(Source: ECI/ABP News/ABP Majha)
Uttarakhand Tunnel Rescue: మరో 2 రోజులు పడుతుందేమో, ఉత్తరాఖండ్ రెస్క్యూ ఆపరేషన్‌పై గడ్కరీ
Uttarakhand Tunnel Rescue: ఉత్తరాఖండ్ రెస్క్యూ ఆపరేషన్‌పై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Uttarakhand Tunnel Rescue Operation:
ఉత్తరాఖండ్ రెస్క్యూ ఆపరేషన్..
ఉత్తరాఖండ్ సొరంగం వద్ద రెస్క్యూ ఆపరేషన్ (Uttarakhand Tunnel Rescue) నిర్విరామంగా కొనసాగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న 40 మంది కార్మికులు రోజురోజుకీ సహనం కోల్పోతున్నారు. అసలు మేం బయటకు వస్తామా అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. 170 గంటలు గడిచినా ఇప్పటికీ వాళ్లను బయటకు తీసుకొచ్చేందుకు ఏ దారీ దొరకడం లేదు. రెస్క్యూ సిబ్బంది అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ ఆపరేషన్‌ని పరిశీలించేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వచ్చారు. గడ్కరీతో పాటు ఉత్తరాఖంఢ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Uttarakhand Tunnel Collapse) కూడా ఉన్నారు. వారం రోజులుగా సహాయక చర్యలు ఎలా కొనసాగాయో అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాసెస్‌లో చాలా సవాళ్లు ఎదురవుతున్నాయని అధికారులు వివరించారు. రాళ్ల చాలా హార్డ్‌గా ఉండడంతో పాటు వాతావరణం కూడా సరిగ్గా సహకరించకపోవడం ఇబ్బందిగా మారింది. అటు కార్మికులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ఆక్సిజన్, ఆహారం అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తరవాత నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశముందని అన్నారు.
"అమెరికా నుంచి తెప్పించిన ఆగర్ మెషీన్ సరిగ్గా పని చేస్తే మరో రెండు, రెండున్నర రోజుల్లో వాళ్లను బయటకు తీసుకొచ్చేందుకు వీలుంటుంది. Border Roads Organisition ఇక్కడ రోడ్‌లు వేస్తోంది. ఇదే సంస్థకు చెందిన కొన్ని మెషీన్‌లను ఇక్కడికి తెప్పిస్తున్నాం. ప్రస్తుతానికి రెండు ఆగర్ మెషీన్‌లు పని చేస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కోసం వీటిని వినియోగిస్తున్నారు"
- నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue operation | Union Minister Nitin Gadkari says "If the auger machine works properly, we will be able to reach them (victims) in the next 2-2.5 days..." pic.twitter.com/93L7gMIXgg
— ANI (@ANI) November 19, 2023
ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా సహాయక చర్యలపై స్పందించారు. అందరి ప్రాణాలనూ కాపాడడమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.
"శిథిలాల కింద చిక్కుకున్న ప్రతి కార్మికుడి ప్రాణాన్ని కాపాడడమే మా లక్ష్యం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. వాళ్లు త్వరగా బయటకు రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. కానీ రోజురోజుకీ రెస్క్యూ ఆపరేషన్‌లో సవాళ్లు ఎదురవుతున్నాయి. "
- పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ఆందోళనకు లోను కాకుండా అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఘటనా స్థలానికి ప్రధాన మంత్రి కార్యాలయం (PM Ofiice) డిప్యుటీ సెక్రటరీ మంగేశ్ ఘిల్దియాల్ ఇప్పటికే పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఆగిపోయిన కాసేపటికే ఆయన అక్కడికి వచ్చారు. పరిస్థితులపై ఆరా తీశారు. సహాయక చర్యలకు (Rescue Operation) అవసరమైన పరికరాలన్నీ ఉన్నాయని, వాళ్లను కచ్చితంగా సురక్షితంగా బయటకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. జియోమ్యాపింగ్ టీమ్‌తో పాటు డ్రిల్లింగ్ మెషీన్‌లు (Uttarakhand Drilling Machine) ఘటనా స్థలానికి చేరుకున్నాయి.