Taj Mahal: తాజ్ మహల్‌కు అరుదైన రికార్డు, మీరూ ఇలా ఈజీగా విజిట్ చేయొచ్చు
UNESCO Ranks: విదేశీ పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన Historical monument తాజ్ మహల్ అని ASI తాజా నివేదిక వెల్లడించింది. రెండవ చారిత్రక కట్టడంగా ఢిల్లీ లోని కుతుబ్ మినార్ నిలిచింది.
Taj Mahal Latest News: ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) తాజా నివేదిక ప్రకారం, 2023-24 సంవత్సరంలో విదేశీ పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన చారిత్రాత్మక ప్రదేశాలలో తాజ్ మహల్ మొదటి స్థానం దక్కించుకుంది. UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన తాజ్ మహల్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
తాజ్ మహల్ ప్రత్యేకతలు:
తాజ్ మహల్‌ను 17వ శతాబ్దంలో మొగల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియ సతీమణి ముంతాజ్ మహల్ స్మారకార్థంగా నిర్మించారు. తాజ్ మహల్ చుట్టూ విస్తరించి ఉన్న పచ్చని తోటలు, యమునా నది తీరంలో ఉండే ఈ కట్టడం ప్రపంచ పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
తాజ్ మహల్ లోపల రెండు cenotaphs ఉంటాయి: ఒకటి ముంతాజ్ మహల్, మరొకటి షాజహాన్ సమాధి. వారు అసలైన సమాధిలు క్రిప్ట్లో అండర్ గ్రౌండ్ లో ఉంటాయి. పైభాగంలో సందర్శకుల కోసం 'సినోటాఫ్' ఏర్పాటు చేశారు. పర్యాటకులు కేవలం ఈ 'సినోటాఫ్'లను మాత్రమే చూడగలుగుతారు.
ప్రవేశ రుసుం:
- భారతీయులకు ₹50
- విదేశీ పర్యాటకులకు ₹1,100
- పిల్లలు (15 ఏళ్ల లోపు) వారికి ఉచితం
- మహా సమాధికి ప్రత్యేక ప్రవేశం టికెట్ ₹200
తాజ్ మహల్ ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడకు చేరుకోవడానికి క్యాబ్స్, స్థానిక టాక్సీలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. తాజ్ మహాల్ చరిత్రను తెలియజేసేందుకు ఇక్కడ అధికారిక గైడ్స్ కూడా అందుబాటులో అంటారు. అంతే కాకుండా తాజ్ మహల్ కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంగా ఆగ్రా ఫోర్ట్ కూడా ఉంటుంది.
ఈ ఆగ్రా ఫోర్ట్ లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సందర్శకులకు కనువిందు చేస్తాయి. ఇక్కడ దొరికే ఆగ్రా పెటా స్వీట్ కూడా చాలా ఫేమస్.
ఇక రెండవ స్థానంలో Qutub Minar:
2023-24 ASI నివేదిక ప్రకారం, విదేశీ పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన రెండవ చారిత్రక కట్టడంగా ఢిల్లీ లోని కుతుబ్ మినార్ నిలిచింది. గత ఏడాది వరుకు ఆగ్రా ఫోర్ట్ ఈ లిస్ట్ లో ఉండేది. కానీ కుతుబ్ మినార్ ఈ ఏడాది లిస్ట్ లో మూడు స్థానాలు ఎగబాకి విదేశీ పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన లిస్ట్ లో రెండవ స్థానంలో నిలిచింది.
1193లో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన ఈ 73 మీటర్ల ఎత్తైన కట్టడం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇటుకల మినారుగా ప్రసిద్ధి చెందింది. కుతుబ్ మినార్‌లోని ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, సాంస్కృతిక ప్రదర్శనలు ఇక్కడ హైలైట్ గా నిలుస్తున్నాయి.
ఈ స్మారక చిహ్నాలు భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియచేయడమే కాక పర్యాటకరంగం అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. ఇక ఇటీవలే మన రాష్ట్రం లో యునెస్కో గుర్తింపు సాధించిన రామప్ప దేవాలయం కూడా విదేశీయులు సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.