Viral Video: బిల్డింగ్ పైనుంచి పడిపోయిన చిన్నారి, ఆ తరువాత జరిగిన అద్భుతాన్ని వీడియోలో చూడండి
Viral News | క్షణాల్లో ప్రాణం పోతుందనగా ఓ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అటు వైపుగా వెళ్తున్న వ్యక్తి చివరి క్షణంలో పట్టుకోవడంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పింది.

Viral Video Man saves Kid life: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని, లక్కుండాలని అంటున్నారు. చిన్నారి ఆయుష్షు గట్టిది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వీడియోలో జరిగింది చూస్తే అది ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి క్షణాల్లోనే ఒక చిన్నారి ప్రాణాలను కాపాడిన సంఘటన వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. ఈ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది, కానీ తల్లిదండ్రుల మంచే ఆ బిడ్డను కాపాడిందని నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇంటర్నెట్‌లో ప్రతిరోజూ వేలాది వీడియోలు వస్తుంటాయి, కానీ కొన్ని వీడియోలు మన మనసును తాకుతాయి. అందులోనూ ఒకరి ప్రాణాలను కాపాడటం అంటే అందరికీ నచ్చుతుంది. ఇందుకు సంబంధించిన ఈ వీడియోను ఎక్స్ (X) లో @Jimmyy__02 అనే యూజర్ షేర్ చేశాడు. చివరి శ్వాస ఉన్నంత వరకు మరణం దగ్గరకు రాదు అని క్యాప్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ వీడియో ప్రతి సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో ఏముంది?
ఒక చిన్నారి రెండు అంతస్తుల భవనంపై ఆడుకుంటున్నట్లు కనిపిస్తుంది. అయితే బాలుడు ప్రమాదవశాత్తూ బాల్కనీ అంచువరకు వెళ్లాక పట్టు కోల్పోయాడు. పైకి ఎక్కాలని ప్రయత్నించినా వీలు కుదరలేదు. రెండు అంతస్తుల భవనం నుండి పడిపోయాడు. అదే సమయంలో అక్కడ నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి పైకి చూసి గమనించాడు. క్షణాల్లో స్పందించి, ఏమీ ఆలోచించకుండా ఆ బాలుడ్ని పట్టుకున్నాడు. అతని వేగం, తెలివితేటలు ఆ పిల్లాడి ప్రాణాలను కాపాడాయి. ఇదంతా కొన్ని సెకన్లలోనే అచ్చం సినిమా సీన్ తరహాలో జరిగింది. కానీ ఒక సాధారణ వ్యక్తి ఆ క్షణంలో సరైన నిర్ణయం తీసుకుని ఒక జీవితాన్ని ఎలా కాపాడాడో వీడియోలో కనిపిస్తుంది.
जब तक सांसें हैं मौत नहीं पास आएगी...? pic.twitter.com/jzHAUqgu02
— JIMMY (@Jimmyy__02) October 16, 2025
ప్రజల రియాక్షన్ ఇదే
బాలుడ్ని ఓ వ్యక్తి కాపాడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగానే వైరల్ అయింది. వేలాది మంది దీన్ని చూసి షేర్ చేశారు. చిన్నారి ప్రాణాలు కాపాడిన మీరు చాలా మంచి వారు, క్షణాల్లో స్పందించడంతో ఓ ప్రాణ నిలిచింది అని కామెంట్లు చేస్తున్నారు. భగవంతుడు ఆ వ్యక్తి రూపంలో సరైన సమయంలో వచ్చాడని కొందరు పోస్ట్ చేయగా.. మరికొందరు అతడు రియల్ హీరో అని అంటున్నారు. సమయానికి స్పందించి ప్రాణాలు కాపాడిన వ్యక్తి దేవుడని అన్నారు. కొంతమంది ఆ వ్యక్తి చేసిన పనికిగానూ సత్కరించాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.






















