News
News
X

Gyanvapi Case: మసీదులో పూజలకు అనుమతినివ్వాలన్న పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ-ఎప్పుడంటే?

జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగానికి పూజలు చేసుకునేలా అనుమతినివ్వాలన్న పిటిషన్‌పై సుప్రీం కోర్టు జులై 21న విచారణ చేపట్టనుంది.

FOLLOW US: 

జులై 21వ తేదీన హియరింగ్

జ్ఞానవాపి మసీదులో వెలుగులోకి వచ్చిన శివలింగానికి పూజలకు అనుమతినివ్వాలన్న పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. ఈ నెల 21వ తేదీన హియరింగ్‌కు అనుమతినిచ్చింది. అదే సమయంలో శివలింగం ఎన్నేళ్ల క్రితందో కూడా తేల్చి చెప్పాలని ఆదేశించింది. కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా స్పష్టమైన సమాచారం ఇవ్వాలని చెప్పింది. జస్టిస్ ఎన్‌వీ రమణ,జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది. దీంతో పాటు అంజుమాన్ ఇంతెజామియా మసీద్ కమిటీ వేసిన పిటిషన్‌ను కూడా విచారించనుంది. మసీదు లోపల సర్వే చేపట్టటాన్ని వ్యతిరేకిస్తూ ఈ కమిటీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఈ హియరింగ్ జరగనుంది. శివలింగం బయటపడిన ప్రాంతాన్ని పరిరక్షించాలని ఇప్పటికే సుప్రీం కోర్టు వారణాసి జిల్లా కోర్టుకి ఆదేశాలు జారీ చేసింది. నమాజ్ చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. 

శివలింగానికి పూజలకు అనుమతి కోసం పిటిషన్ 

జ్ఞానవాపి మసీదులోని వాజుఖానాలో బయటపడిన శివలింగానికి హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న ఈ మసీదులో కొన్ని నెలల క్రితం శివలింగం బయట పడింది. చాన్నాళ్ల పాటు ఈ అంశంపై వాదనలు జరిగాయి. అయితే శ్రీకృష్ణ జన్మభూమి ముక్తిస్థల్ అధ్యక్షుడు రాజేశ్ మని త్రిపతి, సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేశారు. శ్రావణ మాసం ప్రారంభమైనందున మసీదులోని శివలింగానికి హిందువులు పూజా కార్యక్రమాలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కోరారు. ఇది హిందువుల హక్కు అని అందులో ప్రస్తావించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మతపరమైన కార్యక్రమాలు చేసుకునే హక్కు అందరికీ ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. శ్రావణ మాసంలో శివుడికి పూజలు చేయటం హిందూ ఆచారమని, వారి హక్కులని, 
మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పూజలకు అనుమతినివ్వాలని కోరారు. 

ఏప్రిల్‌లో హిందూ మహిళల పిటిషన్

ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన వారణాసి కోర్టు ఓ కీలక తీర్పునిచ్చింది. మసీదులోని శివలింగానికి  పూజలకు అనుమతించాలని ఓ ఐదుగురు హిందూ మహిళలు కోర్ట్‌లో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్ట్...ఈ అంశంపై సర్వే చేయటమే కాకుండా లోపల వీడియో తీసి సాక్ష్యాధారాలు బయట పెట్టాలని ఆదేశించింది. మే 16వ తేదీన ఈ సర్వే పూర్తైంది. మే 19న కోర్ట్‌లో ఈ సర్వేను ప్రవేశపెట్టారు. వీడియోగ్రఫీ సర్వేలో మసీదులో శివలింగం బయపడిందని హిందువులు వాదించారు. కానీ ముస్లింలు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. వాజుఖానాలో ఏర్పాటు చేసిన వాటర్‌ ఫౌంటేన్‌కు సంబంధించిన శకలం అని వివరించారు. మే 20 వ తేదీన సుప్రీం కోర్టు ఈ కేసుని వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. 

Published at : 18 Jul 2022 02:52 PM (IST) Tags: supreme court Gyanavapi Sc to Hear Plea Plea Shivaling

సంబంధిత కథనాలు

Railway New Coaches : భారతీయ రైల్వేకు కొత్త బోగీలు, సౌకర్యాలతో పాటు స్పీడ్ పెరిగిందోచ్!

Railway New Coaches : భారతీయ రైల్వేకు కొత్త బోగీలు, సౌకర్యాలతో పాటు స్పీడ్ పెరిగిందోచ్!

Raigad Suspicious Boat: సముద్రంలో కొట్టుకొచ్చిన AK-47ల పడవ- హోంశాఖ హై అలర్ట్‌!

Raigad Suspicious Boat: సముద్రంలో కొట్టుకొచ్చిన AK-47ల పడవ- హోంశాఖ హై అలర్ట్‌!

Prashant Kishor:ఫెవికాల్‌తో సీఎం కుర్చీకి అతుక్కుపోయారు, బిహార్ సీఎం నితీశ్‌పై పీకే విమర్శలు

Prashant Kishor:ఫెవికాల్‌తో సీఎం కుర్చీకి అతుక్కుపోయారు, బిహార్ సీఎం నితీశ్‌పై పీకే విమర్శలు

Jammu Kashmir Elections: స్థానికేతరులూ ఓటు వేయొచ్చు, కొత్తగా 25 లక్షల మందికి అవకాశం - కశ్మీర్ ఈసీ

Jammu Kashmir Elections: స్థానికేతరులూ ఓటు వేయొచ్చు, కొత్తగా 25 లక్షల మందికి అవకాశం - కశ్మీర్ ఈసీ

YouTube Channels Blocked: ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేంద్రం వేటు, అసత్య ప్రచారాలు చేసినందుకే

YouTube Channels Blocked: ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేంద్రం వేటు, అసత్య ప్రచారాలు చేసినందుకే

టాప్ స్టోరీస్

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు