అన్వేషించండి

Sitaram Yechury: వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి కన్నుమూత, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస

Sitaram Yechury News: ఆగస్టు 19న సీతారాం ఏచూరి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు.

Sitaram Yechury Death: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 72 ఏళ్లు. కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆగస్టు 19న ఆయన ఎయిమ్స్‌లో చేరగా.. గురువారం ఆయన కన్నుమూశారు. ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లుగా తెలిసింది. సీతారాం ఏచూరీ దేశంలోని ప్రముఖ రాజకీయ నేతల్లో ఒకరిగా ఉన్నారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్‌గా ఏచూరి సీతారాంకు మంచి పేరుంది. 

Also Read: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?

సీతారాం ఏచూరి పూర్తి పేరు ఏచూరి సీతారామారావు. ఈయన స్వస్థలం కాకినాడ. 1952 ఆగస్టు 12న ఏచూరి జన్మిచారు. మద్రాసులో స్థిరపడ్డ తెలుగు కుటుంబంలో ఏచూరి జన్మించారు. తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. ఏచూరి సీతారాం చదువు మొత్తం ఢిల్లీలోనే సాగగా.. ఢిల్లీ ఎస్టేట్‌ స్కూల్లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. అప్పట్లో సీబీఎస్‌ఈ పరీక్షలో నేషనల్ లెవల్‌లో ఈయన మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీలో బీఏ (ఆనర్స్‌‌) ఎకనామిక్స్, ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఏ ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పొందారు.

జర్నలిస్టుతో రెండో వివాహం
సీతారాం ఏచూరి తొలుత వీణా మజుందార్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ జర్నలిస్టు అయిన సీమా చిస్తీని రెండో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అప్పట్లో ఆమె బీబీసీ హిందీ ఢిల్లీ ప్రతినిధిగా పని చేశారు. ప్రస్తుతం సీమా చిస్తీ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో రెసిడెంట్‌ ఎడిటర్ గా ఉన్నారు. అంతేకాక, సీతారాం ఏచూరి హిందూస్థాన్‌ టైమ్స్‌లో తరచూ కాలమ్స్‌ రాస్తుంటారు.

అంచెలంచెలుగా ఎదిగిన ఏచూరి

సీతారాం రాజకీయ ప్రస్థానం 1974లో ప్రారంభం అయింది. అప్పట్లో ఎస్‌ఎఫ్‌ఐ మెంబర్ గా చేరారు. ఆ తర్వాతి ఏడాదే సీపీఎం సభ్యుడిగా చేరారు. దేశంలో ఎమర్జెన్సీ కాలానికి ముందు ఆయన అండర్ గ్రౌండ్‌కు వెళ్లారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జేఎన్‌యూ స్టూడెంట్ లీడర్‌గా ఏచూరి మూడుసార్లు ఎలక్ట్ అయ్యారు. 1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ జాయింట్ సెక్రటరీగా, తర్వాత ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1985లో కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీలో, 1988లో కేంద్ర కార్యవర్గంలో, 1999లో పొలిట్‌ బ్యూరోలో సీతారాం ఏచూరికి చోటు లభించింది. 2005లో బెంగాల్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అలా 1992 నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉండగా.. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా బెంగల్‌ నుంచి కొనసాగారు. ఆయన తన జీవిత కాలం మొత్తం వామపక్ష భావజాలంతోనే జీవించారు.

Also Read: స్టూడెంట్ లీడర్ నుంచి జనరల్ సెక్రటరీ వరకు, ఇది సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
Manchu Manoj Mother Wrote A Letter: మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
Russia Moscow Blast: రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
Samyuktha Menon :  సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!
సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
Manchu Manoj Mother Wrote A Letter: మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే- లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల
Russia Moscow Blast: రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
రష్యాలో భారీ పేలుడు, న్యూక్లియర్ సెక్యూరిటీ చీఫ్ మృతి 
Samyuktha Menon :  సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!
సమంత అనుకునేరు సంయుక్త.. పింక్ కలర్ పట్టుచీరలో అదిరిపోయింది కదా!
Rohit Sharma Retirement: టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్‌? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్‌? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
Actor Darshan: ఆపరేషన్ అని బెయిల్‌పై బయటకు వచ్చాడు... బాబోయ్ దర్శన్ కేసులో ఈ ట్విస్టేంటి?
ఆపరేషన్ అని బెయిల్‌పై బయటకు వచ్చాడు... బాబోయ్ దర్శన్ కేసులో ఈ ట్విస్టేంటి?
Gautam Bigg Boss Telugu: మెగా ఫ్యామిలీ మనసులు గెలిచాడు... స్టేజిపై గౌతమ్ కృష్ణకు చరణ్ ఏం చెప్పాడంటే?
మెగా ఫ్యామిలీ మనసులు గెలిచాడు... స్టేజిపై గౌతమ్ కృష్ణకు చరణ్ ఏం చెప్పాడంటే?
House Construction Tips: ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ విషయాలను విస్మరిస్తున్నారా?, లక్షలాది రూపాయలు నష్టం!
ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ విషయాలను విస్మరిస్తున్నారా?, లక్షలాది రూపాయలు నష్టం!
Embed widget