Viral Video: బిడ్డను కాపాడేందుకు ప్రాణాలిచ్చేసిన తల్లి జింక- ఇది కదా అమ్మ ప్రేమంటే!

తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలిచిన ఓ వీడియో వైరల్ అవుతోంది. మొసలి నుంచి తన బిడ్డను కాపాడుకునేందుకు తల్లి జింక తన ప్రాణాలనే వదిలేసింది.

FOLLOW US: 

ప్రపంచంలో అమ్మ ప్రేమను మించింది ఏదీ లేదు. ప్రతి క్షణం పిల్లల కోసమే తపించే అమ్మ కంటే ఎవరూ ఎక్కువ కాదు. పిల్లలకు చిన్న కష్టం వస్తేనే తల్లి తల్లడిల్లిపోతుంది. అలాంటిది తన బిడ్డకు ఆపద వస్తే ఊరుకుంటుందా? ప్రాణాలకు తెగించి కాపాడుతుంది. అవసరమైతే ప్రాణాలైనా ఇచ్చేస్తుంది. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

తల్లి త్యాగం

ఐఏఎస్ అధికారిణి సోనాల్ గోయెల్ ఓ జింకపై దాడి చేయబోతున్న మొసలి వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇందులో నదిలో ఆకలితో ఉన్న ఓ మొసలికి కొంత దూరంలో జింక ఈత కొడుతూ కనిపించింది. జింకను ఆహారంగా చేసుకోవాలని మొసలి దానిని పట్టుకునేందుకు వేగంగా కదులుతూ వచ్చింది. అయితే కొంత దూరంలో ఉన్న తల్లి జింక రాబోయే ప్రమాదాన్ని గమనించి తన బిడ్డను రక్షించుకునేందుకు వెంటనే నీటిలోకి దూకి రెండింటి మధ్యలోకి వస్తుంది. దీంతో దూరంలో ఉన్న పిల్ల జింకను వదిలేసి పక్కనే ఉన్న తల్లి జింకను మొసలి తన ఆహారంగా తీసుకుంది. తన బిడ్డను కాపాడనుకునే క్రమంలో తల్లి జింక ప్రాణత్యాగం చేసింది.

ఏప్రిల్ 6న పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు జింక ప్రాణత్యాగం తల్లి ప్రేమకు నిదర్శనమని ప్రశంసిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన గుండెల్ని పిండేస్తోందని కామెంట్‌ చేస్తున్నారు. అమ్మ ప్రేమకు ఎలాంటి భేదాలు, హద్దులు లేవని నెటిజెన్లు ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

Also Read: Intelligence Report: భారత పవర్ గ్రిడ్‌పై చైనా హ్యాకర్ల దాడి- ఇవేం పనులురా నాయనా?

Also Read: New York Ganesh Temple Street: అమెరికాలో ఓ వీధికి 'గణేశ్ టెంపుల్' పేరు- ఎందుకు పెట్టారంటే?

Published at : 07 Apr 2022 05:55 PM (IST) Tags: Crocodile Attack Viral Video. Mother deer dies saving her baby Heartbreaking video

సంబంధిత కథనాలు

Gyanvapi Mosque Row: 'జ్ఞానవాపి'పై సుప్రీం విచారణ- మసీదుకు ఒక్కసారిగా 700 మంది ముస్లింలు!

Gyanvapi Mosque Row: 'జ్ఞానవాపి'పై సుప్రీం విచారణ- మసీదుకు ఒక్కసారిగా 700 మంది ముస్లింలు!

Gyanvapi mosque case: 'జ్ఞానవాపి మసీదు'పై సుప్రీం కీలక ఆదేశాలు- కేసు వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ

Gyanvapi mosque case: 'జ్ఞానవాపి మసీదు'పై సుప్రీం కీలక ఆదేశాలు- కేసు వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ

Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?

Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?

Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Afghan Taliban Rules : టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !

Afghan Taliban Rules :  టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !

Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!

Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!

MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్‌ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !

MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్‌	గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !