అన్వేషించండి

US Deportation: నేడు భారత్‌కు అమెరికా వలసదారుల రెండో విమానం, కేంద్ర ప్రభుత్వంపై పంజాబ్ సీఎం ఆగ్రహం

అమెరికా నుంచి బయలుదేరిన వలసదారుల రెండో విమానం శనివారం రాత్రి అమృత్‌సర్‌కు చేరుకోనుంది. అయితే తమను అవమానించేందుకే ఇక్కడ విమానాలు ల్యాండ్ చేస్తున్నారని పంజాబ్ సీఎం ఆరోపించారు.

Second Flight with Deportees From US To Land In Amritsar | అమృత్‌సర్: అమెరికా అక్రమ వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉక్కుపాదం మోపుతున్నారు. ఇదివరకే భారత్‌కు ఓ విమానంలో వలసదారులను అమెరికా పంపేసింది. తాజాగా మరో విమానం అమెరికా నుంచి వస్తోంది. 119 మందితో కూడిన విమానం సీ 17 పంజాబ్లోని అమృత్‌సర్‌కు శనివారం రాత్రి 10, 11 గంటలకు చేరుకోనుందని అధికారులు తెలిపారు. 

ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ విమానం అగ్రరాజ్యం నుంచి భారత్‌కు బయలుదేరడం తెలిసిందే. తాజాగా ల్యాండ్ కానున్న ఈ సీ17 విమానంలో 67 మంది పంజాబ్ వాసులు, 33 మంది హర్యానా, 8 మంది గుజరాతీలు, ఉత్తరప్రదేశ్ వాసులు ముగ్గురు, రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి ఇద్దరు, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వారు ఒక్కరు చొప్పున ఉన్నారని సమాచారం. ట్రంప్ ప్రభుత్వం ఇదివరకే 104 మంది భారతీయులను స్వదేశానికి తిప్పి పంపింది. నేడు రెండో విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్ కానుండగా, మూడో విమానం ఫిబ్రవరి 16న భారత్‌కు చేరుతుందని అధికారులు చెబుతున్నారు.

పంజాబ్ సీఎం ఆగ్రహం
అమృత్‌సర్‌లో అక్రమ వలసదారుల విమానం ల్యాండ్ కావడంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎన్ఐతో మాట్లాడిన ఆయన పంజాబ్ ను కించపరచాలన్న ఉద్దేశంతోనే ఆ అమెరికా నుంచి వస్తున్న విమానాలను అమృత్‌సర్‌లో ల్యాండ్ చేస్తున్నారని ఆరోపించారు. తమ రాష్ట్రంలో వలసదారుల తరలింపు విమానాలను ఎందుకు ల్యాండ్ చేస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖను పంజాబ్ సీఎం ప్రశ్నించారు. ఆ విమానాలను ల్యాండ్ చేయడానికి అమృత్‌సర్‌ను ఏ కారణాలు, ఏ ప్రమాణాలు పాటించి ఎంచుకున్నారో విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భారత ప్రజలకు ట్రంప్ ఇచ్చిన బహుమతి ఇదేనా? అంటూ మండిపడ్డారు.

విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, “విద్యార్థులు, ఉద్యోగులు చట్టపరంగా అమెరికాలో నివాసం ఉండాలి. కానీ అక్రమంగా అక్కడ ఉండటం వారి చట్టాలను ఉల్లంఘించడమే అవుతుంది. అన్ని దేశాలు అమెరికాకు అక్రమ వలసలు నివారించాలని, లేకపోతే ఆ దేశాలపై భారీగా పన్నులు విధిస్తామని అమెరికా అధినేత ట్రంప్ హెచ్చరిస్తున్నారు. కనుక ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే హక్కు ఇతర దేశాలకు ఉండదు. తప్పు జరిగితే కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తుందని” అన్నారు.

అక్రమ వలసలపై మోదీ కీలక వ్యాఖ్యలు
అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ అక్రమ వలసలపై స్పందించారు. ఏ దేశంలోనైనా అక్రమ వలసలను ఉపేక్షించరని, వారిని స్వదేశాలకు తరలించడం సరైన నిర్ణయమని డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని మోదీ మద్దతు తెలిపారు. అమెరికాలో ఉంటున్న భారత్‌కు చెందిన అక్రమవలసదారులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొస్తామని సైతం చెప్పారు. తన నిర్ణయాన్ని మోదీ స్వాగతిస్తారనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ అమెరికాలో కాలుపెట్టిన సమయంలోనే భారత్‌కు అక్రమ వలసదారులను ఓ విమానంలో ట్రంప్ ప్రభుత్వం తరలించింది.

Also Read: PM Modi on US Deportation: అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్‌కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rohit Sharma Duck Outs: రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
IPL 2025 CSK vs MI: ముంబైని మడతపెట్టిన అహ్మద్ ద్వయం, చెన్నై ముందు మోస్తరు టార్గెట్
ముంబైని మడతపెట్టిన అహ్మద్ ద్వయం, చెన్నై ముందు మోస్తరు టార్గెట్
IPL Highest Scores: రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | ఉప్పల్ లో తన రికార్డును తనే బ్రేక్ చేసిన సన్ రైజర్స్ | ABP DesamCSK vs MI IPL 2025 Match Preview | నేడు చెన్నైతో తలపడుతున్న ముంబై | ABP DesamSRH vs RR IPL 2025 Match Preview | రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొట్టనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rohit Sharma Duck Outs: రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
రోహిత్ శర్మ ఖాతాలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
IPL 2025 CSK vs MI: ముంబైని మడతపెట్టిన అహ్మద్ ద్వయం, చెన్నై ముందు మోస్తరు టార్గెట్
ముంబైని మడతపెట్టిన అహ్మద్ ద్వయం, చెన్నై ముందు మోస్తరు టార్గెట్
IPL Highest Scores: రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
రికార్డులతో దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్, ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు చూశారా
CM Chandrababu: అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
అన్న క్యాంటీన్ కు రూ.1 కోటి విరాళం, చంద్రబాబుకు చెక్ అందించిన నార్నే రంగారావు ఫ్యామిలీ
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
SRH Vs RR Result Update:  స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. ఈ సీజ‌న్లో సొంత‌గ‌డ్డ‌పై గెలిచిన‌ తొలి జ‌ట్టు.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
స‌న్ రైజ‌ర్స్ గ్రాండ్ విక్ట‌రీ.. పోరాడి ఓడిన రాజ‌స్థాన్.. జురెల్, శాంస‌న్ పోరాటం వృథా 
Sikandar Trailer: కండలవీరుడు సల్మాన్ ఖాన్ యాక్షన్ గూస్ బంప్స్ - 'సికిందర్' మూవీ ట్రైలర్ వచ్చేసింది
కండలవీరుడు సల్మాన్ ఖాన్ యాక్షన్ గూస్ బంప్స్ - 'సికిందర్' మూవీ ట్రైలర్ వచ్చేసింది
Embed widget