Bride Left Husband : అత్తగారి ఇల్లు దూరంగా ఉందని, కారు దిగి పుట్టింటికి వచ్చేసిన నవ వధువు!
Bride Left Husband : ఉత్తర్ ప్రదేశ్ లో విచిత్రమైన ఘటన జరిగింది. పెళ్లి చేసుకుని వరుడి ఇంటికి బయలుదేరిన యువతి... అత్తగారి ఇల్లు చాలా దూరంగా ఉందని మార్గమధ్యలో కారు దిగి పుట్టింటికి వచ్చేసింది.
Bride Left Husband : పెళ్లికి ముందు జాగ్రత్త అని చాలా మంది రకరకాల జోకులు వేస్తుంటారు. అయితే ఇప్పుడు అలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చూస్తే పెళ్లి విషయంలో జాగ్రత్త అవసరం అని అంటున్నారు. ఎందుకంటే బనారస్‌కి చెందిన ఒక యువతి రాజస్థాన్‌కు చెందిన అబ్బాయిని వివాహం చేసుకుంది. వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంప్రదాయబద్ధంగా వధువుకు అత్తారింటికి పంపించారు. కారులో రాజస్థాన్ కు బయలుదేరారు. అయితే 400 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత పెళ్లికూతురు తన భర్తను విడిచిపెట్టి తిరిగి పుట్టింటి వెళ్లిపోయింది. ఈ వింత ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌లో నివసిస్తున్న వైష్ణవి అనే యువతికి రాజస్థాన్‌లోని బికనీర్‌లో నివసిస్తున్న రవితో వివాహం జరిగింది. బికనీర్ నుంచి వరుడు, అతడి బంధువులు బనారస్ చేరుకున్నారు. వధూవరులు బనారస్ కోర్టులో కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఆపై హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత, కుటుంబ సభ్యులు వధువుకు వీడ్కోలు పలికారు. ఆమె తన అత్తమామలతో కలిసి కారులో బికనీర్ బయలుదేరింది. 7 గంటల ప్రయాణం తర్వాత బనారస్‌కు 400 కిలోమీటర్ల దూరంలోని కాన్పూర్‌లోని సర్సోల్‌కు చేరుకుంది కారు. అక్కడికి మరో 900 కిలోమీటర్ల దూరంలో అత్తగారి ఇళ్లు ఉందని తెలిసింది.
మెట్టినిల్లు దూరంగా ఉందని
మెట్టినిల్లు దూరంగా ఉన్నారని భావించిన పెళ్లికూతురు ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. కారు ఆపే వరకు వేచి చూసింది. పెట్రోలు నింపడానికి కారు సర్సాల్ దగ్గర ఆపారు.ఈ సమయంలో పెళ్లికొడుకు, అతని బంధువులు కారు నుంచి దిగి అల్పాహారం చేయడానికి వెళ్లారు. వైష్ణవి దిగి పరిగెత్తుకుంటూ సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ ముందు బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. పోలీసులు ఆమెను విచారించగా, తనకు పెళ్లి అయిందని, పెళ్లి తర్వాత రాజస్థాన్‌కు తీసుకెళ్తున్నారని చెప్పింది. ఇంతకుముందు పెళ్లికొడుకు వాళ్లు అలహాబాద్‌లో నివసిస్తున్నారని, ఇప్పుడు రాజస్థాన్‌లోని బికనీర్‌కు తీసుకెళ్తున్నారని పోలీసులకు తెలిపింది యువతి.
పుట్టింటికి వెళ్లిపోతానని ఏడుపు
బనారస్ నుంచి 7 గంటల పాటు ప్రయాణించి అలసిపోయానని వధువు పోలీసులకు తెలిపింది. కాబట్టి నేను ఇకపై ముందుకు వెళ్లాలనుకోవడం లేదని, నేను మా అమ్మ వద్దకు తిరిగి వెళ్లాలనుకుంటున్నానని పోలీసులకు చెప్పింది. దీంతో వరుడు కోర్టు వివాహ పత్రాలను పోలీసులకు చూపించి, నేను బికనీర్‌లో నివసిస్తున్నానని, వధువు ఆమె కుటుంబానికి ఈ విషయం తెలుసని చెప్పాడు. దీని తర్వాత పోలీసులు యువతి తల్లికి ఫోన్ చేయగా, ఆమె మాట్లాడుతూ, “బంధువుల సలహా మేరకు మేము వివాహం చేసుకున్నాం. నా కూతురు ఇంత దూరం వెళ్లకూడదనుకుంటే, ఆమెను మళ్లీ ఇంటికి పంపించండి, మేము పెళ్లిని రద్దు చేసుకుంటాం" అని చెప్పింది. దీంతో పోలీసులు వధువును బనారస్‌కు, వరుడిని తిరిగి రాజస్థాన్‌కు పంపించారు. ప్రస్తుతం ఈ పెళ్లిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుగుతోంది. పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.