పసికందులను హత్య చేసిన యూకే నర్స్, కేసుని ఛేదించడంలో ఇండియన్ డాక్టర్ సాయం
UK Nurse Killings: యూకేలో ఓ నర్స్ అప్పుడే పుట్టిన శిశువులను దారుణంగా హత్య చేసింది.
UK Nurse Killings:
7గురు శిశువుల హత్య
యూకేలో ఓ నర్స్ అప్పుడే పుట్టిన 7గురు శిశువులను దారుణంగా చంపేసిన ఘటన ఆ దేశంలో సంచలనం సృష్టించింది. ఈ ఏడుగురితో పాటు మరో ఆరుగురు శిశువుల్నీ చంపేందుకు ప్లాన్ చేసింది లూసీ లెట్‌బీ (Lucy Letby). చెస్టర్ హాస్పిటల్‌లో నర్స్‌గా పని చేస్తున్న చిన్నారులకు ఇన్సులిన్ ఎక్కించింది. కావాలనే ఎక్కువ డోస్‌లు ఉన్న లిక్విడ్స్ ఇచ్చింది. ఫలితంగా ఆ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గతేడాది అక్టోబర్ నుంచి ఈ కేసు ట్రయల్ నడుస్తూనే ఉంది. తనను తాను దయ్యం, భూతం అని చెప్పుకున్న లూసీ...ఈ హత్యల తరవాత నోట్స్‌లో ఏదో రాసుకుంది. వాటిని కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. "నాకు పిల్లల్ని చూసుకోవడం సరిగ్గా తెలియదు. అందుకే చంపేశాను. నేనో దయ్యాన్ని" అని తన నోట్‌బుక్‌లో రాసుకుంది నిందితురాలు లూసీ. అయితే...ఈమెని పోలీసులు పట్టుకుని, దోషిగా తేల్చడంలో భారత సంతతికి చెందిన పీడియాట్రిషియన్ డాక్టర్ రవి జయరామ్ ఎంతో సహకరించారు. చెప్పాలంటే...ఆయన వల్లే నిందితురాలని తొందరగా అదుపులోకి తీసుకోవడం సాధ్యమైంది. బ్రిటీష్ న్యూస్ ఛానల్ ITV Newsకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు చెప్పారు జయరాం. 2015లోనే ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద రీతిలో చనిపోవడాన్ని గుర్తించానని వెల్లడించారు. ఈ మరణాలపై తనకు అనుమానాలున్నాయని అప్పట్లోనే వాదించారు. ఆ తరవాత 2017 ఏప్రిల్‌లో పోలీసులను కలిసి దీని గురించి చెప్పే అవకాశం వచ్చింది.
"వైద్యులమంతా కలిసి పోలీసులతో మాట్లాడాం. పది నిముషాల్లోనే వాళ్లకు విషయం అంతా అర్థమైంది. ఎవరో కావాలనే ఇలా హత్యలు చేస్తున్నారని వాళ్లు కూడా అనుమానించారు. వెంటనే విచారణ మొదలు పెట్టారు. అప్పుడే నిందితురాలు ఎవరో బయట పడింది. వెంటనే ఆమెని అదుపులోకి తీసుకున్నారు"
- డాక్టర్ రవి జయరాం
రకరకాల పద్ధతుల్లో హత్యలు..
యూకేలోని Crown Prosecution Service కోర్టులో కీలక విషయాలు వెల్లడించింది. నిందితురాలు లూసీ..నియోనటల్ వార్డ్‌లోని 13 మంది చిన్నారులను రకరకాల పద్ధతుల్లో హత్య చేసినట్టు తేలింది. 2015-2016 మధ్య కాలంలో ఎక్కువగా హత్యలు జరిగినట్టు విచారణలో నిర్ధరణకు వచ్చారు పోలీసులు. కొలీగ్స్‌ని కూడా చంపేందుకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. పాలు, ఫ్లూయిడ్స్‌తో చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన నర్స్...వాటినే మారణాయుధాలుగా మార్చుకుని అందరినీ చంపేసింది. హాస్పిటల్‌లో ఉంటే తమ బిడ్డలు సేఫ్‌గా ఉన్నట్టే అని ధీమాగా ఉన్న తల్లిదండ్రులను షాక్‌కి గురి చేశాయి ఈ హత్యలు. 2018 జులైలో లూసీని అరెస్ట్ చేయగా...2020 నవంబర్‌లో శిక్ష ఖరారైంది. ఈ హత్యలు జరగకపోయి ఉంటే ఆ చిన్నారులంతా ఈ పాటికి సరదాగా స్కూల్‌కి వెళ్లొచ్చి, ఆటలాడుకునే వారని, కానీ లూసీ వాళ్ల జీవితాల్ని అర్ధంతరంగా ముగించేసిందని డాక్టర్ జయరాం ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులను రక్షించేందుకు ట్రైనింగ్ ఇచ్చి పంపింతే ఇంత దారుణానికి ఒడిగట్టిందని ఆసుపత్రి సిబ్బంది మండి పడుతోంది. పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు లైఫ్‌ని ఎలా లీడ్ చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదని, వాళ్లకు ఎప్పటికీ అండగా ఉంటామని చెబుతోంది.
Also Read: Watch Video: ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ట్రైన్‌లో నుంచి మంటలు, ఉలిక్కిపడ్డ ప్రయాణికులు