Viral News: పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఆ గిరిజనుడి ఇద్దరు భార్యలు.. మూడో ఆమె కూడా!
Viral News: మధ్య ప్రదేశ్ లోని అలిరాజ్ పూర్ జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మాజీ సర్పంచ్ ఇద్దరు భార్యలూ గెలుపొందారు. ఆయన మూడో భార్య కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన కోరుకున్నారట.
Viral News: మధ్య ప్రదేశ్ లోని అలిరాజ్ పూర్ జిల్లాలో ఓ గిరిజనుడు గతంలో సర్పించిగా ఉన్నాడు. అయితే అతడికి ముగ్గురు భార్యలు. అతడు ఆ ముగ్గురితో కలిసి ఒకే ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. అయితే తాజాగా అక్కడ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తన ఇద్దరు భార్యలను పోటీ చేయించాడు. అయితే మూడో బార్యను కూడా పోటీ చేయించాలనుకున్నాడట. కానీ ఆమె ఉద్యోగం వదులు కోవాల్సి వస్తుందని చివరకు వద్దు అనుకున్నాడుట. అయితే తన ఇద్దరు భార్యల గెలుపు కోసం ఆయన ఎంతగానో శ్రమించాడు. వారి శ్రమతో ఆ ఇద్దరు భార్యలూ ఎన్నికల్లో గెలిచారు. అయితే ఆ స్టోరీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మూడో భార్య చేత కూడా పోటీ చేయించాలని.. కానీ
35 ఏళ్ల సామ్రాత్ మోర్యాకు మొత్తం ముగ్గురు భార్యలు. ఆయన మాజీ సర్పంచి కూడా. అయితే మొదటి ఇద్దరు భార్యలను పంచాయతీ ఎన్నికల్లో పోటీలకి నిల్చోబెట్టాడు. మూడో భార్య చేత కూడా పోటీ చేయించాలని సామ్రాత్ భావించాడు. కానీ ఆమె విద్యా శాఖలో ఫ్యూన్ గా పని చేస్తోంది. ఆమె పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆమె ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని.. చివరకు వద్దు అనుకున్నాడు. అయితే తన ఇద్దరు బార్యను గెలిపించేందుకు చాలా కష్టపడ్డాడు. అందరూ కలిసే ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఆ కృషి వల్లే సామ్రాత్ ఇద్దరు భార్యలూ ఎన్నికల్లో గెలుపొందారు. వారు గెలిచిన తర్వాత.. ఆయన తన ఇద్దరు భార్యలతో కలిసి గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి మరీ వారిని గెలిపించినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపాడు.
ముగ్గురునీ ఒకేసారి పెళ్లి చేస్కొని వార్తల్లోకి..
సామ్రాక్ గతంలో కూడా వార్తల్లో నిలిచాడు. అందుకు కారణం ఓ ప్రచార సభలో ముగ్గురు భార్యలను ఒకేసారి పెళ్లి చేస్కున్నాడు. అలిరాజ్ పూర్ జిల్లా కేంద్రానికి 14 కిలో మీటర్లు, భోపాల్ కు 400 కిలో మీట్ల దూరంలో వందలాది మది ఉన్న ఆ కార్యక్రమంలో సక్రి(25), మేళా(28), నాని బాయి(30)ని వివాహం చేస్కున్నాడు. ఇలా ఆయన హెడ్ లైన్స్ లో నిలిచారు. అయితే సామ్రాత్ తన ముగ్గురు భార్యలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారట. ఎలాంటి సమస్య లేకుండా అందరూ హాయిగా జీవిస్తున్నారట. అలాగే ఆయనకు మొత్తం ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు. ఈయన ఎక్కడకు వెళ్లినా ముగ్గురు భార్యలను కూడా తన వెంట తీసుకెళ్తాడు. అయితే సామ్రాత్ చాలా చురుకైన బీజేపీ కార్యకర్త.
మూడు పెళ్లిళ్లు తప్పేం కాదు..
తడు 2003లో నాని బాయిని, 2008లో మేళాను అలాగే 2017లో సక్రిని వివాహం చేస్కున్నాడట. అలాగే ఈ ఏడాది 30న భారీ సమావేశాలతో అదికారిక వివాహం జరగిందని అతను చెప్పాడు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న అతను తన భార్యలు గెలిచినప్పటి నుంచీ చాలా పార్టీలు చేసుకుంటున్నాడని ఆయన స్నేహితులు చెబుతున్నారు. అయితే సామ్రాత్ కు చెందిన భిలాలా వంటి తెగల్లో బహు భార్యత్వం తప్పేం కాదు.