Viral Video: హైవే సైన్‌బోర్డ్‌పై పుషప్స్, మద్యం మత్తులో ఓ యువకుడి స్టంట్ - వైరల్ వీడియో
Viral Video: మద్యం మత్తులో ఓ యువకుడు హైవే సైన్‌బోర్డ్‌పై పుషప్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
Viral Video:
వీడియో వైరల్
హైవే సైన్‌బోర్డ్‌పై ఓ వ్యక్తి మద్యం మత్తులో పుషప్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏ మాత్రం పట్టుతప్పినా కింద పడే ప్రమాదమున్నా...ఏ మాత్రం భయపడకుండా పుషప్స్ చేశాడు. ఒడిషాలోని బోలంగిర్ టౌన్‌లో ఇది జరిగింది. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఈ వీడియోని అప్‌లోడ్ చేశారు. "దేశీ లిక్కర్ మరీ ఎక్కువగా తాగితే ఇలా ఉంటుంది" అని క్యాప్షన్ కూడా ఆ పోస్ట్‌లో పెట్టారు. అంత పెద్ద ఐరన్ టవర్స్‌పై కంటిన్యూగా 9 సార్లు పుషప్స్ చేశాడా వ్యక్తి. రోడ్‌పైన వెళ్తున్న వాళ్లు ఈ స్టంట్‌ని చూసి ఎక్కడికక్కడే ఆగిపోయారు. అలాగే చూస్తూ ఉండిపోయారు. ఇప్పటికే ఈ వీడియోకి 9 లక్షల వ్యూస్ వచ్చాయి. సండే జిమ్స్ క్లోజ్ చేస్తారు కాబట్టి ఇలా ప్లాన్ చేసుకున్నాడేమో అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. "ఈ వ్యక్తికి జిమ్ ఎక్కడుందో కూడా తెలియదా..? ఇలాంటివి కిందే చేసుకుంటే బెటర్" అని మరో యూజర్ కామెంట్ చేశాడు. "ఆ తరవాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుంది" అని మరో యూజర్ కామెంట్ చేశాడు. బహుశా నెక్స్ట్ ఒలింపియా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాడేమో అని ఇంకొందరు స్పందించారు. అతను తాగాడని ఎవరు చెప్పారు..? కేవలం జనాల అటెన్షన్ కోసం ఇదంతా చేస్తున్నాడు అంటూ ఒకరు పైర్ అయ్యారు.
View this post on Instagram
గుడ్‌గావ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. అర్ధరాత్రి యువకులు నానా హంగామా చేశారు. పీకలదాకా తాగడమే కాకుండా..కార్ రూఫ్‌పై పుషప్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు ఆ యువకులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ.6,500 జరిమానా కూడా విధించారు. గుడ్‌గావ్‌లోని సైబర్ హబ్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఆల్టో కార్ కిటికీలో నుంచి బయటకు వచ్చి మెల్లగా కార్ రూఫ్ ఎక్కాడు. ఆ తరవాత చేతిలో మందు సీసా పట్టుకుని తాగాడు. వెంటనే బాటిల్ పక్కన పెట్టి అక్కడే పుషప్స్ చేశాడు. మిగతా వాళ్లు కూడా తాగుతూ కనిపించారు. వెనకాల మరో కార్‌లో వస్తున్న వ్యక్తి ఇదంతా వీడియో తీశాడు. ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. వైరల్ అయ్యాక పోలీసులు అప్రమత్తమై కార్ నంబర్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. ప్రస్తుతానికి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...కార్‌లోని మిగతా వ్యక్తులనూ గాలిస్తున్నారు. ఆ కార్‌ని సీజ్ చేశారు.
They have no fear of anyone's life and neither of Gurgaon trafficpolice @TrafficGGM
— Pradeepdubey (@dubey_100) May 30, 2023
Vichle no HR72F6692@DC_Gurugram @TrafficGGM@cmohry @gurgaonpolice pic.twitter.com/pM2NeypUdR
Also Read: ఫైవ్ స్టార్ హోటల్లో రెండేళ్లున్నాడు, ఒక్క పైసా కట్టకుండా జంప్ అయ్యాడు