Vinayaka Chavithi 2025 Special : మూడు తొండాలు ఉన్న ఏకైక వినాయకుడి ఆలయం.. ఇండియాలో ఎక్కడుందో తెలుసా?
Vinayaka Chavithi : త్రిశుండ్ మయూరేశ్వర్ గణపతి ఆలయం గురించి తెలుసా? మూడు తొండాలు, ఆరు చేతులు కలిగిన వినాయకుడు ఎక్కడున్నాడో.. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Trishund Mayureshwar Ganpati Temple : భారతదేశంలో వినాయకుడికి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ప్రతీది దాని సొంత కథను, ప్రత్యేకతను సూచిస్తుంది. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్న వినాయకుడి రూపాన్ని చూడాలనుకుంటే.. కచ్చితంగా పూణే వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇక్కడ భక్తులను ఆశ్చర్యపరిచే లుక్లో వినాయకుడు దర్శనమిస్తారు. అదే సోమవార్ పేత్‌లో ఉన్న త్రిశుండ్ మయూరేశ్వర్ గణపతి టెంపుల్. ఇక్కడ గణేశుడు మూడు తొండాలు, ఆరు చేతులు, వాహనమైన మూషికకు బదులుగా నెమలిని అధిరోహించి ఉంటారు. ఇండియాలో ఈ రూపంలో కనిపించే ఏకైక ప్రదేశం ఇదే. గణేష్ చతుర్థి (Ganesh Chaturthi) 2025 సందర్భంగా మీరు ఈ ఆలయాన్ని సందర్శించాలనుకుంటే దాని గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అద్భుతమైన కట్టడం
త్రిశుండ్ మయూరేశ్వర్ గణపతి ఆలయాన్ని 1754-1770 మధ్య భీంజిగిరి గోస్వామి మార్గదర్శకత్వంలో నిర్మించారు. ఈ దేవాలయం రాజస్థాన్, మాల్వా , దక్షిణ భారతదేశం కట్టడాలను పోలి ఉంటుంది. బంకమట్టితో చెక్కిన గణపతి విగ్రహాల మాదిరిగా కాకుండా.. ఇక్కడ దేవుడు స్వచ్ఛమైన నల్ల బసాల్ట్ రాతితో రూపుదిద్దుకొని ఉంటాడు. దేవాలయం బూడిద రంగు బసాల్ట్‌తో నిర్మించారు. నెమళ్లు, చిలుకలు మొదలుకొని పోరాటంలో ఉన్న ఏనుగులు, గొలుసులతో కట్టిన ఖడ్గమృగాలు, పురాణ పాత్రలలతో ఉన్న అద్భుతమైన చెక్కడాలు ఆకట్టుకుంటాయి. ప్రవేశ ద్వారం వద్ద.. చెక్కిన ద్వారపాలకులు కాపలాగా ఉంటారు.
మూడు తొండాలు ఎందుకుంటాయి
View this post on Instagram
ఇక్కడ వినాయకుడికి మూడు తొండాలు ఎందుకు ఉన్నాయనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. భక్తులు ఈ ప్రత్యేక రూపాన్ని వివిధ మార్గాల్లో చూస్తారు. కొందరు మూడు తొండాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తులను సూచిస్తాయని నమ్ముతారు. సృష్టి, పరిరక్షణ, వినాశనాన్ని కూడా సూచిస్తుంది. మరికొందరు వాటిని సమయానికి ప్రతిబింబంగా చూస్తారు. గతం, వర్తమానం, భవిష్యత్తును సూచిస్తుంది. గణేషుడి ఉనికి ప్రవాహంపై అధికారాన్ని సూచిస్తుంది. మరికొందరు భక్తులు జీవితంలోని ప్రతి అంశంలోనూ, భౌతికమైనా, ఆధ్యాత్మికమైనా లేదా మేధోపరమైనా మార్గనిర్దేశం చేసే వినాయకుడిగా కొలుస్తారు.
సంస్కృతులు, శాసనాల మిశ్రమం
ఈ దేవాలయ గోడలపై సంస్కృతం, దేవనాగరి, పర్షియన్ భాషలలో శాసనాలు ఉంటాయి. పేష్వా యుగంలో పూణేలో ఉన్న గొప్ప సాంస్కృతికను ఇది హైలైట్ చేస్తుంది. సభామండపంలోని విగ్రహం.. గర్భాలయానికి దారి తీస్తుంది. దానికింద దేవాలయ స్థాపకుడు భీంజిగిరి గోస్వామి సమాధి ఉంది. ప్రతి సంవత్సరం.. ముఖ్యంగా వినాయక చవితి సమయంలో.. ఈ దేవాలయాన్ని వేలాది మంది భక్తులు సందర్శిస్తారు. జ్ఞానం, శ్రేయస్సు, కొత్త ప్రారంభాలలో విజయాన్ని కోరుతూ.. దూర్వా గడ్డి, మోదక్‌లను సమర్పిస్తారు. ఈ ఏడాది మీరు వెళ్లాలనుకుంటే ఫ్యామిలీతో కలిసి వెళ్లగలిగే ప్రదేశం ఇది.






















