అన్వేషించండి

కొత్త కూటమికి సిద్ధమవుతున్న AIDMK,ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చాక కీలక నిర్ణయం

AIADMK New Alliance: తమిళనాడులో అన్నాడీఎమ్‌కే పార్టీ కొత్త కూటమికి సిద్ధమవుతోంది.

AIADMK New Alliance:


అన్నా డీఎమ్‌కే కొత్త కూటమి..

ఇటీవలే NDA కూటమి నుంచి  AIADMK పార్టీ బయటకు వచ్చింది. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై మరో కీలక ప్రకటన చేసింది ఆ పార్టీ. ప్రత్యేకంగా కొత్త కూటమి ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలతోనే ఈ కొత్త కూటమితో బరిలోకి దిగనున్నట్టు స్పష్టం చేసింది. బీజేపీతో తమ పొత్తు ఇకపై ఉండదని తేల్చి చెప్పింది. ఇన్నాళ్లూ అధికార పక్షం DMKకి ఇదో అస్త్రంగా ఉండేది. AIDMK బీజేపీతో ఉండడంపై తీవ్ర విమర్శలు చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌తో పాటు ఉదయనిధి స్టాలిన్ కూడా అన్నా డీఎమ్‌కే పార్టీపై ఇటీవల మండిపడ్డారు. సరిగ్గా మూడు రోజుల తరవాత AIDMK NDA నుంచి బయటకు వస్తున్నట్టు ప్రకటించింది. దాదాపు నాలుగేళ్లుగా బీజేపీతోనే కలిసి ఉంది ఈ పార్టీ. అయితే...తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైని తొలగించాలని అన్నాడీఎమ్‌కే పార్టీ పట్టుబట్టిందని, ఈ విషయంలో విభేదాలు రావడం వల్లే NDA నుంచి బయటకు వచ్చేసిందన్న వాదనలు వినిపించాయి. దీనిపై అన్నాడీఎమ్‌కే నేత మునుస్వామి క్లారిటీ ఇచ్చారు. ఇంత పెద్ద పార్టీ అలాంటి పనులు చేసిందంటే ఎలా నమ్ముతారంటూ మండి పడ్డారు. 

"బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని తొలగించాలని మా పార్టీ డిమాండ్ చేసిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇలా అడగడం ఎంత పిల్లలాటగా ఉంటుందో మాకు తెలియదా..? అలాంటి తప్పులు మేం ఎప్పటికీ చేయం. మేం అనాగరికులం కాదు. వేరే పార్టీ ఎలా నడవాలో చెప్పడానికి మేం ఎవరం..? అన్నాడీఎమ్‌కే అలాంటి పార్టీ కాదని గుర్తు పెట్టుకోండి. మేం NDA నుంచి బయటకు రావడాన్ని కూడా డీఎమ్‌కే ఓ డ్రామా అని కొట్టి పారేస్తోంది. మేం బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని DMK భయపడుతోంది. అందుకే ఇలా మాట్లాడుతోంది. ఇకపై NDAలో చేరేది లేదు. కానీ కొత్త కూటమిని ఏర్పాటు చేస్తాం"

- కేపీ మునుస్వామి, AIDMK నేత 

 బీజేపీతో అన్నాడీఎంకే తెగదెంపులు చేసుకుంది. ఇకపై ఎన్డీఏ భాగస్వామిగా ఉండబోవడం లేదని ప్రకటించింది. తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్25న జరిగిన పార్టీ కీలక నేతల సమావేశం తర్వాత ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ద్రవిడ దిగ్గజం సీఎన్ అన్నాదురైపై తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో.. బీజేపీతో విడిపోవాలని AIADMK ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు అన్నాడీఎంకే పార్టీ డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి తెలిపారు. ఈ రోజు నుంచి బీజేపీ, ఎన్డీయే కూటమితో అన్నాడీఎంకే తెగదెంపపులు చేసుకుంటోందనని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం గత ఏడాది కాలంగా మా మాజీ నాయకులు, మా ప్రధాన కార్యదర్శి ఈపీఎస్ పై, అలాగే పార్టీ కార్యకర్తల గురించి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మునుసామి చెప్పారు. బీజేపీతో పొత్తు తెగదెంపుల సందర్భంగా పార్టీ కార్యాలయం బయట పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. 

Also Read: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎమ్‌ఎస్ స్వామినాథన్ కన్నుమూత


 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వారింగ్ 
నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వారింగ్ 
Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
Andhra Pradesh News: మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
Telangana Half Day School: తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!
తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP DesamEngland Players Not Retained by IPL Franchises | ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు ఝలక్ | ABP Desamఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వారింగ్ 
నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వారింగ్ 
Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
Andhra Pradesh News: మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
Telangana Half Day School: తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!
తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!
Prashant Kishor: నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !
నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !
Asad Vs BJP: టీటీడీ బోర్డుతో వక్ఫ్ బిల్లును పోల్చిన అసదుద్దీన్ ఓవైసీ - ఘర్ వాపసీకి స్వాగతిస్తామని బీజేపీ కౌంటర్
టీటీడీ బోర్డుతో వక్ఫ్ బిల్లును పోల్చిన అసదుద్దీన్ ఓవైసీ - ఘర్ వాపసీకి స్వాగతిస్తామని బీజేపీ కౌంటర్
Matka Trailer: వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
Tirupati News: తిరుపతిలో చాక్లెట్ల ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యం- సీఎం, హోంమంత్రి దిగ్భ్రాంతి- బాధితులకు సాయం ప్రకటన
తిరుపతిలో చాక్లెట్ల ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యం- సీఎం, హోంమంత్రి దిగ్భ్రాంతి- బాధితులకు సాయం ప్రకటన
Embed widget