Konaseema Viral News: బిర్యానీలో మండ్రకప్ప, ముగ్గురిలో ఒకరు మృతి! అమలాపురం హోటల్‌లో ఏం జరిగింది?
వాతవారణం ముసురేసింది..ఇంక వెంటనే గుర్తకు వచ్చేది వేడి వేడిగా ఘుమఘుమలాడే బిర్యానీ కదా.. సరిగ్గా ఇలాగే బిర్యానీ తెచ్చుకుని పార్శిల్ విప్పి తింటుండగా అనుకోని అతిధి కనిపించింది..

వాతవారణం ముసురేసింది.. జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.. ఇంక వెంటనే గుర్తకు వచ్చేది వేడి వేడిగా ఘుమఘుమలాడే బిర్యానీ కదా.. సరిగ్గా ఇలాగే బిర్యానీ తెచ్చుకున్న నలుగురు కుర్రాళ్లు పార్శిల్ విప్పి తింటుండగా పార్శిల్లో అనుకోని అతిధి కనిపించింది..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓహోటల్ నుంచి తెచ్చుకున్న బిర్యానీ పార్శిల్‌లో చికెన్ పీస్‌లతో పాటు చనిపోయిన మండ్రకప్ప ఉన్న వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అయితే ఈ బిర్యానీ తిన్న ముగ్గురు యువకుల్లో ఒక యువకుడు చనిపోయాడని, మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారని ప్రచారం సాగుతోంది.. ఇదిలా ఉంటే దీనిపై ఎవ్వరూ ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు చేయకపోగా ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియా గ్రూపుల్లో తెగ సర్క్యులేట్ అవుతోంది..
అసలేం జరిగిందంటే...
వారం రోజుల క్రితం అమలాపురంలోని కొంకాపల్లికి చెందిన ముగ్గురు యువకులు అమలాపురంలోని ప్రముఖ హోటల్ నుంచి బిర్యానీ పార్శిల్ తెచ్చుకున్నారు. ముగ్గరు సగం వరకు తినేశారు.. ఇంతలో చికెన్ ఫ్రై పీసులతో కలిపి ఏగిపోయిన కొంచెం డిఫరెంట్‌గా వారి కంట పడింది.. సరిగ్గా పరిశీలించిన వారికి షాక్ అవ్వాల్సి వచ్చింది.. బిర్యానీ పీసులతో కలిపి ఏగిపోయిన మండ్రకప్ప కనిపించింది. దీంతో కంగారు అయిన వారు వెంటనే దానిని వీడియో తీసి తిరిగి అదే హోటల్‌కు పట్టుకెళ్లి చూపించినట్లు తెలిసింది.. దీనికి ఆ హోటల్ నిర్వాహకులు తప్పు ఒప్పుకుని మరో పార్శిల్ ఇస్తామని చెప్పారని, అయితే అప్పటికే వారికి ఆరోగ్యంలో తేడా రావడంతో ఆసుపత్రికి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఇందులో ఒక యువకుడికి సీరియస్ అవ్వగా ఆ యువకుడిని కాకినాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని చెబుతున్నారు.
అయితే ఈ ఘటనపై బాధితులు ఎవ్వరూ బయటకు రాకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే ఆ హోటల్ నిర్వాహకులు కూడా ఆ వ్యక్తి మృతిచెందింది తమ హోటల్‌లో ఫుడ్ తిని మాత్రం కాదని, అతనికి అప్పటికే సివీరియర్ హెల్త్ ఇష్యూలు ఉన్నాయని, మందులు వేసుకోవడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల అతను మృతిచెందాడని వైద్యులే తేల్చి చెప్పారని సదరు హోటల్ యాజమాన్యం చెప్పకొస్తుందంటున్నారు.
బిర్యానీలో మండ్రకప్ప రావడం నిజమేనా..
అమలాపురంలో మాత్రం ప్రముఖ హోటల్‌లో తెచ్చుకున్న బిర్యానీ పార్శిల్‌లో చనిపోయిన మండ్రకప్ప రావడం వాస్తవమేనని స్థానికంగా చర్చ జరుగుతోంది.. బిర్యానీ తెచ్చుకుని తింటున్న క్రమంలో ఆ పార్శిల్‌లో మండ్రకప్ప రావడంతో ఆ పార్శిల్‌ను వెనక్కు తెచ్చి హోటల్ వారికి చూపించడంతో వారు తప్పు ఒప్పుకున్నారని, అంతే కాకుండా ఆ యువకుడి ఆసుపత్రి బిల్లు కూడా హోటల్ యాజమాన్యమే కట్టిందని ప్రచారం జరుగుతోంది.. అయితే బాధితుడు మృతిచెందాడని చెబుతున్న వారి కుటుంబ సభ్యులు కానీ, మరో ఇద్దరు యువకులు కానీ ఈ దుమారంపై మాట్లాడడం లేదు..
హోటల్ యాజమాన్యం ఏమంటుందంటే..
బిర్యానీ పార్శిల్ లో మండ్రకప్ప వచ్చిందని, అది తిన్న ముగ్గురు యువకుల్లో ఒకరు మృతిచెందాడని జరుగుతోన్న రచ్చపై సదరు హోటల్ యజమానితో ఏబీపీ దేశం మాట్లాడింది. అయితే దీనిపై సదరు యాజమాని మాట్లాడుతూ తమ హోటల్ కు సంబందించిన బిర్యానీ పార్శిల్‌లో అటువంటిదేమీ వచ్చినట్లు తమ దృష్టికి రాలేదని, ఒక వేళ వచ్చి ఫుడ్ పాయిజన్ అయ్యుంటే అది పట్టు కెళ్లింది కేవలం ఆ ముగ్గురూ మాత్రమే కాదని, చాలా మంది పార్శిళ్లు తీసుకెళ్తారని, పార్శిల్‌లో మండ్రకప్ప వచ్చిందని చెబుతున్న ముగ్గరు అస్వస్థతకు గురికావాలి కదా అటువంటిదేమీ జరగలేదంటున్నారు. అయితే మృతిచెందిన యువకుడికి తీవ్ర ఆనారోగ్య సమస్యలున్నాయని వారి కుటుంబికులే తెలిపారని, మందులు సక్రమంగా వాడకపోవడం వల్లనే అతను మృతిచెందినట్లు కుటుంబికులు, వైద్యులు నిర్ధారించాని ఆయన తెలిపారు.
ఫుడ్ సేప్టీ అధికారులు ఏం చేస్తున్నట్టు...?
అమలాపురంలో హోటళ్లలో జరుగుతోన్న దారుణాలపై ఫుడ్ సేప్టీ అధికారులు కనీస చర్యలు కరవయ్యాయని ప్రజలు మండిపడుతున్నారు. గతంలో హెటళ్లపై అధికారులు దాడులు చేసిన క్రమంలో కుళ్లిపోయిన మాసం పదార్ధాలు, నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలు గుర్తించి కేసులు రాశారు.. అయితే ఈదాడులు జరిగి రెండేళ్లుకు పైబడినా అసలు ఇటీవల కాలంలో ఎటువంటి దాడులు చేయకపోవడం వల్లనే ఈ పరిస్తితి తలెత్తుతోందంటున్నారు. ప్రతీ హోటల్స్‌లోనూ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారుల ఫోన్ నెంబర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు.





















