అన్వేషించండి

Siddhi Vinayaka Temple : వినాయక చవితి 2025 స్పెషల్.. సిద్ధి వినాయక ఆలయం గురించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే

Vinayaka Chavithi 2025 : ముంబైలోని సిద్ధివినాయక ఆలయానికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఆ టెంపుల్ గురించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Ganesh Chaturthi 2025 : హిందూ పురాణాల ప్రకారం.. వినాయక చవితి లేదా గణేశ్ చతుర్థి అనేది శివుడు, పార్వతి దేవి కుమారుడైన గణేశుడి జన్మదినం. సాధారణంగా వినాయక చవితిని ఎక్కువరోజులు జరుపుకుంటారు. మండపాలు, పూజలు, ఊరేగింపులు వంటివి చేసి.. భక్తులు హంగామా చేస్తారు. ఇలా చేయడం వల్ల గణేశుడు తాము చేసే పనుల్లోని విఘ్నాలు తొలగిస్తాడని భావిస్తారు. ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 27వ తేదీన వచ్చింది. ఆ సమయంలో చాలామంది వినాయకుడికి ప్రసిద్ధి చెందిన ఆలయాలు సందర్శిస్తారు. ముంబైలోని సిద్ధి వినాయక (Siddhi Vinayaka) టెంపుల్​ కూడా గణేశుడికి ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు సందర్శిస్తారు. ఈ ఆలయం గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చూసేద్దాం. 

అత్యంత ధనిక దేవాలయం

(Image Source: Pinterest/tripoto)
(Image Source: Pinterest/tripoto)

సిద్ధి వినాయక ఆలయం ప్రపంచంలోనే.. అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి. ఇటుకలతో చేసిన ఒక చిన్న గుడిగా ఉండే ఈ ఆలయాన్ని దేబాయి పాటిల్ అనే భక్తురాలు చేసిన విరాళాలతో గుడిని ఓ భవనంగా పునరుద్ధరించారు. ఇప్పటికీ ఈ ఆలయం అన్యదేశ చెక్కడాలు, బంగారంతో చేసిన అంతర్భాగంతో భక్తులను ఆకట్టుకుంటుంది. సిద్ధి వినాయకుడు 100 మిలియన్ల వరకు విరాళాలు అందుకున్నట్లు తేలింది. ఇది భక్తులు గణేశుడిపై పెట్టుకున్న నమ్మకాన్ని సూచిస్తుంది.

కుడి వైపున గణేష్ తొండం

(Image Source: Pinterest/hinduism_facts)
(Image Source: Pinterest/hinduism_facts)

సాధారణంగా గణేశుడి విగ్రహాలకు తొండం ఎడమ వైపునకు ఉంటుంది. అయితే సిద్ధి వినాయక ఆలయంలోని విగ్రహానికి తొండం కుడి వైపునకు ఉంటుంది. కుడి వైపున తొండం ఉన్న గణేష్​ను సిద్ధి వినాయకుడు అని పిలుస్తారు. కుడి వైపున ఉన్న తొండం అన్ని కోరికల నుంచి విముక్తిని, మోక్షాన్ని సాధించడాన్ని సూచిస్తుందని చెప్తారు. ఈ ఆలయంలోని గణేశుడి విగ్రహాన్ని ఒక నల్లరాయితో చెక్కారు. విజయానికి, శ్రేయస్సుకు, సంపదకు దేవతలైన రిద్ధి, సిద్ధి విగ్రహాలు 2.5 అడుగుల ఎత్తైన గణేశుడి విగ్రహానికి రెండు వైపులా ఉంటాయి. 

హనుమంతుడి విగ్రహం

(Image Source: Pinterest/sanjaisinghvns)
(Image Source: Pinterest/sanjaisinghvns)

సిద్ధి వినాయక ఆలయం దగ్గర 1952లో హనుమంతుడి విగ్రహం కనుగొన్నారు. భక్తులు హనుమను గుర్తించి ఆలయ ప్రధాన పూజారికి సమాచారం అందించగా.. అప్పడు ప్రధాన పూజారి హనుమంతుడి విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకువచ్చి.. దానికి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. అనంతరం ఆలయంలో హనుమంతుడి విగ్రహం కోసం ఒక గుడిని నిర్మించారు. చాలా మంది భక్తులు సిద్ధి వినాయకుడి దగ్గరకు వచ్చి హనుమంతుడి ఆశీర్వాదాలు సైతం పొందుతారు.  

గణేశుడి మూడవ కన్ను

(Image Source: Pinterest/vchidam)
(Image Source: Pinterest/vchidam)

 

సిద్ధి వినాయకుడి ఆలయంలోని గణేశుడి విగ్రహానికి శివుడిలాగే మూడవ కన్ను ఉంటుంది. ఈ కన్ను దైవిక అవగాహన, అంతర్దృష్టికి ప్రతీక. హిందూ పురాణాల ప్రకారం.. మూడవ కన్ను అసాధారణమైన విషయాలను చూసే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇది అవగాహన, సత్యాన్ని గ్రహించే శక్తిని సూచిస్తుంది. మూడవ కన్ను గణేశుడి నుదుటిపై కాకుండా తొండంపై ఉంటుంది. ఇది భక్తులను జ్ఞానంతో పర్యవేక్షించే, మార్గనిర్దేశం చేసే సామర్థ్యాన్ని సూచిస్తుంది.

మూషిక వాహనం

(Image Source: Pinterest/etsy)
(Image Source: Pinterest/etsy)

హిందూ పురాణాల ప్రకారం మూషికం గణేశుడి వాహనంగా పరిగణిస్తారు. ఎలుక అడ్డంకులను ఎదుర్కోవటానికి, వాటిని అధిగమించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. సిద్ధి వినాయక ఆలయంలో వెండితో చేసిన మూషికం గణేశుడి దగ్గర ఉంటుంది. భక్తులు ఎలుకల చెవుల్లో తమ కోరికలు చెప్పుకుంటే నేరుగా గణేశుడికి చేరుతాయని నమ్ముతారు. 

మీరు కూడా ఈ వినాయకచవితి సమయంలో సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించుకోవాలంటే వెళ్లి ఆ గణేశుడి ఆశీర్వాదం తీసేసుకోండి. చవితి సమయంలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుందనుకుంటే ముందుగా వెళ్లడమో.. ఆ తర్వాత వెళ్లడమో ప్లాన్ చేసుకోవచ్చు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
Cheating in Relationships : చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget