Sharad Pawar: 'నాకూ ఓ లవ్ లెటర్ వచ్చింది'- ఐటీ శాఖ నోటీసులపై పవార్ పవర్‌ఫుల్ పంచ్!
Sharad Pawar: తనకు ఐటీ శాఖ ఓ లవ్ లెటర్ రాసిందని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.
Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌కు ఆదాయ పన్నుశాఖ (ఐటీ) నోటీసులు ఇచ్చింది. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేసిన తరువాతి రోజే పవార్‌కు ఈ నోటీసులు వచ్చాయి. అయితే ఈ నోటీసులపై పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
2004, 2009, 2014, 2020 ఎన్నికల్లో పవార్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో ఉన్న సమాచారాన్ని తాజాగా పరిశీలిస్తున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. ఈ మేరకు శరద్ పవార్ కూడా ట్వీట్ చేశారు.
.२००९ साली देखील मी लोकसभेला उभा होतो, २००९ नंतर २०१४ च्या राज्यसभा निवडणुकीला उभा राहिलो, तसेच २०२० च्या राज्यसभा निवडणुकीच्या प्रतिज्ञापत्राबद्दलची नोटीसही आता आलेली आहे. सुदैवाने त्याची सर्व माहिती माझ्याकडे व्यवस्थित ठेवलेली आहे.
— Sharad Pawar (@PawarSpeaks) June 30, 2022
2004, 2009లలో పవార్ లోక్‌సభకు పోటీ చేశారు. ఆ తర్వాత 2014, 2020లో రాజ్యసభకు పోటీ చేశారు. ఈ ఎన్నికల అఫిడవిట్‌లకు సంబంధించి ఐటీ నోటీసులు ఇచ్చింది.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 17వేల కరోనా కేసులు- 23 మంది మృతి
Also Read: Nupur Sharma Case: నుపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఫైర్- 'దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాల్సిందే'