అన్వేషించండి

SCR: భాగమతి రైలు ప్రమాదం - దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన

Bhagamati Express: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఈ నెల 11న జరిగిన భాగమతి ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఏదైనా సమాచారం ఉంటే ప్రజలు తమను సంప్రదించాలని సూచించింది.

SCR Key Announcement On Bhagamati Train Accident: తమిళనాడులోని (Tamilnadu) తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును.. భాగమతి ఎక్స్ ప్రెస్ (Bhagamati Express) ఈ నెల 11న ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించగా దర్యాప్తు కొనసాగుతోంది. రైలు ప్రమాద ఘటనపై ఈ నెల 16, 17 తేదీల్లో చెన్నైలో  రైల్వే ఉన్నతాధికారులు దర్యాప్తు చేయనున్నారని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ప్రజలు తమను సంప్రదించాలని ద.మ రైల్వే (South Central Railway) సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.

అన్ని కోణాల్లో దర్యాప్తు

కాగా, రైలు ప్రమాదంపై అన్ని కోణాల్లోనూ రైల్వే శాఖ దర్యాప్తు చేపట్టింది. సాంకేతిక లోపమా.? లేక సిగ్నలింగ్ వైఫల్యమా.?, కుట్ర కోణమా.? ఇతర కారణాలేమైనా ఉన్నాయా.? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే.. వాటితో పాటు చట్టబద్ధమైన విచారణకు హాజరు కావాలని కోరారు. ఈ కేసు విచారణ పార్క్ టౌన్‌లోని చెన్నై డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) కార్యాలయంలో రైల్వే భద్రత కమిషనర్ నేతృత్వంలో జరగనున్నట్లు వెల్లడించారు.

ఇదీ జరిగింది

తమిళనాడులోని చెన్నై శివారులో ఈ నెల 11 (శుక్రవారం) రాత్రి రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మైసూరు నుంచి తమిళనాడు, ఏపీ, తెలంగాణ మీదుగా దర్బంగా వెళ్లాల్సిన భాగమతి ఎక్స్ ప్రెస్ (రైలు నెం. 12578).. తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ గూడ్స్ రైలును అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 వరకూ భోగీలు పట్టాలు తప్పాయి. 2 భోగీలు మంటల్లో దగ్ధమయ్యాయి. కొన్ని భోగీలు చెల్లాచెదురుగా పడిపోగా.. మరికొన్ని ఒకదానిపై ఒకటి చేరాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. పలువురు ప్రయాణికులు గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు తిరువళ్లూరు పోలీసులు 4 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు ఎన్ఐఏ సహా వివిధ ఏజెన్సీల బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.

Also Read: Free Tomatoes : ఉచితంగా అరకేజీ టొమాటాలు ఇస్తున్నారని స్విగ్గిపై ఫిర్యాదు - ఈ పెద్దాయన ఉచితాలకు మరీ వ్యతిరేకంగా ఉన్నాడే !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు
YS Jagan: లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు
Jani Master News: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన పోక్సో కోర్టు, కారణం ఏంటంటే!
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన పోక్సో కోర్టు, కారణం ఏంటంటే!
AP Sand Policy : ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?
ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?
Best Budget Compact Cars: రూ.10 లక్షల్లోపు చిన్న కార్లలో బెస్ట్ ఇవే - సిటీ డ్రైవ్‌కు కరెక్ట్ ఆప్షన్స్!
రూ.10 లక్షల్లోపు చిన్న కార్లలో బెస్ట్ ఇవే - సిటీ డ్రైవ్‌కు కరెక్ట్ ఆప్షన్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: నేను టెర్రరిస్టునా? నన్నెందుకు రానివ్వరు? రాజాసింగ్ ఆగ్రహంవీడియో: నా శవం మీద సెటిల్ చేసుకోండి, సికింద్రాబాద్‌లో మాధవీలత అరెస్ట్Vivek Venkata Swamy: వివేక్‌కు కేబినెట్ బెర్త్ ఖాయమా? చెన్నూర్ ఎమ్మెల్యేతో ఫేస్ 2 ఫేస్సల్మాన్‌ను చంపితే లారెన్స్ బిష్ణోయ్‌కు వచ్చే ప్రయోజనం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు
YS Jagan: లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు అడ్డాగా ఏపీ! చంద్రబాబుకు మాజీ సీఎం జగన్ 6 ప్రశ్నలు
Jani Master News: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన పోక్సో కోర్టు, కారణం ఏంటంటే!
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన పోక్సో కోర్టు, కారణం ఏంటంటే!
AP Sand Policy : ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?
ఉచిత ఇసుక ఇస్తున్నా విమర్శలు - శాండ్ పాలసీ విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిపోయిందా ?
Best Budget Compact Cars: రూ.10 లక్షల్లోపు చిన్న కార్లలో బెస్ట్ ఇవే - సిటీ డ్రైవ్‌కు కరెక్ట్ ఆప్షన్స్!
రూ.10 లక్షల్లోపు చిన్న కార్లలో బెస్ట్ ఇవే - సిటీ డ్రైవ్‌కు కరెక్ట్ ఆప్షన్స్!
Nagavamsi: సినిమాకి రూ.1500 పెట్టలేరా? - నాగవంశీ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు!
సినిమాకి రూ.1500 పెట్టలేరా? - నాగవంశీ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు!
Nobel Prize  2024 : దేశాల మధ్య ఆర్థిక అంతరాలపై పరిశోధన - ముగ్గురు ఆర్థిక వేత్తలకు నోబెల్ ప్రైజ్
దేశాల మధ్య ఆర్థిక అంతరాలపై పరిశోధన - ముగ్గురు ఆర్థిక వేత్తలకు నోబెల్ ప్రైజ్
Samsung Galaxy Ring: స్మార్ట్ రింగ్ లాంచ్ చేసిన శాంసంగ్ - రూ.1,999కే బుకింగ్!
స్మార్ట్ రింగ్ లాంచ్ చేసిన శాంసంగ్ - రూ.1,999కే బుకింగ్!
Mogilaiah Land Issue: పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ
పద్మశ్రీ మొగులయ్యకి అండగా నిలిచిన రాచకొండ కమిషనర్, సమస్య పరిష్కరిస్తానని హామీ
Embed widget