Indian Navy Naval Ensign: ఇండియన్ నేవీ కొత్త జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ, ఏయే మార్పులు చేశారంటే?
Indian Navy Naval Ensign: ప్రధాని మోదీ ఇండియన్ నేవీ కొత్త జెండాను ఆవిష్కరించారు.

Indian Navy Naval Ensign:
ప్రధాని నరేంద్ర మోదీ ఇండియన్ నేవీ కొత్త జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు మరి కొందరు నేవీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త జెండా "సంపన్నమైన భారతీయ సముద్ర వారసత్వానికి తగినట్టుగా ఉంటుందని" కేంద్రం చెబుతోంది. ఇండియన్ నేవీ ఫ్లాగ్ మార్చడం ఇదే మొదటి సారి కాదు. 1950 నుండి మూడు సార్లు మార్చారు. ఇది నాలుగో సారి. ప్రస్తుతం భారత నావికాదళం చిహ్నంలో రెండు ఎరుపు చారల మధ్య భారతీయ చిహ్నం ఉంటుంది. ఎరుపు సమాంతర-నిలువు చారలతో తెల్లటి జెండాతో ఖండంలో త్రివర్ణ పతాకం ఉంటుంది. భారతదేశ విభజనతో, స్వాతంత్య్రం తర్వాత, రాయల్ ఇండియన్ నేవీ రాయల్ ఇండియన్ నేవీ, రాయల్ పాకిస్థాన్ నేవీగా విభజించారు. జనవరి 26, 1950న భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించడంతో 'రాయల్' అనే పదాన్ని తొలగించారు. అప్పట్నుంచి ఇండియన్ నేవీగా వ్యవహరిస్తున్నారు. 2001 వరకు ఉన్న చిహ్నాన్ని మార్చి తర్వాత నేవీ బ్లూ కలర్ ఇండియన్ నేవీ క్రెస్ట్‌ని తీసుకువచ్చారు. 2004లో అశోక చిహ్నం తిరిగి చేర్చారు. 2001లో నావికాదళ చిహ్నం తొలగించారు. 2014లో అశోక్ చిహ్నం కింద జాతీయ నినాదం “సత్యమేవ జయతే” నే చేర్చారు. ఇప్పుడు మరోసారి మార్పులు చేశారు.
Prime Minister Narendra Modi unveils the new Naval Ensign in Kochi, Kerala.
— ANI (@ANI) September 2, 2022
Defence Minister Rajnath Singh, Governor Arif Mohammad Khan, CM Pinarayi Vijayan and other dignitaries are present here. pic.twitter.com/JCEMqKL4pt
#WATCH | Kochi, Kerala | Hoisting of the new Naval Ensign 'Nishaan', on #INSVikrant in the presence of Prime Minister Narendra Modi. pic.twitter.com/DaFdg52iMU
— ANI (@ANI) September 2, 2022
#Historical...
— IN (@IndiannavyMedia) September 2, 2022
Hon'ble PM @narendramodi unveils the new #naval ensign making 02 Sep 2022 as a momentous day in the history of #IndianNavy#HarKaamDeshKeNaam@DefenceMinIndia@Indiannavy pic.twitter.com/eu3BpmWQfX
Indian Navy gets a new Flag.
— KJS DHILLON🇮🇳 (@Tiny_Dhillon) September 2, 2022
National Flag is always on top.
Octagonal Navy insignia is centrally located with the operational reach in all eight directions.
Perfect Flag 👍
Jai Hind 🇮🇳 pic.twitter.com/PmYxCLrF8U
Also Read: INS Vikrant: ఇండియన్ నేవీలోకి IAC విక్రాంత్, జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

