అన్వేషించండి

సనాతన ధర్మ వివాదంతో విపక్ష కూటమిలో విభేదాలు? సెల్ఫ్ డిఫెన్స్‌లో పడిన కాంగ్రెస్

Sanatan Dharma Row: సనాతన ధర్మ వివాదానికి తమకు సంబంధం లేదని కాంగ్రెస్ తేల్చి చెబుతోంది.

Sanatan Dharma Row:


కాంగ్రెస్ దూరం దూరం..

కూటమిగా ఏర్పడిన తరవాత అందరి మాటా ఒకటే ఉండాలి. అందరి బాటా ఒకటే అవ్వాలి. కానీ...I.N.D.I.A కూటమిలో మాత్రం ఈ ఐక్యత కనిపించడం లేదు. అందుకు కారణం...ఒక్కో పార్టీది ఒక్కో సిద్ధాంతం అవడం. ఆయా రాష్ట్రాల రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆయా పార్టీల సిద్ధాంతాలు ఆధారపడి ఉంటాయి. ఇది సహజమే. ఇలా సైద్ధాంతిక వైరుధ్యాలున్న పార్టీలు ఒక్క చోటకు వచ్చినప్పుడు మాత్రం కొన్ని విషయాల్లో "మేము ఒక్కటే" అని చెప్పక తప్పదు. ఇప్పుడు సనాతన ధర్మం చుట్టూ తిరుగుతున్న రాజకీయాల్లో ఆ యునిటీ లేదని క్లారిటీ వచ్చేసింది. ద్రవిడ రాజకీయాల సిద్ధాంతం మొదటి నుంచి హిందూ ధర్మానికి వ్యతిరేకంగానే ఉంది. అదే మరోసారి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో స్పష్టమైంది. ఎన్నికల సమయంలో ఈ మాత్రం సంచలనం కోరుకోవడం పొలిటికల్ వ్యూహమే. తమిళనాట ఈ రాజకీయాలు చెల్లుతాయి. కానీ...అన్నిచోట్లా ఇది వర్కౌట్ అవ్వదు. అందుకే కాంగ్రెస్ ఈ విషయంలో DMKతో దూరం పాటిస్తోంది. అన్ని మతాలనూ గౌరవిస్తామని తేల్చి చెబుతోంది. "ఎందుకొచ్చిన తలనొప్పి" అని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది. పైగా ఇప్పటికే బీజేపీ DMK పార్టీ సిద్ధాంతాన్ని కాంగ్రెస్‌కీ అంటగట్టే ప్రయత్నం చేస్తోంది. ఇది ఫైనల్‌గా పార్టీ క్రెడిబిలిటీని డ్యామేజ్ చేస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. అందుకే ఆ పార్టీ ప్రతినిధులు వరుస పెట్టి ప్రెస్‌మీట్‌లు పెడుతున్నారు. చాలా క్లారిటీగా తమ స్టాండ్‌ ఏంటో వివరిస్తున్నారు. 

"మాకు అన్ని మతాలూ సమానమే. ఏ మతాన్ని కూడా చిన్నచూపు చూడాల్సిన పని లేదు. భారత రాజ్యాంగం కూడా దీన్ని ఒప్పుకోదు. అన్ని మతాలనూ సమానంగా చూడడమే కాంగ్రెస్ సిద్ధాంతం. విపక్ష కూటమిది కూడా ఇదే అభిప్రాయం"

- పవన్ ఖేడా, కాంగ్రెస్ ప్రతినిధి 

మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే కూడా ఈ వివాదంపై స్పందించారు. అంబేడ్కర్ చూపిన బాటలోనే తామూ నడుస్తున్నామని, అన్ని మతాలూ ఒక్కటే అని తేల్చి చెప్పారు. 

"సర్వ ధర్మ సమాభవ అని అంబేడ్కర్ చెప్పారు. అంటే అన్ని మతాలూ ఒక్కటే. ఈ విషయంలో మా స్టాండ్ చాలా క్లియర్‌గా ఉంది. ఏ మతాన్ని కించపరచాలని కానీ, ఒకరి మనోభావాలు దెబ్బతీయాలని కానీ కాంగ్రెస్‌ ఎప్పటికీ అనుకోదు"

- నానా పటోలే, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ 

చీలికలు తప్పవా..? 

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తామని స్పష్టం చేశారు. I.N.D.I.A కూటమిలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్టాలిన్ వ్యాఖ్యల్ని ఖండించారు. అతనికి ఇంకా అనుభవం లేదని, ఎలా మాట్లాడాలో తెలియదని అన్నారు. ఇలా అన్ని పార్టీలూ సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డాయి. వీలైనంత వరకూ ఈ వివాదం నుంచి బయట పడాలని చూస్తున్నాయి. కానీ...DMK మాత్రం వెనక్కి తగ్గడం లేదు.  ఈ వివాదం కూటమిలో చీలికలు తీసుకొస్తుందా అన్న అనుమానాలకూ తావిస్తోంది. 

Also Read: భారత్ అన్ని దేశాలనూ కలిపే వారధి లాంటిది, ABP న్యూస్‌తో G20 చీఫ్ కో ఆర్డినేటర్ శ్రింగ్లా

 

టాప్ హెడ్ లైన్స్

Top 5 Road Trips in India : రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
రోడ్ ట్రిప్​కి వెళ్లాలనుకుంటున్నారా? బైక్, కారుపై వెళ్లేందుకు ఇండియాలో టాప్ 5 బెస్ట్ ప్లేస్​లు ఇవే
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
రాజ్యాంగ దినోత్సవం 2026: మత ప్రచారం చేయవచ్చు, మత మార్పిడి కాదు! ఆర్టికల్ 25 ఇంకా ఏం చెబుతోంది?
రాజ్యాంగ దినోత్సవం 2026: మత ప్రచారం చేయవచ్చు, మత మార్పిడి కాదు! ఆర్టికల్ 25 ఇంకా ఏం చెబుతోంది?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Miyapur Layout: మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
Missing Fishermen Safe: క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
క్షేమంగా ఉప్పాడ తీరానికి చేరిన ఏడుగురు మత్స్యకారులు.. ఫలించిన గాలింపు చర్యలు
CM Chandrababu: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Rare Medical Case: వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
Kadapa BPT Student: ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
ప్రియుడి చేతిలో మోసపోయిన బీపీటీ విద్యార్థిని.. సోదరి పెళ్లి నగలు తాకట్టు పెట్టడంతో ఆత్మహత్య!
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
Embed widget