Republic Day Parade Tickets: రిపబ్లిక్ డే 2025 పరేడ్ టిక్కెట్ ఎలా బుక్ చేసుకోవాలి - ధరల పూర్తి వివరాలు ఇలా
Republic Day Parade Tickets: రిపబ్లిక్ డే పరేడ్ టిక్కెట్‌లను అధికారిక పోర్టల్, aamantan.mod.gov.in లేదా అధికారిక యాప్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

Republic Day Parade Tickets: భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకునేందుకు సిద్దమవుతోంది. దేశ పౌరులు ఈ దినోత్సవాన్ని పూర్తి ఉత్సాహంతో జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఢిల్లీలో, రాజ్‌పథ్ భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం, పోలీసు, పారామిలిటరీ బృందాలతో కూడిన అద్భుతమైన రెజిమెంటల్ కవాతులకు వేదికగా మారింది. ఈ కవాతులో ప్రతి రాష్ట్రం తమ సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ గ్రాండ్ రిపబ్లిక్ డే పరేడ్‌ను చూడాలనుకునే వారి కోసం మంత్రిత్వ శాఖ టిక్కెట్ ధరలను నిర్ణయించింది.
రిపబ్లిక్ డే ఈవెంట్‌ల టిక్కెట్ ధరలు
ఈవెంట్స్ కోసం మంత్రిత్వ శాఖ పాకెట్-ఫ్రెండ్లీ ధరలను నిర్ణయించింది:
- రిపబ్లిక్ డే పరేడ్ : టికెట్ కు రూ.100, రూ.20
- బీటింగ్ రిట్రీట్ ఫుల్ డ్రెస్ రిహార్సల్ : ఒక్కో టిక్కెట్ కు రూ. 20
- బీటింగ్ రిట్రీట్ వేడుక : టిక్కెట్‌కు రూ. 100
ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్: తేదీలు, ప్రక్రియ
ఆన్‌లైన్ బుకింగ్ విండో జనవరి 2 నుంచి జనవరి 11 వరకు ఓపెన్ చేసి ఉంచారు. ఇది మీ సీట్లను బుక్ చేసుకోవడానికి తగినంత సమయాన్ని కల్పించింది.
టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలంటే..
- అధికారిక పోర్టల్ www.aamantran.mod.gov.in ని సందర్శించండి.
- రిపబ్లిక్ డే పరేడ్ లేదా బీటింగ్ రిట్రీట్ వంటి మీరు హాజరు కావాలనుకుంటున్న ఈవెంట్‌ను ఎంచుకోండి.
- ధృవీకరణ కోసం మీ ID, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
- టిక్కెట్ల సంఖ్య ఆధారంగా చెల్లింపును పూర్తి చేయండి.
మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చిలా..
అదనపు సౌలభ్యం కోసం, మంత్రిత్వ శాఖ ఆమంత్రన్ మొబైల్ యాప్ (Aamantran Mobile App)ను ప్రారంభించింది. ఇది ఆండ్రాయిడ్ (Android) యూజర్లు గూగుల్ ప్లే (Google Play), ఐవోఎస్ (iOS) యూజర్స్ యాప్ స్టోర్ (App Store) ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది మీరు ఎక్కడి నుంచైనా స్మార్ట్‌ఫోన్ సాయంతో టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి త్వరిత, సులభమైన మార్గాన్ని అందిస్తుంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఆపై టిక్కెట్స్ కేటగిరీలో స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించి బుక్ చేసుకోవడమే.
ఆఫ్‌లైన్ టిక్కెట్ బుకింగ్ వివరాలు
మీరు వ్యక్తిగతంగా టిక్కెట్లు కొనుగోలు చేయాలనుకుంటే, ఢిల్లీలోని వివిధ ప్రదేశాలలో అధికారులు ఫిజికల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ బూత్‌ల నుంచి మీరు నేరుగా టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడీ (ID)ని తీసుకువెళ్లడం మర్చిపోకండి.
Also Read : Maha Mandaleswar: ఐటీ ఉద్యోగాన్ని వదిలి అఖారాలో మహామండలేశ్వరుడిగా దీక్ష చేపట్టిన యూఎస్ యువకుడు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

