Tomato Price Hike: అప్పులు పాలైనా టమాటానే నమ్ముకున్న రైతు- నేడు 2 .8 కోట్ల సంపాదన- అమ్మకానికి మరో 2000 పెట్టెలు
Tomato Price Hike: ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసం పోకూడదని అంటారు. ఇది ఎవరు నమ్మినా నమ్మకున్నా రైతు మాత్రం నమ్ముతూనే ఉంటాడు. అలా నమ్మకంతో వ్యవసాయం చేసిన రైతు నేడు కోటీశ్వరుడు అయ్యాడు.
Tomato Price Hike: బంగారం ఉన్న వాళ్లకంటే కూడా టమాటాలు ఉన్న వాళ్లే కోటీశ్వరులు అవుతున్నారు ఈ కాలంలో. ఇప్పటికే చాలా మంది రైతులు టమాటాలు విక్రయించి కోటీశ్వరులుగా మారారు. ఇదే కోవలోకి వస్తాడు మహారాష్ట్రలోనికి పుణెకు చెందిన 36 ఏళ్ల ఈశ్వర్ గయాకర్. ఇప్పటికే టమాటాలు అమ్మి రూ.2.8 కోట్లకుపైగా సంపాదించగా... రూ.3.5 కోట్లే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం తన వద్ద 4000 పెట్టెల టమాటాల స్టాక్ ఉందని వాటిని విక్రయించి మూడున్నర కోట్ల సంపాదించుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. తాను ఈ డబ్బులను ఒక్కరోజులో సంపాదించలేనని. చాలా ఏళ్ల తరబడి వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నానని వివరించాడు. తన 12 ఎకరాల పొలంలో గత ఆరేడు సంవత్సరాలుగా టమాటాలు సాగు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. చాలా సార్లు తీవ్రంగా నష్టపోయానని అప్పులు కూడా చేసినట్టు చెప్పుకొచ్చాడు. కానీ ఏరోజు తన ఆశను వదులుకోలేదని పేర్కొన్నాడు. 2021లో తనకు 18 నుంచి 20 లక్షల నష్టం వచ్చిందని గుర్తు చేసుకున్నాడు.
కానీ ఈ ఏడాది మాత్రం తన అదృష్టం బాగుండి పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయని చెప్పాడు. మొత్తం 12 ఎకరాల్లో టమోటాలు సాగు చేయగా.. తాను ఇప్పటి వరకు దాదాపుగా 17,000 పెట్టెలను విక్రయించినట్లు ఈశ్వర్ గయాకర్ చెప్పారు. అయితే ఒక పెట్టె ధర రూ.770 నంచి రూ.2311 వరకు పలికిందని.. అలా ఇప్పటి వరకు రూ.2.8 కోట్లు వచ్చాయని చెప్పుకొచ్చాడు. తన పొలంలో ఇంకా 3 నుంచి 4 వేల పెట్టెల టమాటాలు ఉన్నాయని.. వీటిని కూడా విక్రయిస్తే రూ.3.5 కోట్లు సులువగా వస్తాయని వివరించాడు. లాభాలు రావడంతో తన కుటుంబ సభ్యులంతా చాలా సంతోషంగా ఉన్నారనని పేర్కొన్నారు. తనతో పాటు పొలంలో పని చేస్తున్న భార్యకు ధన్యవాదాలు తెలిపాడు. తల్లిదండ్రులు, తాతయ్యల ఆశీర్వాదాల వల్ల తనకు ఈ విజయం దక్కిందని భావిస్తున్నట్లు చెప్పాడు.
అయితే టమాటా పంట సాగు చేయాలనకున్నప్పుడు కిలో రూ.30 పలుకుతుందని భావించానని.. కానీ ఈ సీజన్ లో తన అదృష్టం అంతా మారిపోయిందని చెప్పాడు. తండ్రి ద్వారా వారసత్వంగా వస్తున్న వ్యవసాయాన్ని 2005లో స్వీకరించిన ఈశ్వర్... అప్పటి నుంచి టమాటాలు, ఉల్లపాయలు, పూలు ఇలా సీజన్ ను బట్టి పండిస్తున్నాడు.
శుక్రవారం ఒక్కరోజే 18 లక్షల సంపాదన
పుణే జిల్లాకి చెందిన తుకారాం భాగోజీ గయాకర్ (Tukaram Bhagoji Gayakar) టమాటాలు పండించి జాక్‌పాట్ కొట్టాడు. ఉన్నట్టుండి వాటి ధర ఆకాశాన్నంటింది. ఇంకేముంది వెంటవెంటనే వాటిని తీసుకొచ్చి మార్కెట్‌లో పోశాడు. అన్నీ హాట్‌కేక్‌లా అమ్ముడుపోయాయి. నెల రోజుల్లో దాదాపు 13 వేల కేసుల టమాటాలు విక్రయించాడు. ఇలా రూ.1.5కోట్లు సంపాదించాడు తుకారామ్‌కి 18 ఎకరాల పొలం ఉంది. అందులో 12 ఎకరాల్లో టమాటానే పండించాడు. అందరిలా కాకుండా కాస్త భిన్నంగా వీటిని సాగు చేసింది తుకారామ్ కుటుంబం. ఏయే ఫర్టిలైజర్‌లు వాడాలి..? ఏ మందులు వాడితే పురుగు రాకుండా ఉంటుంది..? అని చిన్నపాటి రీసెర్చ్ చేసి మరీ సాగు చేశారు. అలా సాగు చేయగా వచ్చిన టమాటాలను మార్కెట్‌కి తరలించే ముందు క్రేట్స్‌లో (Tomato Crates) సర్దుతారు. రోజుకి ఒకటి చొప్పున అమ్మి రూ.2,100 సంపాదించారు. ఈ మధ్యే ఒకే రోజు అత్యధికంగా 900 క్రేట్‌ల టమాటాలు అమ్మేశారు. అలా ఒక్క రోజులోనే రూ.18 లక్షలు సంపాదించుకున్నారు. క్వాలిటీని బట్టి ఒక్కో కేస్ రూ.1000 నుంచి రూ.2,400 వరకూ పలుకుతోంది. ఈ ఒక్క రైతే కాదు. పుణేలో జున్నార్ ప్రాంతంలో టమాటాలు పండించిన రైతులు కూడా లక్షాధికారులు అయిపోయారు.
రోజకు 600 నుంచి 700 పెట్టెలు
ఛత్తీస్ గఢ్ ధమ్ తరీ జిల్లాలోని బీరన్ గ్రామానికి చెందిన అరుణ్ సాహూ 150 ఎకరాల్లో టమాటా పంట వేశారు. ఇలా రోజుకు 600 నుంచి 700 పెట్టెలు విక్రయించారు. ఇలా కోటికి పైగా ఈనెల కాలంలోనే సంపాధించారు. సాహూ ఉన్నత చదువులు చదివినప్పటికీ.. వ్యవసాయంపై మక్కువతో ఈ రంగంలోకి దిగారు. ఒక్క నెల రోజుల్లోనే కోటికి పైగా సంపాధించారు.