అన్వేషించండి

Vice Presidential Polls 2022: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌ఖడ్‌ నామినేషన్- హాజరైన ప్రధాని మోదీ

Vice Presidential Polls 2022: ఎన్‌డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌ఖడ్‌ నామినేషన్ దాఖలు చేశారు.

Vice Presidential Polls 2022: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్​డీఏ అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న లోక్ సభ సెక్రెటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్​కు ఆయన నామపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్​ షా, రాజ్​నాథ్​సింగ్, నితిన్ గడ్కరీ, రామ్​దాస్ అథవాలే పాల్గొన్నారు.

రైతు బిడ్డ

" నా లాంటి సాధారణ వ్యక్తికి ఇంత గొప్ప అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఓ రైతు బిడ్డ ఈ రోజు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ సహా నాయకత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాను.                                                                              "
- జగదీప్ ధన్‌ఖడ్‌, ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి

ప్రొఫైల్

  • జగదీప్ ధన్​ఖడ్​ రాజస్థాన్‌లోని ఒక రైతు కుటుంబంలో 1951లో జన్మించారు.
  • చిత్తోడ్‌గఢ్‌ సైనిక స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన భౌతికశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.
  • రాజస్థాన్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యను అభ్యసించారు.
  • రాజకీయాల్లోకి రాకముందు వ్యవసాయం చేశారు. కిసాన్‌పుత్ర అనే గుర్తింపు సాధించారు. 
  • ప్రముఖ న్యాయవాదిగా గుర్తింపు పొందారు ధన్‌ఖడ్‌.
  • రాజస్థాన్‌ హైకోర్టు, సుప్రీం కోర్టులోనూ ప్రాక్టీస్‌ చేశారు.
  • రాజస్థాన్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పని చేశారు.

ముఖ్యమైన తేదీలు

  • ఎన్నికల నోటిఫికేషన్: జులై 7
  • నామినేషన్లకు చివరి రోజు: జులై 19 
  • నామినేషన్ల పరిశీలన: జులై 20
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు: జులై 22
  • పోలింగ్, ఫలితాలు: ఆగస్ట్ 6 

ఆగస్టు 10తో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీకాలం పూర్తి కానుంది.

Also Read: Punjab New Traffic Rules: మందు బాబులకు అలర్ట్- ఇక డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే రక్తం పిండేస్తారు!

Also Read: Defamation Complaint Filed Against RGV: కొంపముంచిన ఆ ట్వీట్- RGVపై పరువు నష్టం దావా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Most Expensive Android Smartphones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
AP Liquor Fine: మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
Embed widget