Swiggy delivery boy to Model: స్విగ్గీ బాయ్ నుంచి టాప్ మోడల్‌గా ముంబయి యువకుడు - ఈ అసాధారణ జర్నీ ఎలా?
Sahil Singh: ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా తన జీవితాన్ని ప్రారంభించాడు. తన జీవన ప్రయాణం ఎలా సాగిందో చెప్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
Swiggy delivery boy to Model: కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సామెత వినే ఉంటాం.. అవును, మనసులో సంకల్పంగా బలంగా ఉండి.. కృషి, పట్టుదలతో ముందుకు సాగితే మనిషి దేనినైనా సాధించవచ్చు. సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ యువకుడు.. చిన్న నాటి నుంచి కన్న కలను కష్టపడి సాధించుకుని ఔరా అనిపించుకున్నాడు. ప్రస్తుతం అతడి గురించి దేశమంతా మాట్లాడుకుంటుంది.
డెలివరీ ఏజెంట్ గా ప్రస్తానం
ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా ఆ వ్యక్తి తన జీవితాన్ని ప్రారంభించాడు. కానీ ఏ నాటికైనా మోడల్ గా పేరు తెచ్చుకోవాలని చిన్న నాటి నుంచి కలలు కన్నాడు. తన కలను సాధించుకునే క్రమంలో అతడికి ఎన్నో అవమానాలు, తిరస్కారాలు ఎదురయ్యాయి. వాటిని దాటి ముందుకు సాగి ప్రస్తుతం ఆ వ్యక్తి ప్రొఫెషనల్ మోడలయ్యాడు. అతడే ముంబైకి చెందిన షాలీ సింగ్. అయితే తన జీవన ప్రయాణం ఎలా సాగిందో చెప్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
వివరాళ్లోకి వెళితే..
ముంబైకి చెందిన షాలీ సింగ్.. చిన్నతనంలో రోడ్డు పక్కన వీధి వ్యాపారం చేసుకుంటే పర్సులు అమ్ముకునేవాడు. ఆ సమయంలో గోడపై ఓ మోడల్ పోస్టర్ దూశాడు. అప్పటి నుంచి అతడు ఎలాగైనా మోడల్ అవ్వాలని కలలు కన్నాడు. 2012లో మొదటిసారి తను చదివే స్కూల్లో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొన్నాడు. తన ప్రదర్శనకు గాను మొదటి బహుమతి లభించింది. ఆ తర్వాత అతడి కల మరింత బలపడింది. పాఠశాల విద్య పూర్తయ్యాక జీవనోపాధి కోసం స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా మారాడు. ఆ తర్వాత బర్గర్ కింగ్‌లో, మ్యాంగో మార్కెట్‌లో పని చేశాడు. అలా పని చేసుకుంటూనే మోడలింగ్ అవకాశాల కోసం ప్రయత్నాలు కొనసాగించేవాడు. కానీ, షాలీ సింగ్ ఎత్తు తక్కువగా ఉండడంతో ఎవరూ అవకాశం ఇవ్వకుండా తిరస్కరించారు.
200కు పైగా ఆడిషన్లు
అలా దాదాపు 200కు పైగా ఆడిషన్లకు హాజరయ్యాడు. కానీ ఎక్కడా తన కల నెరవేర్చుకునేందుకు అవకాశం లభించలేదు. మోడల్ అవకాశాలకోసం ప్రయత్నిస్తూనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాషన్ టిప్స్ చెప్తూ నెటిజన్లకు చాలా దగ్గరయ్యాడు. అయితే ఈ సంవత్సరం ఓ సంస్థ నిర్వహించిన మోడలింగ్ ఆడిషన్స్‌కు వెళ్లాగా.. అక్కడ సైతం అతడికి నిరాశే ఎదురైంది. అయితే వారిని అభ్యర్థించగా హీల్స్ ధరించి ర్యాంప్ చేయాలనే కండిషన్‌పై ఒప్పుకున్నాడు. దీంతో అతడు ఐదు అంగుళాల హీల్స్ వేసుకుని ర్యాంప్ వ్యాక్ చేశాడు. దీంతో అతని ఆత్మాభిమానం మరింత పెరిగింది. ఇప్పుడు మరిన్ని అవకాశాలు వస్తున్నట్టు తెలిపాడు.
వీడియో వైరల్
ఇక, స్విగ్గీ డెలివరీ ఏజెంట్ నుంచి ప్రొఫెషనల్ మోడల్‌గా సాగిన తన ప్రయాణాన్ని తెలుపుతూ ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తుంది. ఇప్పటి వరకు ఈ వీడియోను నాలుగు మిలియన్ల మంది ప్రజలు వీక్షించారు. ఇక, షాలీ సింగ్ కృషిని మెచ్చుకుంటూ నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. మీరు ప్రతి ఒక్కరికీ ఇన్ స్పిరేషన్.. ఇలాగే కొనసాగించండి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కలలు సాకారం కావాలంటే అంకిత భావం అవసరమని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
View this post on Instagram