PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన తదుపరి విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి? దాని కంటే ముందు రైతులు ఏం చేయాలి?
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన 20వ విడత నిధులు త్వరలోనే విడుదల విడుదలకానున్నాయి. ఈ డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తేదీ వచ్చే ముందు ఈ పనులు పూర్తి చేయండి.

PM Kisan Yojana : భారత ప్రభుత్వం దేశ ప్రజల కోసం అనేక పథకాలను అందిస్తోంది. ప్రభుత్వం వివిధ పథకాలను దేశంలోని వివిధ వర్గాల ప్రజలు పొందుతున్నారు. దేశంలో సగం కంటే ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం ద్వారా జీవనం సాగిస్తున్నారు. అందుకే ప్రభుత్వం దేశంలోని రైతుల కోసం ప్రత్యేకంగా అనేక పథకాలను అందిస్తోంది. దేశంలో ఇప్పటికీ చాలా మంది రైతులు వ్యవసాయం ద్వారా తగినంత ఆదాయం పొందలేకపోతున్నారు.
అటువంటి రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ రైతుల కోసం ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా రైతులకు సంవత్సరానికి రూ.6000 ఆర్థిక సహాయం అందిస్తోంది. దేశంలోని కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 19 విడుతల ద్వారా నిధులు పంపిణీ చేశారు. అందరు రైతులు ఇప్పుడు 20వ విడుత కోసం ఎదురు చూస్తున్నారు. రైతులకు తదుపరి విడుత ఎప్పుడు అందుతుంది? విడుత అందే ముందు ఈ పని పూర్తి చేసుకోవాలి.
జూన్‌లో విడుత విడుదల కావచ్చు
ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న రైతులు 20వ విడుత కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం 4 నెలల వ్యవధిలో నిధులు పంపిణీ చేస్తుంది. ప్రభుత్వం 19వ విడతను ఫిబ్రవరి నెలలో విడుదల చేసింది. ఫిబ్రవరిని బట్టి చూస్తే, తదుపరి విడుత జూన్‌లో విడుదల కావచ్చు.
ఇప్పుడు ఉన్న వివరాలు ప్రకారం ప్రభుత్వం జూన్ 20 వరకు తదుపరి విడుతను విడుదల చేయవచ్చు. అయితే, ప్రభుత్వం లేదా వ్యవసాయ శాఖ ఇంకా దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఇవ్వలేదు. అధికారిక సమాచారం కోసం మీరు కొన్ని రోజులు వేచి ఉండవలసి ఉంటుంది.
రైతులు ఈ పని పూర్తి చేసుకోండి
ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న రైతుల కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, అన్ని రైతులు ఈ-కెవైసీని పూర్తి చేసుకోవడం తప్పనిసరి. ఇంకా ఈ-కెవైసీ చేయని రైతులకు తదుపరి విడుత ఆలస్యం కావచ్చు. కాబట్టి, మీరు ఇంకా ఈ పని పూర్తి చేయకపోతే, వెంటనే పూర్తి చేసుకోండి. లేదంటే మీ డబ్బులు ఆగిపోవచ్చు.
ఏడాదికి మూడు విడతలుగా లబ్ధిదారులకు నిధులు
రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ Prime Minister Kisan Yojana పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్1 ప్రారంభించింది. అధికారికంగా 2019ఫిబ్రవరి 24న మొదటి విడత డబ్బులు రైతుల ఖాతాల్లో వేశారు. ఎప్పుడు ప్రారంభమైంది. ఈ పథకంలో భాగంగా ఏడాదికి ఆరు వేల రూపాయలు కేంద్రం సాయం చేస్తుంది. దీన్ని మూడు విడతలుగా ఇస్తారు. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేశారు. భూమి ఉన్న చిన్న, మధ్యతరహా రైతులు అందరూ ఈ పథకానికి అర్హులే. 2025 నాటికి దాదాపు 11 కోట్లకుపైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఆదాయపు పన్ను చెల్లించేవాళ్లు. ప్రభుత్వ ఉద్యోగులు, బోర్డ్ మెంబర్లు, పారిశ్రామికులు, డాక్టర్లు, ఇంజినీర్లు వంటి వ్యవసాయేతర వ్యక్తులకు ఈ పథకం వర్తించదు.





















