Viral Video: మీరు నిజమైన హీరో సర్- చేతులతో డ్రైనేజీ క్లీన్ చేసిన ట్రాఫిక్ పోలీస్!
Viral Video: బెంగళూరులో ఓ ట్రాఫిక్ పోలీసు చేసిన పని ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆయన ఏం చేశారంటే?
Viral Video: వర్షంలో తడుస్తూ, ఎండలో ఎండుతూ, చలిలో వణుకుతూ విధులు నిర్వహిస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. అయితే ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా చాలా మంది ఆకతాయిలు వీరికి మరింత చికాకు తెప్పిస్తారు. అయితే డ్యూటీ అంటే ట్రాఫిక్ క్లియర్ చేయడమే కాదు.. అంతకుమించి అని నిరూపించారు ఓ ట్రాఫిక్ పోలీసు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఆయనను హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతోంది.
ఏం చేశారంటే?
కర్ణాటక బెంగళూరులో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో రోడ్లపైకి నీళ్లు చేరి ప్రజలు అవస్థలుపడుతున్నారు. ఓ రహదారిపై డ్రైనేజీలో చెత్త పేరుకుపోవడంతో నీళ్లు నిలిచిపోయాయి. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకుండా ఆ నీటిలోనే తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు కష్టపడుతున్నారు.
అయితే అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ మాత్రం చేతులతో ఆ డ్రైనేజీని క్లీన్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ట్రాఫిక్ పోలీసుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
నిజమైన హీరో
ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు.
#Bangaluru ट्रैफिक ऑफिसर #JagdishReddy ने अपने हाथ से नाली के मुहाने पर जमा कचरा साफ किया ताकि सड़क में जमा वर्षाज़ल निकले और आमजनों को दिक्कत ना हो.
— Dipanshu Kabra (@ipskabra) June 20, 2022
Commendable work. ये काम उनके Job Role में नहीं आता है, फिर भी ऐसा करना उनकी सेवा भावना व ड्यूटी के प्रति समर्पण दिखलाता है. pic.twitter.com/6Ue0naF3fl
ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ట్రాఫిక్ పోలీస్ జగదీశ్‌రెడ్డిని హీరో అంటూ ప్రశంసిస్తున్నారు.
Also Read: Cable Car Mishap: రోప్‌వే పై నిలిచిపోయిన కేబుల్ కార్- ఇలా చిక్కుకుపోయారేంటి!
Also Read: CM Stalin: ముఖ్యమంత్రికి అస్వస్థత- అధికారిక కార్యక్రమాలు రద్దు