News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tamil Nadu CM Stalin: సిటీ బస్సులో సీఎం- నిల్చొనే ప్రయాణం, షాకైన జనం!

Tamil Nadu CM Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్.. సిటీ బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

FOLLOW US: 
Share:

Tamil Nadu CM Stalin:

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి తన సింప్లిసిటీని చూపించారు. సిటీ బస్సు ఎక్కి సందడి చేశారు. ముఖ్యమంత్రి బస్సు ఎక్కడంతో ప్రయాణికులంతా ఆశ్చర్యపోయారు. 

ఇదీ జరిగింది

శనివారం ఉదయం మంత్రులతోపాటు శాసనసభ సమావేశాల్లో పాల్గొనేందుకు స్టాలిన్ పయనమయ్యారు. మైలాపూరు రాధాకృష్ణన్‌ రోడ్డులో వెళుతున్నప్పుడు ఉన్నట్టుండి కారులో నుంచి కిందకు దిగి ఆ చోట నిలిచి వున్న 29సీ సిటీ బస్సులో కాసేపు ప్రయాణం చేసి వస్తానని మంత్రులకు తెలిపారు. దీంతో మంత్రులంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

ఆ తర్వాత స్టాలిన్‌ సిటీ బస్సెక్కారు. స్టాలిన్‌ను చూసి ఆశ్చర్యపోయిన ప్రయాణికులు 'సీఎం వర్ధిల్లాలి' అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో ఆ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తోన్న మహిళలను ఆయన ఆప్యాయంగా పలకరించారు. పలువురు మహిళలు, విద్యార్థినులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.

గుర్తుకొస్తున్నాయి

తన బస్సు ప్రయాణం గురించి స్టాలిన్‌ శాసనసభలో ప్రస్తావిస్తూ 29సీ సిటీ బస్సును తన జీవితంలో ఎన్నడూ మరచిపోలేనన్నారు.

" 29సీ సిటీ బస్సును ఎప్పటికీ మర్చిపోలేను. ఆ బస్సులోనే నేను రోజూ గోపాలపురం నుంచి  పాఠశాలకు వెళ్లేవాడిని. స్టెల్లా మేరీస్‌ కాలేజీ బస్టాపులో ఆ బస్సెక్కి స్టెర్లింగ్‌ రోడ్డు దాకా వెళ్ళి అక్కడి దిగి నడచుకుంటూ చెట్‌పట్‌లోని పాఠశాలకు వెళ్లేవాడిని. తెలిపారు. శనివారం ఉదయం ఆ బస్సులో నేను ప్రయాణించినప్పుడు మహిళలు తమకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడం వల్ల నెలకు సగటున రూ.600 నుంచి రూ.850 వరకూ ఆదా అవుతోందని చెప్పారు.                                                              "
-  ఎంకే స్టాలిన్, తమిళనాడు సీఎం

ఏడాది పూర్తి

డీఎంకే ప్రభుత్వం ఏర్పడి శనివారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా తన ఇంటి నుంచి తండ్రి కరుణానిధి నివసించిన గోపాలపురంలోని ఇంటికి స్టాలిన్ వెళ్లారు. ఇంట్లోని కరుణానిధి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. తల్లి దయాళుఅమ్మాళ్‌కు నమస్కరించి ఆశీర్వాదం అందుకున్నారు. 

Also Read: Khalistani Flags: అసెంబ్లీపై ఖలిస్థాన్ జెండాలు- సీఎం సీరియస్, దర్యాప్తు షురూ

Also Read: Badrinath Dham: బద్రీనాథుడి దర్శనానికి సిద్ధమా? తెరుచుకున్న ఆలయ తలుపులు

Published at : 08 May 2022 01:17 PM (IST) Tags: Tamil Nadu CM Stalin Tamil Nadu CM Stalin hops on a bus 1 year of governance Stalin In bus

ఇవి కూడా చూడండి

NIA Raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం, ఎన్ఐఏ దాడులు

NIA Raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఉగ్ర కలకలం, ఎన్ఐఏ దాడులు

గోధుమల నిల్వలపై కేంద్రం కఠిన ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణ కట్టడికి ప్రత్యేక చర్యలు

గోధుమల నిల్వలపై కేంద్రం కఠిన ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణ కట్టడికి ప్రత్యేక చర్యలు

UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

UPSC Mains Result 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TMC MP Expulsion: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు - ఇక సీబీఐతో వేధిస్తారని మహువా సంచలన ఆరోపణలు

TMC MP Expulsion: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు - ఇక సీబీఐతో వేధిస్తారని మహువా సంచలన ఆరోపణలు

Bharat Ki Baat Year Ender 2023 : చంద్రునిపైకి చేరిన భారత కీర్తి పతాక - 2023లో భారత్ సాధించిన అద్భుతం చంద్రయాన్ 3

Bharat Ki Baat Year Ender 2023 :  చంద్రునిపైకి చేరిన భారత కీర్తి పతాక - 2023లో భారత్ సాధించిన అద్భుతం చంద్రయాన్ 3

టాప్ స్టోరీస్

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Rashmika Mandanna: ఆ ప్రేమకు రష్మిక అర్హురాలు - రాహుల్ రవీంద్రన్ ఏమన్నారో చూశారా?

Rashmika Mandanna: ఆ ప్రేమకు రష్మిక అర్హురాలు - రాహుల్ రవీంద్రన్ ఏమన్నారో చూశారా?

తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం

తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!