By: Ram Manohar | Updated at : 01 Oct 2023 12:57 PM (IST)
బెంగళూరులో ఓ ఎలక్ట్రిక్ కార్‌లో ఉన్నట్టుండి మంటలు ఎగిసిపడి రోడ్డుపైనే కాలిపోయింది. (Image Credits: Twitter)
Viral Video:
అగ్ని ప్రమాదం..
విద్యుత్ వాహనాలు కొనాలని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. కానీ...వరుసగా జరుగుతున్న ప్రమాదాలు కొనాలనుకునే వాళ్లనీ వెనకడుగేసేలా చేస్తున్నాయి. పలు చోట్ల ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్‌లు, కార్‌లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఇలాంటి ఘటనే ఇప్పుడు బెంగళూరులోనూ వెలుగు చూసింది. రోడ్డుపై వెళ్తున్న విద్యుత్ కార్‌లో నుంచి ఉన్నట్టుండి మంటలు ఎగిసిపడ్డాయి. జేపీ నగర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. సెప్టెంబర్ 30వ తేదీన ఈ ప్రమాదం జరిగింది. జేపీ నగర్‌లోని దాల్మియా సర్కిల్‌కి చేరుకునే సమయానికి కార్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ కార్‌లో ఉన్న ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై కార్ దిగారు. లేకపోయుంటే అంతా సజీవదహనమై ఉండేవాళ్లు. ఆ స్థాయిలో మంటలు వచ్చాయి. అయితే...ఎందుకిలా మంటలు వచ్చాయన్నది ఇంకా తెలియలేదు. గతంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నడిరోడ్డుపైనే కాలిపోయింది. బైక్ నడిపే వ్యక్తి వెంటనే రోడ్డుపై వదిలేసి పక్కకు రావడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలు తరచూ జరుగుతుండటం వల్ల చాలా మంది విద్యుత్ వాహనాలు కొనడానికి ముందుకి రావడం లేదు. ఇప్పుడిప్పుడే మార్కెట్‌కి బూమ్ వస్తోందనకుంటున్న తరుణంలో ఈ ప్రమాదాలు కంపెనీలకూ ఆందోళన కలిగిస్తున్నాయి. డ్యామేజ్ కంట్రోల్‌లో భాగంగా పలు వాహనాలను వెనక్కి తెప్పించి ప్రమాదాలకు కారణాలేంటో కనుగొనే పనిలో పడ్డాయి.
An electric car supposedly caught fire in JP Nagar, Bengaluru.
Scary.. pic.twitter.com/xOoqfCneLp— 𝕲𝖆𝖓𝖊𝖘𝖍* (@gganeshhh) September 30, 2023
గతేడాది మహారాష్ట్రలోని పుణేలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ (Ola Electric Scooter Catches Fire In Pune) నుంచి మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్దమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండగా ఓలా ఎలక్ట్రిక్ బైక్ నుంచి మంటలు వచ్చాయి. కొన్ని సెకన్లలోనే మంటలు చెలరేగి వాహనం దగ్దం కావడంతో ఎలక్ట్రిక్ వాహనాలు వాడే వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఓలాలో యాక్టింగ్ కూలింగ్ సిస్టమ్ లేకపోవడంతో పొగలు రావడం, ఆ వెంటనే మంటలల్లో వాహనం కాలిపోయిందని ట్వీట్ చేశారు. ఖర్చులు తగ్గుతాయని, పెట్రోల్ ధరలకు ఇదే పరిష్కారమని భావించిన వారు తాజా ఘటనలతో ఎలక్ట్రిక్ వాహనాలు సురక్షితమేనా అని పునరాలోచిస్తున్నారు. దీనిపై సంస్థ స్పందించి ఓ ప్రకటన (Ola Company Reaction Over Electric Scooter Catches on Fire) విడుదల చేసింది. పుణెలో ఎలక్ట్రిక్ బైక్ కాలిపోవడం గురించి మాకు సమాచారం అందింది. దీనిపై మేం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మంటలకు కారణమేంటో త్వరలోనే అప్డేట్ ఇస్తాం. ఆ స్కూటర్ ఓనర్‌తో మేం టచ్‌లోనే ఉండి వివరాలు తెలుసుకున్నాం. అతడు సురక్షితంగా ఉన్నారు. ఈ విషయాన్ని మేం చాలా సీరియస్‌గా తీసుకున్నాం. దీనిపై త్వరలోనే సరైన చర్యలు తీసుకుంటామని’ ఓలా సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
Also Read: LPG Price Hike: వినియోగదారులపై గ్యాస్ బండ, ఒక్కసారిగా రూ.209 పెంపు
GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే
BJP MPs Resign: ఒకేసారి 10 మంది బీజేపీ ఎంపీలు రాజీనామా, కారణం ఏంటంటే!
Pakistan-Occupied Kashmir: పాక్ ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికీ మనదే - పార్లమెంట్‌లో అమిత్‌షా కీలక ప్రకటన
Cyclone Michaung Effect: ఏటా చెన్నైని వరదలు ఎందుకు ముంచెత్తుతున్నాయి? ఆ ఒక్క తప్పే ముప్పుగా మారిందా?
NCRB Report 2022: సైబర్ నేరగాళ్ల వలలో చిన్నారులు,ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా బాధితులు - NCRB రిపోర్ట్
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు
Ravi Bishnoi: టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్
Telanagna Politics: కాంగ్రెస్ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?
/body>