Vande Bharat Trains: 3 ఏళ్లలో 400 వందే భారత్ రైళ్లు: నిర్మలా సీతారామన్
వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లను తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
కేంద్ర బడ్జెట్-2022ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లను తీసుకురానున్నట్లు వెల్లడించారు. అధునాతన సౌకర్యాలు మరింత సామర్థ్యంతో ఈ రైళ్లు ఉంటాయన్నారు.
రానున్న మూడేళ్లలో పీఎం గతిశక్తి కార్యక్రమం ద్వారా 100 కార్గో టర్మినళ్లను అభివృద్ధి చేయనున్నట్లు నిర్మల పేర్కొన్నారు. దీంతోపాటు మెట్రో వ్యవస్థల నిర్మాణానికి వినూత్న విధానాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రజలు, వస్తువుల రాకపోకలను మరింత సులభతరం చేయడానికి 2022-23లో ఎక్స్‌ప్రెస్‌వేల కోసం పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని నిర్మల చెప్పారు. 2022-23 లో జాతీయ రహదారుల నెట్వర్క్ 25,000 కి.మీ విస్తరించనుందని పేర్కొన్నారు. ప్రజా వనరుల కోసం రూ.20,000 కోట్లు సమీకరించనున్నట్లు పేర్కొన్నారు.
Also Read: Budget 2022, Digital Rupee: బ్లాక్‌చైన్‌తో డిజిటల్ రూపాయి! క్రిప్టో కరెన్సీకి చుక్కలేనా?
Also Read: Tax Slab, Budget 2022: ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులేదు! ప్చ్.. వేతన జీవులకు నిరాశే!!