పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ అకౌంట్స్ ఇండియాలో బ్లాక్ - మూడోసారి చర్యలు తీసుకున్న ప్రభుత్వం
పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఖాతాలు భారతదేశంలో కనిపించడం లేదు. దాన్ని ఓపెన్ చేయగానే ట్విట్టర్ పెట్టిన నోటీసు కనిపిస్తుంది.
Twitter Blocked Pakistan Government: పాక్ ప్రభుత్వ ట్విటర్ ఖాతాలు భారత్‌లో కనిపించవు. ఆ ఖాతాను ట్విటర్ బ్లాక్ చేసింది. ట్విటర్‌లో జారీ చేసిన నోటీసు ప్రకారం చట్టపరమైన ఆదేశాల మేరకు పాకిస్తాన్ ప్రభుత్వ ఖాతాను నిలిపివేశామని చూపిస్తుంది.
ట్విట్టర్ మార్గదర్శకాల ప్రకారం, కోర్టు ఉత్తర్వులు లేదా ప్రభుత్వ ఆదేశాలు, చట్టపరమైన ఆంక్షలు ఆధారంగా ఖాతాను బ్లాక్ చేయాలి.
ఇతర దేశాల్లో ఖాతాలు నడుస్తున్నాయి.
రాయిటర్స్ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతా అమెరికా, కెనడా వంటి ఇతర దేశాల్లో పనిచేస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు భారత్, పాకిస్థాన్ ఐటీ మంత్రుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
Twitter blocks Pakistan govt's account for viewing in India - notice https://t.co/xKjz1TCpOK pic.twitter.com/X8tDYcLDCP
— Reuters Asia (@ReutersAsia) March 29, 2023
భారత్‌లో ప్రభుత్వం ఆదేశాల మేరకు భారత్‌లోని పాక్ ప్రభుత్వ ట్విటర్ ఖాతాను నిలిపివేసినట్లు పాక్ ప్రభుత్వ ట్విటర్ ఖాతా కూడా పేర్కొంది.
ఇది మూడోసారి ..
పాక్ ట్విటర్ ఖాతాను భారత్‌లో చూడకుండా నిషేధించడం ఇది మూడోసారి. అంతకుముందు 2022 జూలైలో, పాకిస్తాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతాను భారతదేశంలో నిషేధించారు, అయితే తరువాత కొన్ని రోజుల తర్వాత మళ్లీ పునరుద్ధరించారు.
Pakistan government's Twitter account withheld in India
— ANI Digital (@ani_digital) March 29, 2023
Read @ANI Story | https://t.co/ydjfKpjUbN#PakistanGovernment #PakistanGovernmentTwitter #Twitter pic.twitter.com/wqmKgM2COQ
ఐక్యరాజ్యసమితి, టర్కీ, ఇరాన్, ఈజిప్టులోని పాకిస్థాన్ రాయబార కార్యాలయాల అధికారిక ట్విటర్ ఖాతాలను గత ఏడాది జూన్‌లో ట్విటర్ ఇండియా బ్లాక్ చేసింది. భారత్ కు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ పాకిస్థాన్ కు చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లు, ఫేస్ బుక్ ఖాతాలను భారత్ నిషేధించింది.