(Source: ECI/ABP News/ABP Majha)
Kisan Bhagidari Prathmikta Hamari: రైతులకు శుభవార్త- మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం
కిసాన్ భగీదారీ ప్రాథమిక హమారీ పేరిట కేంద్రం సరికొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
రైతుల కోసం మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 25 నుంచి 30 వరకు వ్యవసాయానికి సంబంధించి దేశవ్యాప్త ప్రచారానికి తెరలేపింది. 'కిసాన్ భగీదారీ ప్రాథమిక హమారీ' పేరిట ఓ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో (KVK) వ్యవసాయ మేళా, సహజ వ్యవసాయంపై ఒక ప్రదర్శనను నిర్వహిస్తుంది. దేశంలో 720 కేవీకేలు ఉన్నాయి. ఈ విధంగా రైతులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రచారానికి డెయిరీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు కూడా సహకరిస్తాయని అధికారులు తెలిపారు.
ఈ అంశాలపై చర్చ
హరిత విప్లవం: ఆహార ఉత్పత్తిలో స్వావలంబన, ఉద్యాన పంటల అతిపెద్ద ఉత్పత్తిదారు- అల్లం, అరటి, మామిడి, బొప్పాయి, పసుపు పంట, తేనె ఉత్పత్తి, పంటల నీటిపారుదల వ్యవస్థను మెరుగుపర్చడం, వ్యవసాయ యాంత్రీకరణలో పురోగతి, సాయిల్ హెల్త్ మేనేజ్‌మెంట్, ఎఫెక్టివ్ పెస్ట్ మేనేజ్‌మెంట్, వ్యవసాయంలో రిమోట్ సెన్సింగ్, GIS, డ్రోన్స్, బయోటెక్నాలజీ, వాటర్‌షెడ్ అభివృద్ధి కార్యక్రమం విజయవంతం, విత్తనాలు, ఎరువుల్లో స్వయం సమృద్ధి వంటి పలు అంశాలపై ఈ ఐదు రోజుల్లో చర్చించనున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ప్రచారంలో హైలైట్ చేస్తారు. చాలా కార్యక్రమాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 'క్రాప్ ఇన్సూరెన్స్ స్కూల్'ను కూడా ప్రారంభించనున్నారు.
దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా ఈ మంత్రిత్వ శాఖల క్యాబినెట్, రాష్ట్ర మంత్రులతో సహా స్థానిక ప్రజా ప్రతినిధులు, కోటి మందికి పైగా రైతులు ఈ ప్రచారంలో పాల్గొంటారని భావిస్తున్నారు. ప్రచారంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ ప్రధాన పథకాల కింద కార్యకలాపాలు, విజయాలు వివరించనున్నారు.
Also Read: Hanuman Chalisa Row: ప్రధాని మోదీని తాకిన హనుమాన్ చాలీసా ఎఫెక్ట్
Also Read: World Oldest Person Died: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత- వయసెంతంటే?