Skipping Rope Accident: మీ పిల్లలు స్టంట్స్ వీడియోలు ఎక్కువ చూస్తున్నారా.. అయితే జాగ్రత్త పడండి
చాలా సేపు అయింది బిడ్డ కనిపంచడం లేదని వెతికిన తల్లి... రూంలోకి వచ్చి చూసింది. స్కిప్పింగ్ రోప్‌కు వేలాడుతున్న కుమారుడిని చూసి ఒక్కసారిగా షాక్ అయింది.
నిత్యం సోషల్ మీడియాలో స్టంట్స్ వీడియోలు చూసే ఓ పదేళ్ల బాలుడు... తన ఫ్యామిలీలో తీవ్ర విషాదం నింపాడు. వీడియోల్లో చూపించినట్టు స్టంట్ చేయబోయి ప్రాణాలు తీసుకున్నాడు.
పీటీఐ చెప్పిన వివరాల ప్రకారం... దిల్లీకి చెందిన పదేళ్ల బాలుడు నిత్యం స్టంట్స్ వీడియోలు చూసేవాడు. చిన్న చిన్నవి ఇంట్లోనే ట్రై చేసేవాడు. వాటిని తల్లిదండ్రులు చూసి మందలించినా బాలుడు వారి మాట పట్టించుకోలేదు.
గురవారం రాత్రి ఏడు గంటలకు ఇంట్లో తల్లితో మాట్లాడుతూ వీడియోలు చూశాడా బాలుడు. అలా చూస్తూనే బెడ్‌రూంలోకి వెళ్లిపోయాడు. తల్లి తన పనుల్లో బిజీగా ఉండపోయింది. ఇంట్లో ఉన్న స్కిప్పింగ్ తాడుతో ఓ స్టంట్ చేయబోయాడు బాలుడు. ఆ స్టంట్ కాస్త విషాదంగా మారింది. స్టంట్ కోసం ఉపయోగించిన స్కిప్పింగ్ తాడు బాలుడి మెడకు బిగిసిపోయింది. తలుపులు వేసిన కారణంగా తల్లి కూడా ఆ బాలుడిని గమనించలేదు. తాడు మెడకు బిగుసుకున్న కారణంగా ఆ బాలుడు ఊపిరాడలేదు.
చాలా సేపు అయింది బిడ్డ కనిపంచడం లేదని వెతికిన తల్లి... రూంలోకి వచ్చి చూసింది. స్కిప్పింగ్ రోప్‌కు వేలాడుతున్న కుమారుడిని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. బోరుమని ఆమె కేకలు విన్న పక్కింటి వాళ్లు వచ్చారు.
అంతా వచ్చి తాడుకు వేలాడుతున్న బాలుడిని కిందకు దింపారు. ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆ బాలుడు చనిపోయినట్టు వైద్యులు చెప్పేశారు. డెడ్‌బాడీని ఇంటికి తీసుకెళ్లిపోతున్న టైంలో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. పోలీసులు వచ్చి కేసు రిజిస్ట్రర్ చేసుకొని దర్యాప్తు చేశారు.