Traffic: భారత్ లోని 3 నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువ, వెల్లడించిన అమెరికా అధ్యయనం
ప్రపంచంలో ట్రాఫిక్ నెమ్మదిగా కదిలే నగరాలను అమెరికా ఎన్జీవో జాతీయ ఆర్థిక పరిశోధన బ్యూరో వెల్లడించింది.
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండి ట్రాఫిక్ నెమ్మదిగా కదిలే నగరాల్లో 3 నగరాలు భారత్ లో ఉన్నాయని అమెరికాలోని ఎన్జీవో జాతీయ ఆర్థిక పరిశోధన బ్యూరో అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యాయనంలో బంగ్లాదేశ్ లోని ఢాకా తొలి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మన దేశంలోని భీవండి (5వ స్థానం), కోల్ కతా( 6వ స్థానం), ఆరా(7వ స్థానం) లో నిలిచాయి. ఈ నగరాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుందని తెలిపింది. 152 దేశాల్లోని 1200 నగరాల్లో ట్రాఫిక్ ను పరిశీలించింది.
రోజు మొత్తంలో ట్రాఫిక్ ను అధ్యయనం చేసింది. ఇందులో ప్రపంచంలోనే అతి నెమ్మదిగా ట్రాఫిక్ కదిలే నగరాల్లో మూడు మనవేనని తేలింది. అత్యంత వేగంగా ట్రాఫిక్ కదిలే నగరాల్లో అమెరికాలోని ఫ్లింట్ తొలి స్థానంలో నిలిచింది. ఢాకా అత్యంత నెమ్మదిగా ట్రాఫిక్ కదిలే నగరంగా నిలిచింది. అత్యంత ఇరుకైన నగరంగా కొలంబియాలోని బొగోట నిలిచింది. నెమ్మదిగా వాహనాలు కదిలే నగరాల్లో బిహారీ షరీఫ్ 11వ స్థానంలో ముంబై 13వ స్థానంలో, ఐజ్వాల్ 18వ స్థానంలో, బెంగళూరు 19వ స్థానంలో, షిల్లాంగ్ 20 స్థానంలో నిలిచాయి. ఇరుకుగా ఉండే నగరాల్లో బెంగళూరు 8వ స్థానం, ముంబై 13వ స్థానం, ఢిల్లీ 20వ స్థానంలో నిలిచాయి. పేద దేశాల్లోని సరాసరి వాహనాల వేగం కంటే ధనికా దేశాల్లో వేగం 50 శాతం అధికంగా ఉంది. నెమ్మదిగా ట్రాఫిక్ కదిలే 10 నగరాలు బంగ్లాదేశ్, భారత్, నైజీరియాలోనే ఉన్నాయి.
రోడ్డు ఎక్కుతున్న వ్యాపారాలు
ఇదిలా ఉంటే ప్రధానమైన రోడ్లను అక్రమించి కొందరు రోడ్డుపై వ్యాపారం చేస్తున్నారు. పోటీపడి వ్యాపారాన్ని రోడ్డుపైకి తెచ్చారు. దీంతో అక్కడ నిలపాల్సిన వాహనాలను రోడ్డు మధ్యలో నిలపాల్సి వస్తు న్నది. వారాంతపు సంత జరుగే రోజూ చాలా ట్రాఫిక్ ఎక్కు వ ఉండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్ర భుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ఉండడంతో నిత్యం ప్రజలు, విద్యార్థులు మండలకేంద్రానికి వ స్తుండడంతో రోడ్డుపై వెళ్లే వాహనాలను రోడ్లకు ఇరువైపులా పార్కింగ్ చేస్తుంటారు. దీనివల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది.
చర్యలు తీసుకోవాలి
దేశంలో రద్దీగా ఉండే నగరాల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిచాలి. పెట్రోలిం గ్, ట్రాఫిక్ పోలీసులు వాహనాలు సైరన్ వేసుకుంటూ అనేక సార్లు అటు ఇటూగా రౌం డ్స్ వేయడమే తప్ప ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంలో శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ట్రాఫిక్‌ను ఏ మాత్రం పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు, సంబంధిత శాఖ అధికారులు మధ్యాహ్నం, సాయంత్రం పలు సెంటర్లలో కాపు కాస్తూ వాహనదారులకు మాత్రం జరిమానాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపైనే వ్యాపారాలు చేస్తున్న కనీసం వారిని హెచ్చరించిన దాఖలాలు కనిపించడంలేదనే విమర్శలు ఉన్నాయి. పలు కూడళ్లల్లో నిర్వహించే కొంతమంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ట్రాఫిక్ క్లియర్ చేయకుండా తమకు ఏమీ పట్టనట్టు ఫోన్‌లు చూసుకోవడం, రాంగ్ రూట్, త్రి బుల్ రైడింగ్ చేసే వారి వాహనాల ఫొటోలు తీయడానికే పరిమితమవుతున్నారని వాహనదారుల వేదన.