhya Temple: వంద రోజుల పాటు అయోధ్యకు 1000 స్పెషల్ ట్రైన్స్, ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం
Ayodhya Temple Inauguration: అయోధ్యకు 100 రోజుల పాటు వెయ్యి ట్రైన్స్‌ని నడపాలని ఇండియన్ రైల్వే నిర్ణయం తీసుకుంది.
![Ayodhya Temple: వంద రోజుల పాటు అయోధ్యకు 1000 స్పెషల్ ట్రైన్స్, ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం Indian Railways to operate 1,000 trains for Ayodhya temple in first 100 days of inauguration Ayodhya Temple: వంద రోజుల పాటు అయోధ్యకు 1000 స్పెషల్ ట్రైన్స్, ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/16/e38ee44a8934491590aee8567c6eac401702720829295517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ayodhya Ram Mandir Inauguration:
అయోధ్యకు ప్రత్యేక రైళ్లు..
వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో (Ayodhya Ram Mandir) రాముడి విగ్రహ ప్రతిష్ఠకు (Ayodhya Praan Pathishta) ముహూర్తం నిర్ణయమైంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. దేశంలోని నలు మూలల నుంచి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కానున్నారు భక్తులు. యూపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకూ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వేస్ (Ayodhya Special Trains) కీలక ప్రకటన చేసింది. అయోధ్య రామ మందిరం తెరుచున్న తరవాత 100 రోజుల పాటు దేశంలోని పలు చోట్ల నుంచి 1000 రైళ్లు ప్రత్యేకంగా నడపనున్నట్టు వెల్లడించింది. మొదటి 100 రోజుల వరకూ ఈ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. డిమాండ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది ఇండియన్ రైల్వేస్. జనవరి 19వ తేదీ నుంచి ఆ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మూడు రోజుల ముందు నుంచే ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం వల్ల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయోధ్యకు చేరుకునే అవకాశముంటుందని భావించారు అధికారులు. జనవరి 23వ తేదీ నుంచి రామ మందిరాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణే, కోల్‌కత్తా, నాగ్‌పూర్, లక్నో, జమ్ము నుంచి ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది రైల్వే.
డిమాండ్‌కి తగ్గట్టుగా..
డిమాండ్ ఆధారంగా ఆయా రూట్లలో ఎన్ని రైళ్లు నడపాలో నిర్ణయం తీసుకుంటారు అధికారులు. అయోధ్యకు తరలి వచ్చే భక్తుల రద్దీని తట్టుకునేందుకు అయోధ్య రైల్వే స్టేషన్‌ని రీడెవలప్ చేస్తున్నారు. 50 వేల మంది వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కెపాసిటీని పెంచుతూ స్టేషన్‌లో మార్పులు చేర్పులు చేయనున్నారు. జనవరి 15 నాటికి ఇది సిద్ధం కానుంది. కొన్ని రైళ్లలో గ్రూప్ రిజర్వేషన్‌లు చేసుకునేలా వెసులుబాటు కల్పించనున్నారు. ఈ డిమాండ్‌కి తగ్గట్టుగా క్యాటరింగ్ సర్వీస్‌లను అందించేందుకు IRCTC ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. దాదాపు 15 రోజుల పాటు 24 గంటలూ పని చేసేలా అన్నీ సిద్ధం చేసుకుంటోంది. కొన్ని చోట్ల ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనుంది. అయోధ్య రామ మందిరానికి వచ్చే భక్తులను ఆకర్షించేందుకు అధికారులు మరో ఏర్పాటూ చేశారు. సరయు నదిపై విహరించేందుకు విద్యుత్ పడవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇప్పటికే ప్రధాని మోదీ ట్రస్ట్ సభ్యులు ఆహ్వానం అందించారు. మోదీతో పాటు మరో 6 వేల మంది అతిథులకు ఆహ్వానం అందింది. వీళ్లలో పూజారులు, దాతలతో పాటు రాజకీయ నాయకులూ ఉన్నారు. ఇన్విటేషన్ కార్డులు (Ayodhya Ram Temple Pran Pratistha) ప్రింట్ చేసి అందరికీ అందించారు. 2020 ఆగస్టులో ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని. మూడేళ్లుగా ఎప్పుడెప్పుడు ఇది పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్నారు భక్తులు. పూజారులు, సాధువులు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
Also Read: మహిళా రిజర్వేషన్‌లు అప్పటి నుంచే అమలు చేస్తాం - నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)